దళపతి సినిమాకు ఆ రికార్డ్స్‌లో చోటు!
దళపతి విజయ్‌కి దక్షిణాదితో పాటు ఇతర దేశాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన నటించిన సినిమాలు సాధించిన వసూళ్లే ఇందుకు నిదర్శనం.
By: Tupaki Entertainment Desk | 30 Dec 2025 7:00 PM ISTదళపతి విజయ్‌కి దక్షిణాదితో పాటు ఇతర దేశాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన నటించిన సినిమాలు సాధించిన వసూళ్లే ఇందుకు నిదర్శనం. యావరేజ్ అనుకున్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొట్టిన రికార్డ్ విజయ్‌ది. అలాంటి విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన నేపథ్యంలో సినిమాలకు గుడ్‌బై చెబుతున్నాడు. ఈ క్రమంలో ఆయన నటిస్తున్న చివరి మూవీ `జన నాయగన్`. హెచ్. వినోద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.
జనవరి 9నే తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్‌కు టీమ్ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మలేసియాలోని కౌలాలంపూర్‌లో గ్రాంగ్‌గా ఆడియో రిలీజ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 27న భారీ స్థాయిలో జరిగిన ఈ ఈవెంట్‌లో విజయ్ అభిమానులు భారీ స్థాయిలో పాల్గొని విజయవంతం చేశారు. ఇండియా నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భారీ స్థాయిలో విచ్చేసి ఈవెంట్‌లో పాల్గొన్నారు.
కౌలాలంపూర్‌లోని బుకిత్ జలీల్ స్టేడియంలో జరిగిన ఈవెంట్ మలేసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానాన్ని సొంతం చేసుకుని సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది. `జన నాయగన్` ఆడియో లాంచ్ ఈవెంట్‌లో దాదాపు 85 వేల మంది అభిమానులు, సినీ లవర్స్ పాల్గొనడంతో ఈ ఈవెంట్ మలేసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానాన్ని సొంతం చేసుకుని విజయ్ సినిమాల్లో సరికొత్త రికార్డుని నెలకొల్పింది. ఈ స్థాయిలో అభిమానులు, సెలబ్రిటీస్ పాల్గొన్న ఏకైక స్టార్ ఈవెంట్ గా `జన నాయగన్` ఆడియో లాంచ్‌ని గుర్తించిన మలేసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రత్యేకంగా గుర్తించడం విశేషమని కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
విజయ్ నటుడిగా 30 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు పలుకుతున్న నేపథ్యంలో `జన నాయగన్` ఆడియో లాంచ్ ఫంక్షన్‌పై అందరి దృష్టి పడింది. తమ ఆరాధ్య హీరో చివరి సినిమా, ఈ మూవీతో సినిమాలకు గుడ్‌బై చెప్పబోతుండటంతో అభిమానులు ఈ ఆడియో ఫంక్షన్‌ని ప్రత్యేకంగా తీసుకుని ఈ ఈవెంట్ కోసం ప్రపంచ నలుమూలల నుంచి ప్లైట్‌లలో కౌలాలంపూర్ చేరుకుని ఈ కార్యక్రమంలో పాల్గొని విజయ్‌పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.
ఇప్పటికే ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్‌తో పాటు థియేట్రికల్ బిజినెస్ పరంగానూ రికార్డులు సృష్టిస్తున్న ఈ మూవీ హీరో రెమ్యునరేషన్ పరంగానూ సరికొత్త చర్చకు తెరలేపింది. ఇది విజయ్ నటిస్తున్న చివరి సినిమా కావడంతో ఈ మూవీ కోసం విజయ్ రూ.275 కోట్ల పారితోషికాన్ని తీసుకున్నాడని కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ఇదే నిమైతే ఈ స్థాయిలో పారితోషికం అందుకున్న తొలి ఇండియన్ యాక్టర్‌గా విజయ్ రికార్డు సృష్టించడం ఖాయమని తెలుస్తోంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో `ప్రేమలు` ఫేమ్ మమితా బైజు కీలక పాత్రలో నటిస్తోంది.
