OG థమన్.. న్యూ వెర్షన్ లోడింగ్..!
సుజిత్ డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న సినిమా ఓజీ. సినిమా మొదటి నుంచి ఒక కొత్త మూడ్ క్రియేట్ చేసింది.
By: Ramesh Boddu | 3 Sept 2025 12:13 PM ISTసుజిత్ డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న సినిమా ఓజీ. సినిమా మొదటి నుంచి ఒక కొత్త మూడ్ క్రియేట్ చేసింది. రన్ రాజా రన్, సాహో సినిమాల తర్వాత సుజిత్ నుంచి వస్తున్న థర్డ్ మూవీ ఇది. టెక్నికల్ గా సూపర్ నాలెడ్జ్ ఉన్న సుజిత్ ఈసారి వెండితెర మీద పవర్ స్టార్ స్టోర్మ్ ని చూపించడానికి రెడీ అయ్యాడు. ఓజీ గ్లింప్స్ తోనే ఫ్యాన్స్ కి మెంటల్ ఎక్కించేశాడు. ఐతే ఓజీ సినిమా కమిటైన దగ్గర నుంచి ఆ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న థమన్ కూడా క్రేజీగా మారిపోయాడు.
థమన్ అప్డేటెడ్ వెర్షన్..
ఓజీ గ్లింప్స్ తోనే నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్, బిజిఎం తో కేక పెట్టించాడు థమన్. అంతేకాదు ఓజీ నుంచి వస్తున్న ప్రతి సాంగ్ కి థమన్ సంథింగ్ స్పెషల్ అనిపిస్తూ వచ్చాడు. పవర్ స్టోర్మ్ తో పాటు సువ్వి సువ్వి సాంగ్ కూడా థమన్ అదరగొట్టాడు. ఓజీ మీద థమన్ ప్రేమ ఏంటన్నది అతను ఇచ్చిన మ్యూజిక్ ని చూస్తేనే అర్ధమవుతుంది. ఓజీ సినిమాతో థమన్ న్యూలీ అప్డేటెడ్ వెర్షన్ గా తనని తాను లోడ్ చేసుకున్నట్టు ఉన్నాడు.
నిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా వచ్చిన టీజర్ లో కూడా మ్యూజిక్ తోనే థమన్ వారెవా అనిపించాడు. సో మొత్తానికి తెర మీద పవర్ స్టార్ బీభత్సానికి తెరవెనక థమన్, సుజిత్ ఇద్దరు వీరంగం ఆడేసినట్టు ఉన్నారు. థమన్ అయితే ఓజీ మీద చాలా అంటే చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఓజీ విషయంలో ఒకటి మాత్రం బాగా అర్ధమవుతుంది. సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే మిగతా అంతా ఒక ఎత్తు అయితే థమన్ ఇచ్చిన మ్యూజిక్ మరో ఎత్తు అనేలా ఉంది.
పవర్ స్టార్ ఫ్యాన్ గా థమన్..
థమన్ పూర్తిగా పూనకాలు తెప్పించేలా మ్యూజిక్ ఇవ్వడం చూస్తుంటే ఓజీని పవర్ స్టార్ ఫ్యాన్ గా థమన్ ఓన్ చేసుకున్నాడని అనిపిస్తుంది. మరి ఈ మ్యూజిక్ విధ్వంసానికి తెర మీద యాక్షన్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. థమన్ కి ఓజీ చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా మారింది. ఈ సినిమాతో తన సత్తా ఏంటో చాటాలని చూస్తున్నాడు.
ఓజీ ఆల్బం ఆల్రెడీ సూపర్ హిట్.. ఇక సినిమాలో సాంగ్ ప్లేస్ మెంత్స్, బిజిఎం వర్క్ అవుట్ అయితే కేవలం థమన్ మ్యూజిక్ కోసమే రిపీటెడ్ ఫుట్ ఫాల్స్ ఉండేలా చేస్తాడని చెప్పొచ్చు. ఓజీ థమన్ సోషల్ మీడియా ప్రమోషన్స్ కూడా ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇస్తున్నాయి. ఓజీ ప్రతి అప్డేట్ తో ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేస్తున్న థమన్ తప్పకుండా సినిమాతో ఎక్కడికోవ్ వెళ్తాడనిపిస్తుంది. మరి థమన్ మ్యూజిక్ హంగామా ఓజీకి ఏమేరకు హెల్ప్ అయ్యింది అన్నది తెలియాలంటే మరో 20 రోజులు వెయిట్ చేస్తే సరిపోతుంది.
