తమన్ కొత్త పాట.. మళ్లీ పాత ట్యూన్ సెగ!
నిజానికి తమన్‌కు త్రివిక్రమ్ సినిమాలతో ఉన్న ట్రాక్ రికార్డ్ వేరు. 'అరవింద సమేత'లో పాటలు ఒకరకంగా ఉంటే, 'అల వైకుంఠపురములో'తో ఏకంగా మ్యూజికల్ సెన్సేషన్ క్రియేట్ చేశారు.
By: M Prashanth | 20 Oct 2026 11:55 AM ISTత్రివిక్రమ్ సినిమా అంటే పాటల మీద కూడా మంచి అంచనాలు ఉంటాయి. అందులోనూ తమన్ సంగీతం అనగానే 'అల వైకుంఠపురములో' ఆల్బమ్ గుర్తుకురాకుండా ఉండదు. ఇప్పుడు 'ఆదర్శ కుటుంబం' కోసం తమన్ మరోసారి రంగంలోకి దిగారు. అయితే కొత్తగా వచ్చిన 'మాలా' పాటపై సోషల్ మీడియాలో భిన్నమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి. పాట వినగానే ఎక్కడో విన్నట్లుందనే అభిప్రాయాలు రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
మారుతి దర్శకత్వంలో వచ్చిన 'ప్రతిరోజూ పండగే' సినిమాలోని 'ఓ బావా' పాట టచ్ ఉందని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఆ పాటకు కూడా తమనే సంగీతం అందించారు. రెండు పాటల మూడ్, ట్యూన్ నడిచే విధానంలో పోలికలు ఉన్నాయని అంటున్నారు. అయితే ఈ పోలికలు ఉన్నంత మాత్రాన పాత ట్యూన్‌ను మళ్లీ వాడేశారని చెప్పలేం. కానీ తమన్ నుంచి కొత్తగా ఏదైనా ఆశించినవాళ్లకు ఇలా అనిపించవచ్చు.
నిజానికి తమన్‌కు త్రివిక్రమ్ సినిమాలతో ఉన్న ట్రాక్ రికార్డ్ వేరు. 'అరవింద సమేత'లో పాటలు ఒకరకంగా ఉంటే, 'అల వైకుంఠపురములో'తో ఏకంగా మ్యూజికల్ సెన్సేషన్ క్రియేట్ చేశారు. 'సామజవరగమన', 'రాములో రాములా', 'బుట్టబొమ్మ' పాటలు సినిమా విడుదలకు ముందే భారీ క్రేజ్ తెచ్చుకున్నాయి. ఆ ఆల్బమ్ తర్వాత త్రివిక్రమ్, తమన్ కాంబినేషన్‌పై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికీ ఆ పాటలు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి.
ఇప్పుడు 'ఆదర్శ కుటుంబం' విషయంలోనూ అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందనే హోప్స్ ఓ వర్గం ప్రేక్షకుల్లో ఉన్నాయి. అయితే ఇప్పటికే వచ్చిన 'నారాయణమ్మ' తర్వాత 'మాలా' కూడా బయటకు రావడంతో మ్యూజిక్‌పై టాక్ మొదలైంది. వెంకటేశ్, నివేత పేతురాజ్‌పై తెరకెక్కించిన ఈ పాటలో తమన్ కొత్త టచ్ ఇచ్చేందుకు ప్రయత్నించినా, ఇంకా బెటర్‌గా ఉండాల్సిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. త్రివిక్రమ్ సినిమాల్లో పాటలకు కథతో పాటు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఒక ఫ్యామిలీ ఎమోషన్ అయినా, హీరోహీరోయిన్ల మధ్య రొమాన్స్ అయినా పాటలతోనే ప్రేక్షకులకు దగ్గరయ్యేలా చూస్తారు. అందుకే ఈ కాంబినేషన్ నుంచి వచ్చే ప్రతి సాంగ్‌ను పాత హిట్లతో పోల్చుతున్నారు. ముఖ్యంగా 'అల వైకుంఠపురములో' ఆల్బమ్ సెట్ చేసిన బెంచ్‌మార్క్ ఇప్పటికీ తమన్‌ను వెంటాడుతోంది.
అయితే రెండు పాటలతోనే మొత్తం ఆల్బమ్ మీద ఒక నిర్ణయానికి రావడం కష్టం. ఇంకా ఎలాంటి పాటలు మిగిలి ఉన్నాయో, సినిమాలో వాటిని ఎలా ఉపయోగించారో తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి 'మాలా' మీద వస్తున్న పోలికలు మాత్రం తమన్ ముందున్న సవాల్‌ను గుర్తుచేస్తున్నాయి. త్రివిక్రమ్ సినిమాకు మరోసారి చార్ట్‌బస్టర్ ఆల్బమ్ ఇవ్వాలంటే పాత హిట్లను గుర్తుచేయడం కంటే కొత్త ట్యూన్స్‌తో మెప్పించాల్సి ఉంటుంది.
