తమన్ చెప్పింది నిజమేనా? ఫ్లో లో హింట్ ఇచ్చేశారా?
టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి అందరికీ తెలిసిందే. వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న ఆయన.. అప్పుడప్పుడు తన ప్రాజెక్టులకు సంబంధించి లీక్స్ ఇస్తుంటారు.
By: M Prashanth | 4 Dec 2025 8:53 AM ISTటాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి అందరికీ తెలిసిందే. వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న ఆయన.. అప్పుడప్పుడు తన ప్రాజెక్టులకు సంబంధించి లీక్స్ ఇస్తుంటారు. ఇప్పుడు మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ లో నటిస్తున్న అఖండ 2 తాండవం మూవీకి మ్యూజిక్ అందించిన ఆయన.. ప్రమోషన్స్ లో కీలక అప్డేట్ ఇచ్చారు!
ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. అఖండ ఐదు పార్టులుగా వచ్చే అవకాశం ఉందని తెలిపారు. దీంతో అఖండ యూనివర్స్ కొనసాగుతుందని అనేక మంది సినీ ప్రియులు ఫిక్స్ అయ్యారు. నందమూరి అభిమానులు అయితే అందుకు సంబంధించిన అప్డేట్స్ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అఖండ సీక్వెల్ డిసెంబర్ 5న రిలీజ్ కానుండగా.. ఏమైనా అప్డేట్ వస్తుందోనని వెయిట్ చేస్తున్నారు.
అదే సమయంలో తమన్.. సోషల్ మీడియాలో తాజాగా ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో దిగిన పిక్ ను పోస్ట్ చేయగా.. ఇద్దరూ రిలాక్స్ మోడ్ లో కనిపించారు. ఆ తర్వాత అఖండ-2 సినిమా పనులు అన్ని కంప్లీట్ అయిపోయాయని చెప్పిన తమన్.. ఈ శివ తాండవాన్ని (అఖండ 2 తాండవం) థియేటర్లలో చూడడానికి అందరూ సిద్ధంగా ఉండండి అంటూ రాసుకొచ్చారు.
అయితే తమన్ పోస్ట్ చేసిన పిక్ లో బ్యాక్ గ్రౌండ్ లోని డిజిటల్ స్క్రీన్ ఉండగా.. దానిపై పెద్ద అక్షరాలతో “JAI AKHANDA” అని రాసి ఉంది. దీంతో ఆ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తమన్ చెప్పినట్లు సినిమా ఐదు పార్టుల్లో వచ్చేటట్టు కనిపిస్తుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు అఖండ-2కు కూడా సీక్వెల్ ఉందని అభిప్రాయపడుతున్నారు.
దాని టైటిలే జై అఖండ అంటూ అంచనా వేస్తున్నారు. అఖండ 2 క్లైమాక్స్ లో మూడో భాగం జై అఖండ గురించి అధికారికంగా హింట్ ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకే ఇప్పుడు ఫ్లోలో తమన్ హింట్ ఇచ్చేశారని అంటున్నారు. సినిమా ఫైనల్ కాపీలో లాస్ట్ విజువల్ అదే అయ్యి ఉండొచ్చని.. దాన్ని చూసుకోకుండా తమన్ తన ఫోటోతో లీక్ చేసినట్లు కామెంట్లు పెడుతున్నారు.
అయితే ఇందులో నిజమెంతో తెలియకపోయినా.. సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. ముఖ్యంగా అఖండ యూనివర్స్ కొనసాగుతుందని తెలుస్తుండడంతో నందమూరి అభిమానులు ఫుల్ హ్యపీగా ఫీలవుతున్నారు. మిగతా భాగాలపై మంచి ఆసక్తితో ఉన్నామని అంటున్నారు. ఏదేమైనా అసలు అఖండ-3 ఉందో లేదో.. ఒకవేళ ఉంటే టైటిల్ ఏంటో.. అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.
