Begin typing your search above and press return to search.

ధనుష్ 'తేరే ఇష్క్ మే' టీజర్.. మంచి ఎమోషనల్ లవ్ స్టోరీలా ఉందే!

ఇప్పటికే మూవీ షూటింగ్ పూర్తి కాగా.. హిందీ, త‌మిళంలో న‌వంబ‌ర్ 28న విడుదల చేయనున్నారు. తాజాగా మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు.

By:  M Prashanth   |   1 Oct 2025 4:43 PM IST
ధనుష్ తేరే ఇష్క్ మే టీజర్.. మంచి ఎమోషనల్ లవ్ స్టోరీలా ఉందే!
X

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి అందరికీ తెలిసిందే. అటు హీరోగా సినిమాలు చేస్తూ.. ఇటు డైరెక్టర్ గా చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా కుబేర మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. ఇప్పుడు అనేక సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. అందులో ఒకటి హిందీ మూవీ తేరే ఇష్క్ మే కూడా ఉండడం విశేషం.

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమాకు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన‌‌‌‌తో ధనుష్‌ ‌‌‌‌‌‌‌కు ఇది మూడో సినిమా. గతంలో రాంఝనా, అత్రంగి రే చిత్రాలకు వర్క్ చేయగా.. ఇప్పుడు మళ్లీ తేరే ఇష్క్ మే కోసం చేతులు కలిపారు. మరికొద్ది రోజుల్లో ఆ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది.

ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఆ సినిమాను గుల్షన్ కుమార్, టి సిరీస్, కలర్ ఎల్లో సమర్పణలో భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ నిర్మిస్తున్నారు. ఇప్పటికే మూవీ షూటింగ్ పూర్తి కాగా.. హిందీ, త‌మిళంలో న‌వంబ‌ర్ 28న విడుదల చేయనున్నారు. తాజాగా మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు.

టీజర్ ను చూస్తుంటే.. కాశీ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ లవ్ స్టోరీతో సినిమా రూపొందుతున్నట్లు క్లియర్ గా తెలుస్తోంది. కృతి సనన్ పెళ్లి కూతురిగా రెడీ అవ్వగా.. ధనుష్ తండ్రిని ద‌హ‌నం చేయ‌డానికి కాశీ వెళ్లి వస్తాడు. అంత్యక్రియల నుంచి నేరుగా హీరోయిన్ ఇంటికి వస్తాడు. అప్పుడు ఆమెపై గంగా జలాన్ని పోస్తాడు.

"నా తండ్రిని ద‌హ‌నం చేయ‌డానికి బనార‌స్ వెళ్లా. నీకోసం కొంత ప‌విత్ర గంగాజ‌లం తేవాలి అనుకున్నాను. నువ్వు కొత్త జీవితం ప్రారంభించ‌బోతున్నావు క‌దా. అందుకే పాత పాపాలను క‌డుక్కో. నీకు దేవుడు కొడుకును ఇస్తాడు. అప్పుడు. ప్రేమలో మరణించేవారు కూడా ఒకరి బిడ్డలేనని నీకు గుర్తు చేస్తాడు" అని ధనుష్ చెబుతారు.

ఆ డైలాగ్ మధ్యలో కొన్ని సీన్స్ ను చూపించి ఆసక్తి రేపారు మేకర్స్. సినిమాలో ప్రేమలో మోస‌పోయిన వ్య‌క్తిగా ధనుష్ క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. పూర్తిగా డీ గ్లామర్ రోల్ లో కనిపించిన ఆయన, తన పాత్రలో ఒదిగిపోయారు. ఆయన భావోద్వేగాలు టీజర్ కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. ఏఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే ఓ రేంజ్ లో ఉంది. ఓవరాల్ గా టీజర్ అందరినీ ఆకట్టుకుని దూసుకుపోతోంది.