Begin typing your search above and press return to search.

విజయ్ 'జన నాయగన్'.. ఆ విషయంలో నో డౌట్..

అదే సమయంలో నవంబర్ లో ప్రమోషన్ కార్యక్రమాలు మేకర్స్ ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే మేకర్స్ ప్రమోషన్స్ కు సంబంధించి ప్లాన్ ను రెడీ చేస్తున్నారని సమాచారం.

By:  M Prashanth   |   14 Oct 2025 7:46 PM IST
విజయ్ జన నాయగన్.. ఆ విషయంలో నో డౌట్..
X

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి.. రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీని స్థాపించిన ఆయన.. వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. రీసెంట్ గా తమిళనాడులోని కరూర్ లో విజయ్ నిర్వహించిన ప్రచార ర్యాలీ తీవ్ర విషాదాన్ని నింపింది. తొక్కిసలాట జరగ్గా, 41 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఆ విషయం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో రాష్ట్రంలోని పరిస్థితులు పరిగణనలోకి తీసుకుంటే.. విజయ్ చివరి చిత్రం జననాయగన్ రిలీజ్ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ముందుగా అనుకున్న తేదీ 2026 జనవరి 9వ తేదీన సినిమా రిలీజ్ అవ్వడం డౌటేనని ప్రచారం జరిగింది.

అయితే ఇప్పుడు అది నిజం కాదని తెలుస్తోంది. వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని సమాచారం. జన నాయగన్ అనుకున్న ప్రకారం థియేటర్లలోకి రానుందని వినికిడి. పెండింగ్‌ లో ఉన్న సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేయడంలో ఇప్పుడు మేకర్స్ ఫుల్ బిజీగా ఉన్నారట. త్వరలో పూర్తి చేయనున్నారని వినికిడి.

అదే సమయంలో నవంబర్ లో ప్రమోషన్ కార్యక్రమాలు మేకర్స్ ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే మేకర్స్ ప్రమోషన్స్ కు సంబంధించి ప్లాన్ ను రెడీ చేస్తున్నారని సమాచారం. డిసెంబర్ లో రెండు భారీ ఈవెంట్స్ ను ఏర్పాటు చేస్తున్నారని వినికిడి. ఆ రెండు కార్యక్రమాలకు కూడా విజయ్ అటెండ్ అవ్వనున్నారని సినీ వర్గాల్లో టాక్.

న్యూ ఇయర్ కానుకగా థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అనుకున్నట్లే సినిమా.. థియేటర్స్ లో రిలీజ్ అవ్వడం ఖాయమే. తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా భారీగా రిలీజ్ కానుంది. సంక్రాంతికి కానుకగా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విడుదల అవ్వనుంది.

ఇక సినిమా విషయానికొస్తే.. జన నాయగన్ మూవీకి కార్తీ (ఖాకీ) ఫేం హెచ్.వినోద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. పొడుగు కాళ్ళ సుందరి పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రేమలు ఫేమ్ మమితా బైజు మరో ఫిమేల్ లీడ్ లో సందడి చేయనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించ‌నుండ‌గా.. క‌న్న‌డ టాప్ బ్యాన‌ర్ కేవీఎన్ ప్రొడక్షన్స్ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తోంది.