Begin typing your search above and press return to search.

జన నాయగన్.. దళపతి విజయ్ ఏం చేస్తాడో మరి?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ఇప్పుడు జన నాయగన్ మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   18 Aug 2025 12:26 PM IST
జన నాయగన్.. దళపతి విజయ్ ఏం చేస్తాడో మరి?
X

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ఇప్పుడు జన నాయగన్ మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఓవైపు పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆయన, ఇప్పుడు జన నాయగన్ ను పూర్తి చేస్తున్నారు. అదే ఆయన చివరి సినిమా అని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్నా.. విజయ్ మాత్రం ఆ విషయంపై రెస్పాండ్ అవ్వలేదు.

పొలిటికల్ యాక్షన్ డ్రామాగా హెచ్. వినోత్ దర్శకత్వం వహిస్తున్న జన నాయగన్ లో పూజ హెగ్డే, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, నరైన్, ప్రియమణి సహా పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ క్రేజీ అండ్ రాక్ మ్యూజిక్ ను అందిస్తున్నారు.

వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా సినిమా రానుండగా.. ఇప్పుడు ఆ మూవీ వసూళ్లపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా రీసెంట్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ మూవీ.. బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా రాణించకపోవడంతో కోలీవుడ్ లో అత్యధికంగా జనాలను ఆకర్షించేది ఎవరనే దానిపై చర్చ మొదలైంది.

ముఖ్యంగా మౌత్ టాక్ తోనే భారీ వసూళ్లు సాధించగలనని దళపతి విజయ్ ఇప్పటికే పలుమార్లు ప్రూవ్ చేసుకున్నారు. వారిసు, గోట్ వంటి చిత్రాలతో పెద్ద ఎత్తున కలెక్షన్స్ సాధించి నిరూపించారు. స్టోరీ, జోనర్ తో సంబంధం లేకుండా.. విజయ్ ఎల్లప్పుడూ కోలీవుడ్ ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పిస్తారని చెప్పాలి.

ఇప్పుడు మళ్లీ జన నాయగన్ మూవీతో దాన్ని రిపీట్ చేస్తారో లేదోనని అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. గ్రాండ్ గా ఓపెనింగ్స్ కు వివిధ అంశాలు దోహదం చేస్తాయని, మిగతాది మౌత్ టాక్ పైనే ఆధారపడి ఉంటుందని చెప్పాలి. అయితే జన నాయగన్ మూవీపై ఇప్పటికే ఆడియన్స్, సినీ ప్రియుల్లో మంచి అంచనాలు ఉన్న విషయం తెలిసిందే.

రీసెంట్ గా మేకర్స్ ఫస్ట్ రోర్ పేరుతో వీడియో గ్లింప్స్ రిలీజ్ చేయగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. పోలీస్ డ్రెస్ లో అల్లర్లు చెలరేగుతున్న వీధిలో నడుస్తున్నట్లు విజయ్ చూపించారు. అయితే ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సినిమాలు మనుగడ సాగించడానికి స్టార్ పవర్ తోడ్పడే రోజులు పోయాయి. కంటెంట్ ఉంటేనే క్లిక్ అవుతోంది. మరి ఇప్పుడు విజయ్ జన నాయగన్ మూవీతో ఏం చేస్తారో వేచి చూడాలి.