సడెన్ ట్విస్ట్: విజయ్ 'జననాయగన్' రిలీజ్ వాయిదా
నిజానికి జననాయగన్ సెన్సార్ గడప వద్ద తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోంది. సినిమా సర్టిఫికేషన్‌కు సంబంధించి న ప్రతిష్టంభన కొనసాగుతోంది.
By: Sivaji Kontham | 7 Jan 2026 11:39 PM ISTదళపతి విజయ్ నటించిన 'జన నాయగన్'ఈ సంక్రాంతి బరిలో విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. జనవరి 9న థియేటర్లలో విడుదల కావడానికి కేవలం రెండు రోజుల ముందు ఈ సినిమాని వాయిదా వేస్తున్నామని కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ ప్రకటించడం అభిమానులకు షాకిచ్చింది. ఈ చిత్రం భారతదేశంలో అధికారికంగా వాయిదా పడింది.
ఎక్స్ ఖాతాలో కేవీఎన్ సంస్థ వివరాలను వెల్లడించింది. "మా విలువైన వాటాదారులకు..ప్రేక్షకులకు ఈ వార్తను తెలియజేయడానికి చాలా బాధపడుతున్నాం. జనవరి 9న మోస్ట్ అవైటెడ్ `జన నాయగన్` చిత్రం విడుదల కావాల్సి ఉన్నా, కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది" అని ప్రకటించారు.
ఈ సినిమాపై ఉన్న అంచనాలు, ఉత్సాహం, భావోద్వేగాలను మేం పూర్తిగా అర్థం చేసుకున్నాము. ఈ నిర్ణయం సులభమైనది కాదు. కొత్త విడుదల తేదీని వీలైనంత త్వరగా ప్రకటిస్తాము. అప్పటి వరకు మీ సహనాన్ని, నిరంతర ప్రేమను వినయపూర్వకంగా కోరుతున్నాము. మీ నుంచి మద్దతే మాకు గొప్ప బలం" అని తెలిపారు.
నిజానికి జననాయగన్ సెన్సార్ గడప వద్ద తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోంది. సినిమా సర్టిఫికేషన్‌కు సంబంధించి న ప్రతిష్టంభన కొనసాగుతోంది. బుధవారం మద్రాస్ హైకోర్టు సినిమా విడుదలపై తన తీర్పును రిజర్వ్ చేసింది సినిమాను సమీక్షించడానికి కొత్త కమిటీని ఏర్పాటు చేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సి)ని ఆదేశించింది. నెల రోజుల ముందే బోర్డ్ కి సమర్పించినా కానీ, సెన్సార్ సర్టిఫికేట్ పొందడంలో విఫలమవడంతో నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. డిసెంబర్ 19న బోర్డు కొన్ని కట్స్ తో, డైలాగ్‌లను మ్యూట్ చేయాలని సూచించింది. ఈ చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు.
