Begin typing your search above and press return to search.

మరో దేశంలో తమన్ అడ్డా?

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి అందరికీ తెలిసిందే. డ్రమ్మర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన ఆయన.. ఇప్పుడు ప్రముఖ సంగీత దర్శకుడిగా ఎదిగారు.

By:  M Prashanth   |   5 Oct 2025 1:46 PM IST
మరో దేశంలో తమన్ అడ్డా?
X

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి అందరికీ తెలిసిందే. డ్రమ్మర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన ఆయన.. ఇప్పుడు ప్రముఖ సంగీత దర్శకుడిగా ఎదిగారు. ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందుకున్న తమన్.. ప్రస్తుతం వివిధ సినిమాలకు వర్క్ చేస్తున్నారు. తన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అందరినీ మెప్పిస్తున్నారు.

రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఓజీ మూవీకి గాను తన వర్క్ తో ఓ రేంజ్ లో ప్రశంసలు అందుకున్న తమన్.. ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ అఖండ సీక్వెల్ సహా వివిధ సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్నారు. ముఖ్యంగా బడా హీరోల చిత్రాలకు మోస్ట్ వాంటెడ్ గా మారారు. ఆయన అందించే పాటలు, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటున్నాయి.

అయితే సినిమాలే కాకుండా, టీవీ షోలు, రియాలిటీ షోలు, స్పోర్ట్స్ ఈవెంట్లలో కూడా తమన్ సందడి చేస్తున్నారు. ఇండియన్ ఐడల్ వంటి మ్యూజిక్ షోలలో జడ్జిగా కనిపిస్తున్నారు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో కూడా పాల్గొంటున్నారు. తద్వారా కెరీర్ లో ఇప్పుడు అత్యున్నత స్థాయిలో ఉన్న తమన్.. ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటారు.

తాజాగా ఆయనకు సంబంధించిన మరో వార్త నెట్టింట వైరల్ గా మారింది. అమెరికాలోని డల్లాస్ లో తమన్.. మ్యూజిక్ స్టూడియోను ఏర్పాటు చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. తరచూ ఇండియా, అమెరికాకు తిరుగుతున్న తమన్.. రీసెంట్ గా ఆ నిర్ణయం తీసుకున్నట్లు ఇప్పుడు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

అయితే తమన్ అమెరికాలో స్టూడియో పెట్టి.. అనేక ప్రతిభావంతులైన యువతకు ఉపాధి కల్పించనున్నారని తెలుస్తోంది. టాలెంటెడ్ పీపుల్ ను ప్రోత్సహించనున్నారని సమాచారం. అదే సమయంలో స్టూడియో కోసం ఈబీ-5 క్యాటగిరీ కింద పెట్టుబడులు పెడతారని, తద్వారా అక్కడ గ్రీన్ కార్డు అందుకోనున్నారని వినికిడి.

కాగా.. ఇప్పటి వరకు డల్లాస్ లో అనేక సార్లు మ్యూజికల్ ఈవెంట్స్ ను నిర్వహించారు తమన్. 2022, 2024లో జరిగిన ఈవెంట్స్ తో ఆయన ఉర్రూతలూగించారు. 2022 అక్టోబర్‌ లో అల అమెరికాపురంలో టీమ్‌ తో కచేరీ, 2024 మేలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో భారీ మ్యూజికల్ ఈవెంట్లు నిర్వహించారు. ఇప్పుడు అక్కడ సొంత స్టూడియోను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు.