సింహం సినిమాల్ని మించి చిరంజీవి కోసం బాదుతున్నాడా?
చిరంజీవి బాడీ లాంగ్వేజ్‌ని, స్క్రీన్ ప్రెజెన్స్‌ని ఎలివేట్ చేసే బీజీఎమ్ గనుక గ్లింప్స్‌లో ఉంటే సినిమాపై క్రేజ్ ఒక్కసారిగా పీక్స్‌కు వెళ్తుంది. ఇది థమన్‌కు ఒక రకంగా టెస్ట్ లాంటిదే.
By: Srikanth Kontham | 15 July 2026 12:12 PM ISTటాలీవుడ్ మ్యూజికల్ సెన్సేషన్ థమన్ మార్క్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో థియేటర్లను ఎలా హోరెత్తిస్తున్నాడో చెప్పాల్సిన పనిలేదు. నందమూరి బాలకృష్ణ సినిమాల విషయంలో తమన్ ప్రతిభ అద్భుతం. బాలయ్య పవర్‌ఫుల్ బాడీ లాంగ్వేజ్‌కు, థమన్. అందించిన బీజీఎం తోడవ్వడంతో? థియేటర్లలో ఎనర్జీ వేరే లెవల్లో కనిపించింది. ఆ రేంజ్ మ్యూజిక్‌తో బాలయ్య సినిమాలను థమన్ మరో స్థాయికి తీసుకెళ్లారన్నది వాస్తవం. ఈనేపథ్యంలో మరో సీనియర్ స్టార్ మెగాస్టార్ చిరంజీవిని అంతకుమించి లేపే ప్లాన్ లో కనిపిస్తున్నారు.
ప్రస్తుతం చిరంజీవి 158వ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల రిలీజ్ అయిన 'లెనిన్' బీజీఎమ్ పరంగా థమన్ ప్రశంసలు అందు కున్నప్పటికీ పాటల విషయంలో మాత్రం మిశ్రమ స్పందన వచ్చింది. ఈ లోటును చిరంజీవి సినిమాతో భర్తీ చేయాలని థమన్ కసితో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో థమన్ చేసిన 'ఎంతైనా ఊహించుకోండి' అనే వ్యాఖ్య మెగా అభిమానుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. గత సినిమాల కంటే భిన్నంగా? చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్లుగా సంగీతం ఉండబోతుందని థమన్ సంకేతాలు ఇవ్వడమే ఆసక్తికి కారణం.
బాలయ్య సినిమాలకు ఏ స్థాయిలో థమన్ తన మ్యూజిక్‌తో థియేటర్లను దద్దరిల్లేలా చేశారో? అంతకు మించిన మేజిక్ చిరంజీవి చిత్రంలో చూడాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రాబోయే గ్లింప్స్ పైనే అందరి కళ్లు ఉన్నాయి. ఆ చిన్న వీడియో క్లిప్‌లోనే థమన్ తన సత్తా ఏంటో నిరూపించుకోవాల్సి ఉంది. చిరంజీవి బాడీ లాంగ్వేజ్‌ని, స్క్రీన్ ప్రెజెన్స్‌ని ఎలివేట్ చేసే బీజీఎమ్ గనుక గ్లింప్స్‌లో ఉంటే సినిమాపై క్రేజ్ ఒక్కసారిగా పీక్స్‌కు వెళ్తుంది. ఇది థమన్‌కు ఒక రకంగా టెస్ట్ లాంటిదే.
బాలయ్య సినిమాల్లో చూపించిన మాస్ పవర్ ను చిరంజీవికి ఏ విధంగా మారుస్తారనేది ఆసక్తికరమైన అంశం. ఇద్దరు అగ్రనటుల సినిమాలకు సంగీతం అందించడం అంటే మాటలు కాదు. వారి ఫ్యాన్ బేస్‌ను సంతృప్తి పరచడం పెద్ద సవాల్. థమన్ తనదైన శైలిలో ఈ సవాల్‌ను స్వీకరించి బాణీల పరంగా కూడా బాలయ్య సినిమాలను మించిపోయేలా అద్భుతాలు సృష్టిస్తాడా? లేదా అన్నది చూడాలి. తమన్ ఈ సినిమాతో పాటు మరికొన్ని చిత్రాలకు కూడా సంగీతం అందిస్తోన్న సంగతి తెలిసిందే. దేవి శ్రీ ప్రసాద్ యాక్టింగ్ పై దృష్టి పెట్టడంతో? అతడి ఛాన్సులు కూడా థమన్ ఖాతాలోనే పడుతున్నాయి. ఆ రకంగా కూడా థమన్ కు బాగా కలిసొస్తుంది.
