Begin typing your search above and press return to search.

ప్రేమ కూడా ఇత‌ర ఎమోష‌న్స్‌లానే ఒక ఎమోష‌న్ అంతే.. ధ‌నుష్ షాకింగ్ కామెంట్!

కొన్నిసార్లు సెల‌బ్రిటీలు ఎమోష‌న‌ల్ గా ఉన్న‌ప్పుడు అనాలోచితంగా చేసే వ్యాఖ్య‌లు మీడియాకు స్టోరీలుగా మార‌తాయి.

By:  Sivaji Kontham   |   17 Nov 2025 8:55 AM IST
ప్రేమ కూడా ఇత‌ర ఎమోష‌న్స్‌లానే ఒక ఎమోష‌న్ అంతే.. ధ‌నుష్ షాకింగ్ కామెంట్!
X

కొన్నిసార్లు సెల‌బ్రిటీలు ఎమోష‌న‌ల్ గా ఉన్న‌ప్పుడు అనాలోచితంగా చేసే వ్యాఖ్య‌లు మీడియాకు స్టోరీలుగా మార‌తాయి. ఎస్.ఎస్.రాజ‌మౌళి త‌న సినిమా వార‌ణాసి టైటిల్ గ్లింప్స్ కోసం చాలా ఓపిగ్గా ఎదురు చూసి చివ‌రికి సాంకేతిక కార‌ణంతో ఆల‌స్యం కావడంతో వేదిక‌పైనే బ‌ర‌స్ట్ అయ్యారు. తాను దేవుడిని న‌మ్మ‌ను! అనేసారు. అది ఒక అదుపు త‌ప్పిన ఎమోష‌న్ మాత్ర‌మే.

ఇప్పుడు ఒక ప‌బ్లిక్ వేదిక‌పై ధ‌నుష్ కి ప్రేమ అంటే ఏమిటి? అనే ప్ర‌శ్న ఎదురైంది. దీనికి అత‌డు అనాలోచితంగా అంత‌గా ప‌ట్టించుకోద‌గిన ఎమోష‌న్ కాదు! అనే అర్థంలో మాట్లాడాడు. ప్రేమ కూడా మ‌రో ఓవ‌ర్ రేటెడ్ ఎమోష‌న్ అంటూ స‌రిపుచ్చాడు. దీనిని బ‌ట్టి ప్రేమ‌ను అత‌డు అంత‌గా ప‌ట్టించుకోడు! అంటూ అంద‌రూ అర్థం చేసుకున్నారు... ఈ జ‌వాబు ఏదో అలా చెప్పేసాడులే అనుకోవ‌డాన‌కి లేదు.

ఈ ఘ‌ట‌న ముంబైలో జరిగిన ఆనంద్ ఎల్ రాయ్ హిందీ చిత్రం `తేరే ఇష్క్ మే` ట్రైలర్ లాంచ్ లోనిది. ఈ వేడుక‌లో ధనుష్, కృతి సనన్‌లను ప్రేమపై అభిప్రాయం ఏమిటని అడిగారు. మొదట ఇద్దరూ సమాధానం చెప్పడానికి సంకోచించారు. కానీ ధ‌నుష్ ప్రేమను `ఓవర్‌రేటెడ్ ఎమోషన్` అనేసాడు.

మొద‌ట సంకోచిస్తూ నాకు తెలీదు! అన్నాడు. కానీ అంత‌లోనే ప్రేమ మ‌రో ఓవ‌ర్ రేటెడ్ మెమోష‌న్ అనుకుంటున్నాను! అని అన్నాడు. ఈ జ‌వాబు విన్న‌వాళ్లంతా ఆశ్చ‌ర్య‌పోయారు. ఇది అస్స‌లు త‌న నుంచి ఊహించ‌నిది. ఆ తర్వాత కృతి సినిమాలోని తన పాత్ర శంకర్ అతడితో ఏకీభవించడం లేదని తాను అనుకోనని చమత్కరించింది. నేను ఇప్పటికే శంకర్ లాగా ఏమీ లేను! అని చెప్పాడు.

అయితే త‌న భార్య ఐశ్వ‌ర్య నుంచి విడాకులు తీసుకున్న త‌ర్వాత ధ‌నుష్ చేసిన ఈ కామెంట్ ని చాలా ఉద్ధేశాల‌తో చూసారు చాలా మంది. ధ‌నుష్- ఐశ్వ‌ర్య ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లిదండ్రులు. 18 సంవ‌త్స‌రాల దాంప‌త్యంలో క‌ల‌త‌ల‌తో చివ‌రికి విడిపోయారు. న‌వంబ‌ర్ 2024న వీరికి విడాకులు మంజూర‌య్యాయి.

ధనుష్ ప్ర‌స్తుతం వ‌రుస చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు. ఈ సంవత్సరం శేఖర్ కమ్ముల తీసిన తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం కుబేరాలో నటించాడు. ఇటీవల ఇడ్లీ కడై చిత్రానికి దర్శకత్వం వహించ‌డ‌మే గాక‌ నిర్మించాడు. ఇడ్లీలు అమ్ముకునే యువ‌కుడిగాను నటించాడు, ఇందులో నిత్యా మీనన్, అరుణ్ విజయ్ కూడా నటించారు. తేరే ఇష్క్ మే నవంబర్ 28న థియేటర్లలో విడుదల కానుంది. ధనుష్ ఇళయరాజా బయోపిక్‌తో పాటు విఘ్నేష్ రాజాతో ఇంకా పేరు పెట్టని సినిమా చేస్తున్నాడు.