గెలుపు పై స్టార్ హీరో నమ్మకం ఇలా!
లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇంకా కొన్ని నెలల సమయం మాత్రమే మిగిలి ఉందని అభిమానుల్ని, పార్టీ శ్రేణుల్ని ఉత్సాహపరిచారు. గెలుపు కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేస్తేనే విజయం సాధ్యమవుతుందని పిలుపు నిచ్చారు.
By: Srikanth Kontham | 20 Aug 2025 6:00 AM IST2026 ఎన్నికల సమరానికి దళపతి విజయ్ సిద్దమైన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో `తమిళగ వెట్రీ కళగం` పార్టీ తరుపును బరిలోకి దిగుతున్నారు. ఓవైపు సినిమాలకు పని చేస్తూనే మరోవైపు పార్టీ పనుల్లోనే బిజీ బిజీగా గడుపుతున్నారు. ఎన్నికల సమయం కూడా దగ్గర పడటంతో? సినిమాలకంటే పాలిటిక్స్ పైనే సీరియస్ గా ఉన్నారు. ఎప్పటి కప్పుడు పార్టీ శ్రేణులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజల్లో తమ పార్టీకున్న బలంగా గురించి రెట్టించిన ఉత్సాహంతో ప్రకటనలు రిలీజ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా 2026 ఎన్నికల బరిలో చరిత్ర పునరావృతం చేస్తామంటూ ధీమా వ్యక్తం చేసారు. 1967, 1977 ఎన్నికల ఫలితాలను 2026 లో తమిళగ వెట్రీ కళగం రిపీట్ చేస్తుందని జోస్యం చెప్పారు. ప్రజల్లో తమ పార్టీకున్న బలమే తమని ముందుకు నడిపస్తుందని...అదే గెలుపుకు మొదట మొట్టుగా సూచించారు. ప్రాణానికి ప్రాణంగా భావించే తమిళ ప్రజలకు తన గురించి బాగా తెలుసునన్నారు.
లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇంకా కొన్ని నెలల సమయం మాత్రమే మిగిలి ఉందని అభిమానుల్ని, పార్టీ శ్రేణుల్ని ఉత్సాహపరిచారు. గెలుపు కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేస్తేనే విజయం సాధ్యమవుతుందని పిలుపు నిచ్చారు. ప్రత్యర్ధులు ఎంత బలవంతులైనా? ప్రజలకు అందించిన సేవను గుర్తించే ఓటు వేస్తారని...రాజకీయం కొత్తైనా? ప్రజల మనసుల్లో తమ పార్టీకి గొప్ప స్థానం ఉందని అదే పార్టీని గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేసారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
విజయ్ అటు సినిమాలతోనూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. హెచ్. వినోధ్ దర్శకత్వంలో `జననాయగన్` లో నటిస్తున్నారు. పొటికల్ నేపథ్యంలో తెరకెక్కిస్తోన్న సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. నటుడిగా విజయ్ చివరి సినిమా ఇదే అవుతుందని ఇండస్ట్రీ సహా అభిమానులు భావిస్తున్నారు.
