ఇవన్నీ అంతం కావాలని స్టార్ హీరో పిలుపు
అభిమానం పేరుతో వెర్రి వేషాలు వేస్తే ఇటీవలి కాలంలో స్టార్లు అంగీకరించడం లేదు. తమ అభిమానులు పదిమందికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నారు.
By: Sivaji Kontham | 2 Nov 2025 5:00 AM ISTఅభిమానం పేరుతో వెర్రి వేషాలు వేస్తే ఇటీవలి కాలంలో స్టార్లు అంగీకరించడం లేదు. తమ అభిమానులు పదిమందికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నారు. చిరంజీవి సహా చాలా మంది స్టార్లు తమ ఫ్యాన్స్ సామాజిక సేవలో ముందుండాలని ఆకాంక్షించారు.
తళా అజిత్ కూడా ఇందుకు అతీతుడు కాదు. తన సినిమాలు విడుదలైతే అభిమానం పేరుతో నిజంగా తప్పుడు పనులు చేయవద్దని కోరారు. పెద్ద చిత్రాల విడుదల సమయంలో వేడుకల పేరుతో అభిమానులు క్రాకర్లు పేల్చడం, థియేటర్లలో స్క్రీన్‌లు - సీట్లు చింపివేయడాన్ని ఆయన వ్యతిరేకించారు.
మీ ప్రేమ అభిమానాలకు ధన్యవాదాలు... కానీ మీరు టపాకాయలు పేల్చడం, సీట్లు, స్క్రీన్ లను చింపడం సరికాడు. ఈ రోజు నాకు ఇంత మంచి జీవితాన్నిచ్చినందుకు అభిమానులకు ధన్యవాదాలు. కానీ పరిశ్రమలో అభిమానుల మధ్య వాగ్వాదాలు వద్దు. వాటిని అంతం చేయండి. ఒక నటుడి కంటే ఇంకో నటికి బాక్సాఫీస్ ఫిగర్స్ విషయంలో పోటీపెడితే అభిమానుల మధ్య ఘర్షణను ఆపలేమని అజిత్ ఆవేదన చెందారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే... తదుపరి `గుడ్ బ్యాడ్ అగ్లీ` దర్శకుడు అధిక్ రవిచంద్రన్‌తో అజిత్ మరో సినిమా చేసేందుకు సన్నాహకల్లో ఉన్నాడు.
