ధనుష్ మూవీ.. తెలుగు విషయంలో ఎందుకలా చేశారో?
సినిమాలో ధనుష్ సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటించగా.. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు.
By: M Prashanth | 29 Nov 2025 7:00 PM ISTకోలీవుడ్ స్టార్ నటుడు, టాలెంటెడ్ హీరో ధనుష్.. వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అటు హీరోగా.. ఇటు డైరెక్టర్ గా బిజీగా గడుపుతున్నారు. రీసెంట్ గా తేరే ఇష్క్ మే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రముఖ దర్శకుడు ఆనంద్ రాయ్ దర్శకత్వం వహించారు. మరోసారి ధనుష్ తో ఆయన వర్క్ చేశారు.
సినిమాలో ధనుష్ సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటించగా.. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ టీ సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్, కిషన్ కుమార్, ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ నిర్మించారు. నవంబర్ 28వ తేదీన హిందీ, తమిళం భాషల్లో గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా విడుదల చేశారు.
అయితే రొమాంటిక్ డ్రామాగా రూపొందిన తేరే ఇష్క్ మే సినిమా.. బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ ను అందుకుందనే చెప్పాలి. హిందీలో మొదటి రోజు రూ.16.06 కోట్లు రాబట్టిన ఆ మూవీ.. తమిళంలో దాదాపు రూ.70 లక్షలు రాబట్టింది. ఇండియా మొత్తంగా దాదాపు రూ.18 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.
దీంతో తేరే ఇష్క్ మే మూవీ.. సాలిడ్ ఓపెనింగ్స్ ను రాబట్టిందనే చెప్పాలి. ముఖ్యంగా అనేక నగరాల్లో మంచి ఆక్యుపెన్సీ నమోదైంది. హైదరాబాద్ లో కూడా అదిరిపోయే రీతిలో కలెక్షన్స్ లెక్కలు కనిపించాయి. అయితే ఇప్పుడు తెలుగు డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేసి ఉంటే ఇంకా మంచి వసూళ్లు వచ్చేవని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.
నిజానికి తేరే ఇష్క్ మే.. తెలుగులోనూ రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అమర కావ్యం అనే టైటిల్ ను కూడా అనౌన్స్ చేశారు. కానీ ఏం జరిగిందో తెలియదు. థియేటర్స్ లో విడుదల చేయలేదు. అయితే హిందీ రొమాంటిక్ జోనర్ మూవీస్ ను హైదరాబాద్ మూవీ లవర్స్.. ఎంతో ఇంట్రెస్ట్ గా థియేటర్స్ లో చూస్తారు.
ఇది ఎప్పటి నుంచి జరుగుతున్న విషయమే. అది తెలిసినా కూడా మేకర్స్.. వచ్చి ఎలాంటి ప్రమోషన్స్ చేయలేదు. అలా జరిగి ఉంటే ఇంకా వసూళ్లు పెరిగేవి. ఇప్పటికైనా మించిపోయింది లేదని చెప్పాలి. హైదరాబాద్ వచ్చి పోస్ట్ ప్రమోషన్స్ నిర్వహిస్తే కచ్చితంగా లాభం ఉంటుంది. మరి తేరే ఇష్క్ మే మేకర్స్.. తెలుగు వెర్షన్ లో ఎందుకు ముందు అలా చేశారో.. ఇప్పుడు ఏం చేయనున్నారో వారికే తెలియాలి.
