Begin typing your search above and press return to search.

ఆదికి తమన్ అదిరిపోయే గిఫ్ట్.. ఆ బ్యాట్ వెనుక ఉన్న సీక్రెట్ ఇదే!

ఆదికి, తమన్ కు మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ మంచి స్నేహితులు మాత్రమే కాదు, క్రికెట్ లవర్స్ కూడా.

By:  M Prashanth   |   23 Dec 2025 4:05 PM IST
ఆదికి తమన్ అదిరిపోయే గిఫ్ట్.. ఆ బ్యాట్ వెనుక ఉన్న సీక్రెట్ ఇదే!
X

టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ పుట్టినరోజు వేడుకలు చాలా గ్రాండ్ గా జరిగాయి. ఇప్పటికే 'శంబాల' సినిమా టీమ్, ఇతర సెలబ్రిటీల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అయితే ఈ బర్త్ డే ఆదికి చాలా స్పెషల్ గా నిలిచింది. దానికి కారణం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇచ్చిన ఒక సర్ ప్రైజ్ గిఫ్ట్. ఆదికి, తమన్ కు మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ మంచి స్నేహితులు మాత్రమే కాదు, క్రికెట్ లవర్స్ కూడా.

ఆది పుట్టినరోజు సందర్భంగా తమన్ స్వయంగా వెళ్లి ఆయనకు ఒక స్పెషల్ గిఫ్ట్ బాక్స్ అందించారు. ఆ బాక్స్ ఓపెన్ చేయగానే అందులో ఒక ఖరీదైన క్రికెట్ బ్యాట్ కనిపించింది. అది చూసి ఆది ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. డిఎస్సీ కంపెనీకి చెందిన ఆ బ్యాట్ ను చూడగానే ఆది కళ్ళలో మెరుపు కనిపించింది.

అసలు విషయం ఏంటంటే, ఈ బ్యాట్ ఇవ్వడం వెనుక తమన్ కు ఒక బలమైన కోరిక ఉంది. గిఫ్ట్ ఇస్తూనే తమన్ ఒక ఛాలెంజ్ కూడా విసిరారు. "ఈసారి సిసిఎల్ (CCL) లో కూడా 100 కొట్టి, మన టీమ్ పరువు, తెలుగు వారియర్స్ ని నిలబెట్టాలి" అని తమన్ ఆది దగ్గర ప్రామిస్ తీసుకున్నారు. కేవలం బౌలింగ్ మాత్రమే కాదు, బ్యాటింగ్ లో కూడా ఇరగదీయాలని తమన్ హింట్ ఇచ్చారు.

ఈ బ్యాట్ చాలా స్పెషల్ అని తమన్ వివరించారు. ఇదొక 'సూపర్ నేచురల్' బ్యాట్ అని, ఆడటానికి చాలా లవ్లీగా ఉంటుందని, టైలర్ మేడ్ గా చేయించి తెప్పించానని చెప్పారు. బ్యాట్ మీద 'ఫియర్ లెస్' అని రాసి ఉండటం విశేషం. "టు ది ఫియర్ లెస్ మ్యాన్" అంటూ తమన్ ఆదిని ఉద్దేశించి కామెంట్ చేశారు. పక్కన ఉన్న స్నేహితులు కూడా ఆదిని ఎంకరేజ్ చేస్తూ.. "నాలుగో సింహం.. కమాన్.. దాంతో వంద కొట్టాలిరా రేయ్" అంటూ అరుస్తూ జోష్ నింపారు.

ఆది ఆ బ్యాట్ పట్టుకుని ఫోజులిస్తూ చాలా కాన్ఫిడెంట్ గా కనిపించారు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో ఆదికి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఇప్పుడు ఈ కొత్త అస్త్రంతో గ్రౌండ్ లో దిగితే పరుగుల వరద పారడం ఖాయంలా కనిపిస్తోంది. మొత్తానికి తమన్ ఇచ్చిన ఈ గిఫ్ట్ ఆదికి బెస్ట్ బర్త్ డే మెమరీగా మిగిలిపోతుంది. అటు సినిమాల్లో 'శంబాల'తో హిట్టు కొట్టాలని, ఇటు గ్రౌండ్ లో ఈ కొత్త బ్యాట్ తో సెంచరీ కొట్టాలని ఆది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఫ్రెండ్షిప్ అంటే ఇలా ఎంకరేజ్ చేసేలా ఉండాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.