ఓ సిగ్నల్ ఇస్తే.. అకిరాతో పాన్ వరల్డ్ సినిమా ఫిక్స్!
పవన్ కళ్యాణ్ తో తనకు ఎప్పటి నుంచో మంచి అనుబంధం ఉందని విశ్వప్రసాద్ గుర్తు చేసుకున్నారు.
By: M Prashanth | 15 Dec 2025 1:15 PM ISTటాలీవుడ్ లో ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న నిర్మాత టీజీ విశ్వప్రసాద్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఆయన ఏ సినిమా చేసినా చాలా గ్రాండ్ గా ఉంటుంది. రీసెంట్ గా ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన కుమారుడు అకిరా నందన్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. మెగా అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అప్డేట్ గురించి ఆయన ఓపెన్ గా మాట్లాడారు.
పవన్ కళ్యాణ్ తో తనకు ఎప్పటి నుంచో మంచి అనుబంధం ఉందని విశ్వప్రసాద్ గుర్తు చేసుకున్నారు. గతంలో వీరి కాంబినేషన్ లో బ్రో సినిమా వచ్చింది. అయితే ఇప్పుడు పవన్ రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ, ఆయన మళ్ళీ ఎప్పుడు డేట్స్ ఇచ్చినా సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నానని నిర్మాత తన మనసులో మాట చెప్పారు. పవన్ రేంజ్ కు తగ్గట్టుగా ఎంత బడ్జెట్ అయినా పెట్టడానికి తాను వెనకాడనని క్లియర్ గా చెప్పారు.
ఇక అందరి దృష్టిని ఆకర్షించిన విషయం ఏంటంటే అకిరా నందన్ ఎంట్రీ గురించి ఆయన చేసిన కామెంట్స్. అకిరాను వెండితెరకు పరిచయం చేయాలనే కోరిక తనకు చాలా బలంగా ఉందని విశ్వప్రసాద్ తెలిపారు. అకిరా హైట్, పర్సనాలిటీ చూస్తుంటే ఒక పర్ఫెక్ట్ హీరో మెటీరియల్ లా కనిపిస్తున్నాడని, అతన్ని లాంచ్ చేసే అవకాశం వస్తే అది తన కెరీర్ లోనే స్పెషల్ ప్రాజెక్ట్ అవుతుందని ఆయన భావిస్తున్నారు.
కేవలం హీరోగా పరిచయం చేయడమే కాదు, ఆ సినిమా ఏ స్థాయిలో ఉంటుందో కూడా ఆయన హింట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో కాదు, ఏకంగా పాన్ వరల్డ్ లెవెల్ లో ప్లాన్ చేస్తానని ఛాలెంజ్ చేశారు. అంటే హాలీవుడ్ స్టాండర్డ్స్ లో టెక్నికల్ గా అత్యున్నత స్థాయిలో ఆ సినిమాను నిర్మిస్తానని ఆయన నమ్మకంగా చెబుతున్నారు.
నిజానికి అకిరా ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అకిరా ప్రస్తుతం మ్యూజిక్, మార్షల్ ఆర్ట్స్ మీద ఫోకస్ పెట్టి తన స్కిల్స్ పెంచుకుంటున్నాడు. ఇలాంటి టైమ్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లాంటి పెద్ద బ్యానర్ నుంచి ఇలాంటి ప్రపోజల్ రావడం నిజంగా ఆసక్తికరమైన విషయం. అయితే దీనికి సంబంధించిన నిర్ణయం మొత్తం పవన్ కళ్యాణ్ చేతిలోనే ఉంది.
విశ్వప్రసాద్ మాటలు చూస్తుంటే ఆయన అకిరా ఎంట్రీ కోసం పక్కా ప్లాన్ తో ఉన్నట్లు అనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఓకే అంటారా అని ఆయన వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కనుక సెట్ అయితే దర్శకుడు ఎవరనేది మరో పెద్ద ప్రశ్న. కాంబినేషన్ ఏదైనా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బద్దలవ్వడం ఖాయం. అకిరా స్క్రీన్ మీద కనిపిస్తే చూడాలని కోరుకునే కోట్లాది మంది అభిమానుల కోరిక ఈ ప్రాజెక్ట్ తో తీరుతుందేమో చూడాలి.
