Begin typing your search above and press return to search.

తమన్ హైప్.. ఆ కొత్త హీరో ఎవరు?

టాలీవుడ్ లో కొత్త హీరోల ఎంట్రీలు కామన్ గా జరుగుతూనే ఉంటాయి. కానీ ఒక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, ఒక కొత్త కుర్రాడి గురించి ప్రత్యేకంగా హైప్ ఇవ్వడం మాత్రం చాలా అరుదుగా చూస్తుంటాం.

By:  M Prashanth   |   7 Dec 2025 3:50 PM IST
తమన్ హైప్.. ఆ కొత్త హీరో ఎవరు?
X

టాలీవుడ్ లో కొత్త హీరోల ఎంట్రీలు కామన్ గా జరుగుతూనే ఉంటాయి. కానీ ఒక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, ఒక కొత్త కుర్రాడి గురించి ప్రత్యేకంగా హైప్ ఇవ్వడం మాత్రం చాలా అరుదుగా చూస్తుంటాం. ఇప్పుడు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ ఒక 'కొత్త హీరో' గురించి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా స్టార్ హీరోలతో బిజీగా ఉండే తమన్, ఈ కొత్త ప్రాజెక్ట్ పై ఇంత ఆసక్తి చూపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

తమన్ తన ట్వీట్ లో.. "అతను పెద్దగా మాట్లాడడు. కానీ అతని రాక మాత్రం గట్టిగా సౌండ్ చేస్తుంది" అంటూ ఒక రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చారు. "New Guy in the Town" అంటూ ఆయన ఇచ్చిన హైప్ చూస్తుంటే, వస్తున్నది సామాన్యమైన వ్యక్తి కాదని, ఏదో గట్టి బ్యాక్ గ్రౌండ్ లేదా విషయం ఉన్న కుర్రాడే అనిపిస్తోంది. ఈ ఒక్క ట్వీట్ తో నెటిజన్లలో ఆ కొత్త ముఖం ఎవరు అనే చర్చ మొదలైంది.

ఈ సినిమాకు సంబంధించిన వివరాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. కేవలం హీరో మాత్రమే కాదు, హీరోయిన్ కూడా కొత్తమ్మాయేనట. అంతేకాకుండా ప్రొడక్షన్ హౌస్, టెక్నికల్ టీమ్ అంతా ఫ్రెష్ గా ఉండబోతున్నట్లు సమాచారం. ఇదొక రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనుంది. కొత్త రక్తం ఇండస్ట్రీకి వస్తుందంటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది.

ఇక సినిమా అనౌన్స్ మెంట్ కోసం వదిలిన వీడియో కట్ కూడా చాలా వెరైటీగా ఉంది. రెగ్యులర్ గా కాకుండా ఒక కామిక్ బుక్ స్టైల్ లో వీడియోను డిజైన్ చేశారు. అందులోని విజువల్స్, కలర్ గ్రేడింగ్ చూస్తుంటే మేకింగ్ క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని అర్థమవుతోంది. చాలా స్టైలిష్ గా ప్రెజెంట్ చేశారు.

ఒక కొత్త సినిమాకు, అదీ పరిచయం లేని హీరో సినిమాకు ఈ రేంజ్ లో బజ్ క్రియేట్ అవ్వడం వెనుక తమన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పాత్ర కూడా కీలకం కావచ్చు. వీడియోలో వినిపించిన సౌండ్ డిజైన్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఆ విజువల్స్ కు తమన్ మార్క్ మ్యూజిక్ తోడైతే థియేటర్లో రచ్చ ఖాయం.

మరి ఇంతకీ ఆ 'కొత్త కుర్రాడు' ఎవరు? ఆ ప్రొడక్షన్ హౌస్ ఏది? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. డిసెంబర్ 14న ఈ సస్పెన్స్ కు తెరదించుతూ, ఆ మిస్టరీని గ్రాండ్ గా రివీల్ చేయబోతున్నారు. అప్పటివరకు ఈ "New Guy" ఎవరోనని గెస్ చేయడం ఆడియెన్స్ వంతు.