Begin typing your search above and press return to search.

భార్య కోసం భ‌లే ప్లాన్ చేసిన ద‌ళ‌ప‌తి విజ‌య్?

కోలీవుడ్ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ టీవీకే పార్టీని స్థాపించి త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించారు.

By:  Ravindar Gorantla   |   31 March 2026 12:22 PM IST
భార్య కోసం భ‌లే ప్లాన్ చేసిన ద‌ళ‌ప‌తి విజ‌య్?
X

కోలీవుడ్ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ టీవీకే పార్టీని స్థాపించి త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించారు. ఏప్రిల్‌లో జ‌ర‌గ‌నున్న ఎన్న‌క‌ల్లో భారీ స్థాయిలో బ‌రిలోకి దిగుతున్నారు. త‌మిళ‌నాట తిరుగులేని రాజ‌కీయ శ‌క్తిగా ఎదిగే అవ‌కాశం ఉండ‌టంతో రానున్న రోజుల్లో విజ‌య్ కింగ్ మేక‌ర్ అవుతాడ‌ని, త‌మిళ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం సృష్టిస్తాడ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న వేళ విజ‌య్ వైఫ్ సంగీత విడాకులు కోరుతే కోర్డు మెట్లెక్క‌డం సంచ‌ల‌నంగా మారింది.

చెన్నై స‌మీపంలోని చెంగ‌ల్ప‌ట్టు ఫ్యామిలీ కోర్టులో సంగీత విడాకులు కోరుతూ పిటీష‌న్ దాఖ‌లు చేయ‌డంతో త‌మిళ రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌ర మలుపు తిరిగాయి. అంతే కాకుండా విడాకులు కేసు విచార‌ణ పూర్త‌య్యే వ‌ర‌కు త‌న‌ని విజ‌య్ నివాసంలోనే ఉండేలా అనుమ‌తి ఇవ్వాల‌ని మ‌రో పిటీష‌న్ దాఖ‌లు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీంతో సంగీత విడాకుల కేసుని ఆయుధంగా చేసుకుని విజ‌య్‌ని ఇరుకున పెట్టేందుకు అధికార, ప్ర‌తి ప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పించ‌డం మొద‌లు పెట్టిన విష‌యం తెలిసిందే.

దీనికి తోడు విజ‌య్ న‌టించిన చివ‌రి సినిమా `జ‌న నాయ‌గ‌న్‌` సెన్సార్ వివాదంలో చిక్కుకుని ఇప్ప‌టికీ రిలీజ్‌కు నోచుకోవ‌డం లేదు. దీనికి తోడు త్రిష‌తో సంబంధాలు అంటూ రాష్ట్ర బీజేపీ నాయకుడు విమ‌ర్శ‌లు చేయ‌డం, ఆ విమ‌ర్శ‌ల‌కు బ‌లాన్ని చేకూరుస్తూ విజ‌య్‌, త్రిష క‌లిసి చెన్నైలో జ‌రిగిన ఓ నిర్మాత త‌న‌యుడి పెళ్లి రిసెప్ష‌న్ వేడుక‌కు హాజ‌రు కావ‌డం తీవ్ర విమర్శ‌ల‌కు దారితీసింది. దీనిపై ఇండ‌స్ట్రీ వ‌ర్గాలే బాహాటంగా విమ‌ర్శ‌ల‌కు దిగ‌డం తెలిసిందే. ఇదిలా ఉంటే త‌న నుంచి విడాకులు కోరిన భార్య సంగీత కోసం భ‌ర‌ణం కింద‌, త‌న‌కు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు త‌లెత్తొద్ద‌ని విజ‌య్ ప‌క్కాగా ప్లాన్ చేసిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఫిక్స్‌డ్ డిపాజిట్‌ల మీద నెల‌కు రూ.49 ల‌క్ష‌లు వడ్డీ ఆమె చేతికి అందేలా విజ‌య్ ప్లాన్ చేశాడ‌ట‌. ఇండియ‌న్ బ్యాంక్‌లో ఆమె పేరు మీద రూ.25 కోట్లు ఎఫ్‌డీ చేశాడ‌ట‌. అంతే కాకుండా రూ.40 కోట్లు యాక్సిస్ బ్యాంక్‌లో ఎఫ్‌డీ,హెచ్‌డీ ఎఫ్‌సీ బ్యాంక్‌లో రూ.20 కోట్ల ఎఫ్‌డీ చేయించాడ‌ట‌. అంతే కాకుండా సంగీతకు 391 స‌వ‌ర‌ల బంగారం ఇచ్చేశాడ‌ట‌. ఇంత ప‌క్కాగా సంగీత కోసం విజ‌య్ ప్లాన్ చేశాడ‌ని నెట్టింట ప్ర‌చారం జ‌రుగుతోంది. ఓవ‌రాల్‌గా రూ.134 కోట్లు, 391 స‌వ‌ర‌ల బంగారం భ‌ర‌ణం కింద విజ‌య్ సంగీత‌కు ఇచ్చేశాడ‌ని కోలీవుడ్ టాక్‌.

ఇదిలా ఉంటే ఇటీవ‌ల విజ‌య్ త‌న భార్య‌కు భ‌ర‌ణం కింద రూ.200 కోట్ల‌కు మించి ఇవ్వ‌బోతున్నాడ‌ని, ఇప్ప‌టికే దీనికి సంబంధించిన సెటిల్మెంట్ జ‌రిగింద‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఆ ప్రచారాకి బ్రేక్ ఇస్తూ విజ‌య్ భార్య సంగీత విడాకుల కోసం చెంగ‌ల్ప‌ట్టు ఫ్యామిలీ కోర్టుని సంప్ర‌దించి కేసు ఫైల్ చేయించ‌డంతో అదంతా ప్ర‌చార‌మేన‌ని తేలిపోయింది. తాజాగా వైర‌ల్ అవుతున్న వార్త‌ల్లోనూ నిజ‌మెంత‌న్న‌ది తెలియాలంటే విడాకుల‌కు సంబంధించిన ఫైన‌ల్ హియ‌రింగ్ పూర్తి కావాల్సిందే అనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి.