Begin typing your search above and press return to search.

'జ‌న నాగ‌య‌న్‌' ఫైన‌ల్ క‌ట్ రెడీ?

స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన చివ‌రి పొలిటికల్ యాక్ష‌న్ డ్రామా 'జ‌న నాయ‌గ‌న్‌' రిలీజ్ కోసం యావ‌త్ కోలీవుడ్ మొత్తం ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది.

By:  Tupaki Entertainment Desk   |   6 Feb 2026 8:00 PM IST
జ‌న నాగ‌య‌న్‌ ఫైన‌ల్ క‌ట్ రెడీ?
X

స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన చివ‌రి పొలిటికల్ యాక్ష‌న్ డ్రామా 'జ‌న నాయ‌గ‌న్‌' రిలీజ్ కోసం యావ‌త్ కోలీవుడ్ మొత్తం ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది. విజ‌య్ సినీ కెరీర్‌లోనే అత్యంత ప్రాధాన్యం ఉన్న సినిమా కావ‌డం, ఆయ‌న రాజ‌కీయ అరంగేట్రానికి బాగా క‌లిసి వ‌చ్చే మూవీ కావ‌డంతో దీనిపై హీరో విజ‌య్‌తో పాటు ఆయ‌న అభిమానులు, శ్రేయోభిలాషులు, టీవీకే పార్టీ శ్రేణులు కూడా భారీ ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే అనూహ్యంగా జ‌న‌వ‌రి 9న భారీ స్థాయిలో రిలీజ్ చేయాల‌నుకున్న ఈ మూవీకి సీబీఎఫ్‌సీ వ‌ర్గాలు అడ్డుప‌డ‌టంతో బ్రేక్ ప‌డింది.

అప్ప‌టి నుంచి ఈ సినిమాపై తీవ్ర ఉత్కంఠ నెల‌కొంది. మ‌ద్రాస్ హైకోర్టు తీర్పుని రిజ‌ర్వ్ చేయ‌డం, సీబీఎఫ్‌సీ సెన్సార్ స‌ర్టిఫికెట్ జారీ చేయ‌డానికి నిరాక‌రించ‌డం, రివిజ‌న్ క‌మిటీకి వెళ్లాల‌ని సూచించ‌క‌పోవ‌డంతో 'జ‌న నాయ‌గ‌న్‌' రిలీజ్ ప్ర‌శ్న‌ర్థ‌కంలో ప‌డింది. దీంతో విజ‌య్ సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న ట్రేడ్ వ‌ర్గాలు, అభిమానులు తీవ్ర నిరాశ‌కు గుర‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర‌మైన అప్ డేట్ నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతోంది.

'జ‌న నాయ‌గ‌న్‌' టీమ్ సీబీఎఫ్‌సీ వ‌ర్గాలు సూచించిన క‌ట్స్‌కి, అన్ని నిబంధ‌న‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసి కోరిన మార్పులు, చేర్పులు చేసి సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఫైన‌ల్ క‌ట్‌ని రెడీ చేసి సెన్సార్ క‌మిటీకి పంపించే ప‌నిలో టీమ్ ముమ్మ‌రంగా వ‌ర్క్ చేస్తోంద‌ని ఇన్ సైడ్ టాక్‌. త్వ‌ర‌లోనే ఫైన‌ల్ క‌ట్‌ని క‌మిటీకి సమ‌ర్పించి రిలీజ్ కు అప్రూవ‌ల్ పొందడానికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్టుగా తెలుస్తోంది. ఒక‌సారి ఫైన‌ల్ కట్ వెర్ష‌న్ పూర్త‌యితే ఈ మూవీ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్ సీబీఎఫ్‌సీపై వేసిన పిటీష‌న్ బేష‌ర‌తుగా వెన‌క్కి తీసుకునే ప‌నిలో ఉంద‌ట‌.

ఇలా వ‌న్ బై వ‌న్ అనుకున్న‌ట్టుగా పూర్త‌యి సెన్సార్ వారి నుంచి క్లియ‌రెన్స్ వ‌చ్చేస్తే 'జ‌న నాయ‌గ‌న్‌'ని ఫిబ్ర‌వ‌రి సెకండ్ వీక్‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. ప్రొడ‌క్ష‌న్ కంప‌నీ మాత్రం సినిమా రిలీజ్‌పై ఇంత వ‌ర‌కు ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. కానీ అనుకున్న‌ట్టుగా అన్ని కుదిరితే త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్‌ని ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. రిలీజ్‌కు ముందే రాజ‌కీయ దుమారంలో చిక్కుకున్న ఈ సినిమాని తెలుగు సూప‌ర్ హిట్ ఫిల్మ్ 'భ‌గ‌వంత్ కేస‌రి' ఆధారంగా రీమేక్ చేశారు.

అయితే సోల్ పాయింట్‌ని తీసుకున్నా కానీ సెకండ్ హాఫ్‌లో విల‌న్ క్యారెక్ట‌ర్‌కు సంబంధించిన చాలా మార్పులు చేశారు. ఆ స‌న్నివేశాలే ఇప్పుడు సినిమా రిలీజ్‌కు ప్ర‌తిబంధ‌కాలుగా మారాయి. సినిమా రిలీజ్‌పై తీవ్ర ఇబ్బందుల‌ని క్రియేట్ చేస్తున్నాయి. ఇందులో `ప్రేమ‌లు` ఫేమ్ మ‌మితా బైజు కీల‌క పాత్ర‌లో న‌టించ‌గా, హీరోయిన్‌గా పూజా హెగ్డే న‌టించింది. ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో ప్రియ‌మ‌ణి, రెబో మోనికా జాన్‌, న‌రేష్‌, ప్ర‌కాష్‌రాజ్ త‌దిత‌రులు న‌టించారు.