Begin typing your search above and press return to search.

అఖండ 2 : ఓజీ ని మరిపించే విధంగా...!

తమన్‌ సంగీత దర్శకుడిగా కెరీర్‌ ఆరంభించి చాలా ఏళ్లు అయింది. అయితే ఆయన బెస్ట్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అంటే మొన్నటి వరకు అఖండ అని చాలా మంది అంటూ ఉంటారు.

By:  Ramesh Palla   |   30 Oct 2025 12:18 PM IST
అఖండ 2 : ఓజీ ని మరిపించే విధంగా...!
X

తమన్‌ సంగీత దర్శకుడిగా కెరీర్‌ ఆరంభించి చాలా ఏళ్లు అయింది. అయితే ఆయన బెస్ట్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అంటే మొన్నటి వరకు అఖండ అని చాలా మంది అంటూ ఉంటారు. అఖండ సినిమా కోసం తమన్ ఇచ్చిన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌కి ఫ్యాన్స్ పిచెక్కి పోయారు. ఆ స్థాయిలో తమన్‌ నుంచి బీజీఎంను ఊహించలేదు అంటూ చాలా మంది ఆ సమయంలో కామెంట్స్‌ చేశారు. అఖండ థియేటర్‌లలో బాక్స్‌లు బద్దలు కావడం మనం చూశాం. అఖండ తర్వాత మళ్లీ ఓజీకి తమన్‌ మళ్లీ అంతకు మించిన బీజీఎంను ఇచ్చాడు. ముఖ్యంగా పవన్‌ కళ్యాణ్ ఎలివేషన్ సీన్స్ కోసం తమన్‌ ఇచ్చిన బీజీఎం నెవ్వర్‌ బిఫోర్‌ అంటూ అభిమానులతో పాటు అన్ని వర్గాల వారు గత నెల రోజులుగా మాట్లాడుకుంటున్న విషయం తెల్సిందే. ఓజీ ఓటీటీ స్ట్రీమింగ్‌ తర్వాత ఆ చర్చ మరింత ఎక్కువగా అయింది అనడంలో సందేహం లేదు.

అఖండ 2 సినిమా కోసం తమన్‌...

ఫ్యాన్స్‌ను కుర్చీలో కూర్చోనివ్వకుండా చేసిన ఓజీ బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌ను మించి అఖండ 2 సినిమాకు తమన్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ఇస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఎక్కడెక్కడో ఉన్న ప్రతిభను తీసుకు వచ్చి తమన్‌ అఖండ 2 తాండవం కోసం వర్క్ చేయిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం సాహిత్యంతో పాటు, సనాతనం కలిసి ఉండేలా మిశ్రా సోదరులను తీసుకు వచ్చి అద్భుతమైన పాటను పాడించాడు అంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు బాగా ఫేమస్ అయిన సర్వేపల్లి సిస్టర్స్‌తోనూ అఖండ 2 కోసం పాట పాడించాడు. వారు పాట పాడారా లేదంటే బీజీఎం కోసం కోరస్ ఇచ్చారా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి అఖండ 2 కోసం తమన్‌ చేస్తున్నది అంతా ఇంతా కాదని మరోసారి దీంతో నిరూపితం అయింది. సర్వేపల్లి సిస్టర్స్‌ చేసే సందడి కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో...

తమన్‌ స్వయంగా సోషల్‌ మీడియా ద్వారా అఖండ 2 కోసం సర్వేపల్లి సిస్టర్స్‌ తో పాడించినట్లుగా పేర్కొన్నాడు. వారితో దిగిన ఫోటో సైతం షేర్‌ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆకట్టుకునే కథ, కథనంతో బోయపాటి శ్రీను అఖండ 2 సినిమాను రూపొందిస్తే, దాని స్థాయిని పది రెట్లు పెంచే విధంగా బోయపాటి బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ఇస్తున్నాడు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. అదే కనుక నిజం అయితే కచ్చితంగా తమన్ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ఖచ్చితంగా ఓజీని మరిపిస్తుంది అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తమన్‌ బెస్ట్‌ వర్క్ అనగానే ఓజీ అంటారు. కానీ అఖండ 2 సినిమా విడుదల తర్వాత ఖచ్చితంగా బెస్ట్‌ వర్క్‌ గా అఖండ 2 తాండవం నిలుస్తుందని నమ్మకంగా ఆయన అభిమానులు ఉన్నారు. ప్రస్తుతానికి అఖండ 2 సినిమా కోసం చివరి దశ షూటింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్‌ జరుపుతున్నారను.

బాలకృష్ణ హీరోగా అఖండ 2 తాండవం...

డిసెంబర్‌ 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అఖండ 2 సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది అనే నమ్మకంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ ఫ్యాన్స్‌ మాత్రమే కాకుండా ఇండస్ట్రీ వర్గాల వారు, ప్రేక్షకులు ఇలా అన్ని వర్గాల వారు సైతం సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. మొదటి పార్ట్‌ బాలయ్య కెరీర్‌ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో నిలిచింది. అందుకే సహజంగానే అఖండ 2 తాండవం సినిమాపై అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లుగా బోయపాటి తన పూర్తి ప్రతిభను పెట్టాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను కుంభమేళలోనూ చిత్రీకరించారు అనే విషయం తెల్సిందే. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. అఖండ 2 సినిమాను టాలీవుడ్‌ లోనే కాకుండా ఇతర భాషల్లోనూ రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారట.