జన నాయకుడు ట్విస్ట్.. వీళ్లకి ప్లస్సే..!
అనిల్ రావిపూడి మాత్రం ఎక్కడ కూడా జన నాయగన్ తన లైన్ అని చెప్పట్లేదు. ఐతే ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ లాక్ చేశారు.
By: Ramesh Boddu | 7 Nov 2025 11:54 AM ISTదళపతి విజయ్ లీడ్ రోల్ లో వినోద్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా జన నాయగన్. తెలుగులో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. తెలుగులో జన నాయకుడు అనే టైటిల్ తో రాబోతున్నారట. ఐతే ఈ సినిమాను బాలయ్య భగవంత్ కేసరి సినిమా రీమేక్ తో వస్తున్నారన్న టాక్ ఉంది. మరి మన సినిమా రీమేక్ చేసి మళ్లీ మనోళ్లకే చూపించాలని అనుకోవడంలో విశేషం ఏంటో తెలియాల్సి ఉంది. ఐతే భగవంత్ కేసరి లైన్ మాత్రమే తీసుకున్నారని.. కథనం వేరేగా రాసుకున్నారని టాక్.
సంక్రాంతికి జన నాయకుడు..
అనిల్ రావిపూడి మాత్రం ఎక్కడ కూడా జన నాయగన్ తన లైన్ అని చెప్పట్లేదు. ఐతే ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ లాక్ చేశారు. 2026 సంక్రాంతికి తమిళ్ తో పాటు తెలుగులో కూడా జన నాయకుడు వచ్చేస్తాడని అంటున్నారు. ఐతే తెలుగులో ఆల్రెడీ సంక్రాంతికి భారీ సినిమాలు వస్తున్నాయి. చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారుతో పాటు ప్రభాస్ రాజా సాబ్ కూడా సంక్రాంతి రేసులో దిగుతుంది.
ఇక వీటితో పాటు రవితేజ సినిమా నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు కూడా వస్తున్నాయి. ఈ సినిమాలతో పాటు దళపతి విజయ్ జన నాయకుడు వచ్చినా కూడా పెద్దగా థియేటర్లు దొరికే ఛాన్స్ ఉండదు. అందుకే జన నాయగన్ తెలుగు రిలీజ్ విషయంలో మేకర్స్ పునరాలోచనలో ఉన్నారట. ఒకవేళ నిజంగానే విజయ్ సినిమా తెలుగు వెర్షన్ స్కిప్ చేస్తే మన వాళ్లకి మంచిదే అని చెప్పొచ్చు. ఎంత బజ్ లేకపోయినా పోటీగా ఒక సినిమా లేకపోతే బెటర్ అన్నట్టే అని చెప్పొచ్చు.
శివ కార్తికేయన్ పరాశక్తి కూడా తమిళ్, తెలుగు రిలీజ్..
జన నాయగన్ చివరి సినిమా కాబట్టి ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి సినిమాలకు పూర్తిగా దూరం కావాలని ఫిక్స్ అయ్యారు దళపతి విజయ్. ఇక మీదట పూర్తిగా పాలిటిక్స్ మీదే తన ప్రయాణం అని తెలుస్తుంది. జన నాయకుడుతో పాటు శివ కార్తికేయన్ పరాశక్తి కూడా తమిళ్, తెలుగు రిలీజ్ రేసులో ఉంది. విజయ్ సినిమాకు పోటీగా పరాశక్తితో వస్తున్నాడు శివ కార్తికేయన్. తెలుగులో కూడా పరాశక్తి సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేశారు.
ఒకవేళ జన నాయగన్ తెలుగులో రిలీజైనా విజయ్ వచ్చి ప్రమోషన్స్ చేసే ఛాన్స్ లేదు కాబట్టి శివ కార్తికేయన్ కు తెలుగులో ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. అంతేకాదు దళపతి విజయ్ సినిమా ఆల్రెడీ తెలుగు రీమేక్ అనే టాక్ ఉంది కాబట్టి సూపర్ హిట్ టాక్ వస్తేనే తెలుగు ఆడియన్స్ చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు.
