Begin typing your search above and press return to search.

పీపుల్ మీడియా 'గరివిడి లక్ష్మి'.. ఈసారి క్లియర్ టార్గెట్ తోనే..

సినిమాలు తీయడం కాదు.. హిట్ అందుకోవడమే ఇప్పుడు టాలీవుడ్ ప్రముఖ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ముందున్న అసలు టార్గెట్.

By:  M Prashanth   |   13 Oct 2026 8:19 PM IST
పీపుల్ మీడియా గరివిడి లక్ష్మి.. ఈసారి క్లియర్ టార్గెట్ తోనే..
X

సినిమాలు తీయడం కాదు.. హిట్ అందుకోవడమే ఇప్పుడు టాలీవుడ్ ప్రముఖ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ముందున్న అసలు టార్గెట్. ఆ బ్యానర్ నుంచి గతంలో చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఇటీవల ఆశించిన విజయాలు దక్కడం లేదు. దీంతో ఇప్పుడు తమ పద్ధతిని మార్చుకోవాలని చూస్తోంది. గతంలో జరిగిన తప్పులను కరెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. మళ్లీ వరుస హిట్స్ అందుకోవాలని ట్రై చేస్తోంది.

రీసెంట్ గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చేసిన కామెంట్స్ చూస్తే.. ఈసారి కథల సెలక్షన్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్లు క్లియర్ గా అర్థమవుతోంది. గరివిడి లక్ష్మి సినిమా ప్రెస్‌ మీట్‌ లో మాట్లాడిన ఆయన.. తమ వైపు నుంచి గతంలో చాలా తప్పులు జరిగాయని ఒప్పుకున్నారు. వాటన్నింటిని కూడా ఇప్పుడు కరెక్ట్ చేసుకుంటున్నామని చెప్పారు.

ఒక ప్రొడ్యూసర్ ఇలా ఓపెన్ గా చెప్పడం చూస్తే.. గత సినిమాల రిజల్ట్స్ పై బ్యానర్ ఆలోచనలో పడినట్లు కనిపిస్తోంది. వరుసగా సినిమాలు చేయడం కంటే.. మంచి కథలను సెలెక్ట్ చేసుకుని విజయాలు అందుకోవడంపై దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో గరివిడి లక్ష్మి స్టోరీపై టీజీ విశ్వప్రసాద్ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. తమ నిర్మాణ సంస్థ విన్న వంద కథల్లో ఆ సినిమా మొదటి మూడు ప్లేసుల్లో ఉంటుందని తెలిపారు.

అంటే స్టోరీపై ఆయనకు ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆనంది, రాగ్ మయూర్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఆ సినిమాతో రిజల్ట్ అందుకోవాలని నిర్మాణ సంస్థ భావిస్తోంది. అయితే కథ నచ్చడం ఒకటైతే.. దాన్ని స్క్రీన్ పై ప్రేక్షకులకు నచ్చేలా చూపించడం మరో విషయం. సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉంటుంది, బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ వస్తుందన్నదే మెయిన్.

ఆ సినిమా విషయంలో నిర్మాత పెట్టుకున్న నమ్మకం ఎంతవరకు నిజమవుతుందో చూడాలి. ఇక గరివిడి లక్ష్మి సినిమా కోసం బుధవారం వైజాగ్‌ లో స్పెషల్ ఈవెంట్ ను నిర్వహించనున్నట్లు విశ్వప్రసాద్ చెప్పారు. ఈ కార్యక్రమానికి కూటమి పార్టీల నాయకులు చాలామంది హాజరవుతారని తెలిపారు. దీంతో సినిమా ప్రమోషన్స్ పై కూడా మూవీ టీమ్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

అయితే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ ప్రస్తుతం తన లైనప్ లోని సినిమాలపై పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుంది. అడివి శేష్ నటిస్తున్న గూఢచారి 2 వంటి పలు సినిమాలు ఆ బ్యానర్ కు మెయిన్ గా మారాయి. వీటితో పాటు గరివిడి లక్ష్మి కూడా మంచి రిజల్ట్ అందుకోవాలని చూస్తోంది. అయితే గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకుంటున్నామని నిర్మాత చెప్పడం ఒక స్టెప్ మాత్రమే. ఆ ఛేంజెస్ సినిమాల రిజల్ట్స్ లో ఇప్పుడు కనిపించాలి. గరివిడి లక్ష్మితో మొదలయ్యే ఆ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో అంతా వేచి చూడాలి.