దళపతి క్యామియో కోసమైనా ట్రై చేస్తారా..?
ఐతే దళపతి విజయ్ పూర్తిగా పాలిటిక్స్ లో బిజీ అవుదామనే ఉద్దేశ్యంతోనే సినిమాలకు ఫుల్ స్టాప్ పెడుతున్నారు.
By: Ramesh Boddu | 25 Nov 2025 10:46 AM ISTకోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ ఇప్పటివరకు 67 సినిమాల్లో నటించారు. తన 68వ సినిమాను వినోద్ డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్నారు. జన నాయగన్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దే, మమితా బైజు ప్రధాన పాత్రలుగా నటిస్తున్నారు. దళపతి విజయ్ సినిమాలు ఆపడం వల్ల ఆయన ఫ్యాన్స్ చాలా అప్సెట్ లో ఉన్నారు. జన నాయగన్ తో ఒక తిరుగులేని బ్లాక్ బస్టర్ ఇచ్చి ఆయనకు గ్రాండ్ గిఫ్ట్ ఇవ్వాలని చూస్తున్నారు. ఐతే దళపతి విజయ్ పూర్తిగా పాలిటిక్స్ లో బిజీ అవుదామనే ఉద్దేశ్యంతోనే సినిమాలకు ఫుల్ స్టాప్ పెడుతున్నారు.
జాసన్ సంజయ్ డైరెక్ట్ గా ఎంట్రీ..
ఐతే హీరోగా కాకపోయినా ఫ్యూచర్ లో ఎప్పుడైనా దళపతి విజయ్ క్యామియో అయినా ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఎందుకంటే దళపతి విజయ్ కొడుకు జాసన్ సంజయ్ డైరెక్ట్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఆయన హీరోగా కొనసాగిస్తే తనయుడితో సినిమా తీస్తే అది వేరే రేంజ్ లో ఉంటుంది. అలా కాకపోయినా విజయ్ సినిమాలు చేస్తున్నా సంజయ్ కి మంచి క్రేజ్ ఉంటుంది. కానీ సంజయ్ డైరెక్టర్ గా తొలి సినిమా రిలీజ్ టైం కే విజయ్ సినిమాలు ఆపేస్తున్నారు.
సో తనయుడి కోసమైనా ఫ్యూచర్ లో అతని సినిమాల్లో క్యామియో రోల్ ఏదైనా చేసే ఛాన్స్ ఉంటుందా అన్న ఎక్స్ పెక్టేషన్స్ తో ఉన్నారు. ఐతే ఇదంతా జరిగే పని కాదంటూ కొందరు అంటున్నారు. ఐతే దళపతి విజయ్ ఒక్కసారి కమిటైతే ఇక దానికి తిరుగు ఉండదు. అందుకే విజయ్ ని ఇక తెర మీద చూసే ఛాన్స్ లేదు. అసలు సినిమా ఈవెంట్స్ కి కూడా వస్తాడా లేదా అన్న డౌట్ ఉందని అంటున్నారు.
సినిమా అన్న టాపిక్ తన దగ్గర ఉండదని..
పూర్తిగా ప్రజాసేవకే అంకితం అవ్వాలని విజయ్ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడట. జన నాయగన్ సినిమా రిలీజ్ అయ్యే వరకే సినిమాల గురించి ఆలోచన ఆ తర్వాత మాత్రం మళ్లీ సినిమా అన్న టాపిక్ తన దగ్గర ఉండదని అంటున్నారు. సో సంజయ్ జాన్సన్ కోసం అయినా విజయ్ మళ్లీ మేకప్ వేసుకుని కనిపిస్తారంటూ కొందరు అంటున్నా సరే దానికి ఏమాత్రం ఛాన్స్ లేదని అర్ధమవుతుంది.
దళపతి విజయ్ సినిమాలు ఆపేస్తే ఆయన ప్లేస్ లో ఎవరు ప్రమోట్ అవుతారంటూ డిస్కషన్స్ మొదలయ్యాయి. ప్రస్తుతం ఉన్న స్టార్స్ లో ఎవరికి ఆ కేపబిలిటీ ఉంటుందంటూ సమీకరణాలు చూస్తున్నారు. సో విజయ్ క్యామియోస్ కూడా ఆఫ్టర్ జన నాయగన్ ఉండే ఛాన్స్ లేదనిపిస్తుండగా కచ్చితంగా తెర మీద ఆయన స్టైల్ ని మిస్ అవుతామని దళపతి విజయ్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు.
