Begin typing your search above and press return to search.

తమన్ లో ఛేంజ్ అవసరమే.. కానీ..

ఒకప్పుడు సినిమా సాంగ్ హిట్ అయితే చాలు.. చాలా కాలం పాటు ప్రేక్షకుల నోళ్లలో నానేది.

By:  M Prashanth   |   22 Oct 2026 4:00 AM IST
తమన్ లో ఛేంజ్ అవసరమే.. కానీ..
X

ఒకప్పుడు సినిమా సాంగ్ హిట్ అయితే చాలు.. చాలా కాలం పాటు ప్రేక్షకుల నోళ్లలో నానేది. ఇప్పుడు మాత్రం కొత్త సాంగ్స్ వస్తున్న కొద్దీ పాత పాటలను మర్చిపోతున్నారు. కొన్ని సాంగ్స్ వెంటనే ఆకట్టుకుంటుంటే.. మరికొన్ని పెద్దగా ఎఫెక్ట్ చూపలేకపోతున్నాయి. ప్రేక్షకుల టేస్టుల్లో వస్తున్న ఛేంజ్ సంగీత దర్శకులకు కొత్త సవాల్‌ గా మారుతోంది. ఇప్పుడు తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న తమన్ సంగీతంపై కూడా చర్చ జరుగుతోంది.

నిజానికి తమన్ మ్యూజిక్ కు స్పెషల్ స్టైల్ ఉంది. భారీ బీట్స్, స్పీడ్ సాంగ్స్, హీరో ఎలివేషన్ సీన్స్ కు ఇచ్చే బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్ ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. థియేటర్లలో ఫ్యాన్స్ లో జోష్ నింపే మ్యూజిక్ ను అందించడంలో ఆయనకు గుర్తింపు ఉంది. అయితే అదే సమయంలో ప్రేక్షకులు మెలోడీలు, మనసుకు హత్తుకునే పాటలను కూడా కోరుకుంటున్నారు. అందుకే ప్రతి సినిమాకు ఒకే తరహా సంగీతం కాకుండా.. కథకు తగ్గట్టుగా కొత్త ప్రయోగాలు చేయడం ముఖ్యం.

ఒక సినిమాలో మాస్ పాటలు బాగుంటే.. మరో సినిమాలో లవ్ సాంగ్స్ స్పెషల్ గా నిలవొచ్చు. ఇంకో సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోరే స్టోరీకి మెయిన్ అసెట్ గా మారొచ్చు. సంగీత దర్శకుడిగా తన టాలెంట్ చూపించడానికి ఇలాంటి వైవిధ్యం అవసరం. తమన్ ఇప్పటికే తన సంగీతంతో ఎన్నో సినిమాలకు స్త్రెంత్ అందించారు. అయితే మారుతున్న ప్రేక్షకుల టేస్టులకు తగ్గట్టుగా కొత్త బాణీలు, కొత్త తరహా సంగీతంతో ముందుకు వెళ్తే ఆయన పాటలకు మరింత ఆదరణ లభించే అవకాశం ఉంది.

ఇప్పుడు పాటలకు సంబంధించిన పోటీ కూడా పెరిగింది. సినిమా విడుదలకు ముందే సాంగ్స్ ప్రేక్షకుల దగ్గరకు చేరుతున్నాయి. యూట్యూబ్, మ్యూజిక్ యాప్స్, సోషల్ మీడియా ద్వారా వాటికి వస్తున్న రెస్పాన్స్ వెంటనే తెలుస్తోంది. కొన్ని సాంగ్స్ విడుదలైన వెంటనే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటే.. మరికొన్ని పాటలు ఆదరణ పొందడానికి సమయం తీసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం భారీ మ్యూజిక్ పైనే కాకుండా.. పాటలోని బాణీ, వినసొంపైన సంగీతం, మళ్లీ మళ్లీ వినాలనిపించే విషయాలపై కూడా ఫోకస్ పెట్టాలి.

అయితే ఒకటి రెండు పాటలకు వచ్చిన రెస్పాన్స్ తో మ్యూజిక్ డైరెక్టర్ టాలెంట్ ను అంచనా వేయలేం. సినిమా స్టోరీ, సాంగ్స్ షూటింగ్, ప్రమోషన్స్ వంటి ఎలిమెంట్స్ కూడా వాటి ఆదరణపై ఎఫెక్ట్ చూపిస్తాయి. కొన్ని సాంగ్స్ సినిమా విడుదలైన తర్వాతే ప్రేక్షకులకు మరింత దగ్గరవుతాయి. కాబట్టి ప్రతి సాంగ్ ను ఒకే యాంగిల్ లో చూడటం సరికాదు. ఇప్పుడు తమన్ ప్రత్యేకమైన శైలిని పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం లేదు.

అదే సమయంలో కొత్తదనానికి దూరంగా ఉండకూడదు. మాస్ పాటలతో పాటు మంచి మెలోడీలు, కథకు స్త్రెంత్ ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కొత్త ప్రయోగాలతో ప్రేక్షకులకు భిన్నమైన ఎక్స్ప్రీరియన్స్ అందించాలి. తన స్త్రెంత్ ను కంటిన్యూ చేస్తూనే కొత్తదనాన్ని యాడ్ చేస్తే తమన్ జర్నీ మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. మరి రాబోయే సినిమాల్లో ఆయన ఎలాంటి ఛేంజెస్ చూపిస్తారో చూడాలి.