'ఇట్లు అర్జున' కోసం తమన్ మెగా ప్లాన్
ఎన్టీఆర్ ఇప్పటికే ట్రైలర్ విడుదల చేసి ప్రశంసలు అందించగా, ఇప్పుడు రామ్ చరణ్, నాగార్జున, అఖిల్ సమక్షంలో ఇట్లు అర్జున మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించనున్నారు. నవంబర్ 9న హైదరాబాద్ హైటెక్స్‌లో జరిగే ఈ కార్యక్రమంలో తమన్ లైవ్ పెర్ఫార్మెన్స్తో పాటు రెండు కొత్త పాటలను విడుదల చేయనున్నారు. నవంబర్ 13న సినిమా థియేటర్లలోకి రానుంది.
By: M Prashanth | 9 Nov 2026 4:39 PM ISTకొత్త హీరో సినిమాకు ఓ పెద్ద స్టార్ ప్రమోషన్ చేయడమే విశేషం. కానీ 'ఇట్లు అర్జున'కు మాత్రం వరుసగా టాలీవుడ్ ప్రముఖుల సపోర్ట్ దక్కుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ ట్రైలర్ విడుదల చేసి హీరో అనీష్‌ను అభినందించారు. ఇప్పుడు రామ్ చరణ్, నాగార్జున, అఖిల్ అక్కినేని సమక్షంలో భారీ మ్యూజికల్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు తమన్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు. అంతేకాదు, రెండు కొత్త పాటలను కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు.
నవంబర్ 9న హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఈ మ్యూజికల్ కన్సర్ట్ జరగనుంది. నార్మల్ గా చిన్న సినిమాలకు ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించి ట్రైలర్, పాటల గురించి మాట్లాడుతుంటారు. కానీ ఈసారి తమన్ సంగీతాన్నే ఆయుధంగా పెట్టుకుని ప్రత్యేకమైన కార్యక్రమం ప్లాన్ చేశారు. విడుదలకు నాలుగు రోజుల ముందు ఇంత పెద్ద ఈవెంట్ నిర్వహించడం ద్వారా సినిమాను మరింత మంది ప్రేక్షకులకు చేరువ చేయాలని చూస్తున్నారు.
ఇప్పటికే 'ఇట్లు అర్జున' నుంచి వచ్చిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అనిరుధ్ పాడిన 'హాయ్ రే', మోహిత్ చౌహాన్ ఆలపించిన 'చిన్ని చిన్ని', విశాల్ మిశ్రా పాడిన 'ఎల్లో చున్నీ' పాటలు విడుదలయ్యాయి. ఇప్పుడు మరో రెండు పాటలను విడుదల చేయనున్నారు. తమన్ లైవ్ కన్సర్ట్‌లో వీటిని విడుదల చేయడం ద్వారా మ్యూజిక్ ప్రమోషన్లకు మరింత బలం అని చెప్పవచ్చు.
మరోవైపు అనీష్‌కు ఇదే మొదటి సినిమా. మాటలు రాని యువకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ తరహా పాత్రను ఎంచుకోవడం నటుడికి కాస్త కష్టమైన పనే. ట్రైలర్ చూసిన ఎన్టీఆర్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ అనీష్ పెర్ఫార్మెన్స్ను మెచ్చుకున్నారు. నాగార్జున ఇప్పటికే సినిమా చూసి చిత్రబృందాన్ని అభినందించినట్లు నిర్మాత వెంకీ కుడుముల తెలిపారు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా ప్రమోషన్లలో భాగమవుతున్నారు.
దర్శకుడు వెంకీ కుడుముల ఈ సినిమాతో నిర్మాతగా మారారు. ఆయన ప్రారంభించిన వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఇదే తొలి చిత్రం. మహేష్ ఉప్పల దర్శకుడిగా పరిచయమవుతుండగా, అనస్వర రాజన్ హీరోయిన్గా నటిస్తున్నారు. కొత్త హీరో, కొత్త దర్శకుడితో తీసిన సినిమాకు ఇంతమంది పెద్ద స్టార్ల సపోర్ట్ లభించడం ప్రమోషన్ల పరంగా మంచి అడ్వాంటేజ్. ముఖ్యంగా రిలీజ్‌కు ముందు సినిమాపై ప్రేక్షకుల్లో గుర్తింపు పెంచేందుకు ఉపయోగపడుతుంది. నవంబర్ 13న 'ఇట్లు అర్జున' థియేటర్లలోకి రానుంది. లవ్ స్టోరీతో పాటు యాక్షన్, థ్రిల్లర్ అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్‌లో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని వెంకీ కుడుముల ఇప్పటికే చెప్పారు. ఇక మ్యూజికల్ కన్సర్ట్‌లో తమన్ పెర్ఫార్మెన్స్తో సినిమా బజ్ ఏ లెవెల్లో పెరుగుతుందో చూడాలి.
