అటు గుడి.. ఇటు డైనోసార్.. జక్కన్న ప్లాన్ ఏమై ఉండొచ్చు?
నిజానికి జక్కన్న సినిమాల్లో సెట్లకు ప్రత్యక స్థానం ఉంటుంది. కథకు తగ్గట్టుగా ఒక వరల్డ్ ను క్రియేట్ చేయడంలో ఆయన టీమ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది.
By: M Prashanth | 13 Sept 2026 9:00 PM ISTఒకవైపు భారీ గుడి.. మరోవైపు భారీ డైనోసార్.. ఆ రెండు కూడా ఒకే చోట కనిపిస్తే ఎవరికైనా ఒక్కటే ప్రశ్న వస్తుంది. అసలు వాటి మధ్య సంబంధం ఏంటి? ఇప్పుడు ఇదే ప్రశ్న వారణాసి మూవీ విషయంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సూపర్ స్టార్ మహేష్ బాబు లీడ్ రోల్ లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆ సినిమాకు సంబంధించిన ఓ లీక్డ్ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో కనిపిస్తున్న సెట్ చూస్తే.. జక్కన్న ప్లాన్ ఏంటో ఊహించడం కూడా కష్టంగా మారింది.
నిజానికి జక్కన్న సినిమాల్లో సెట్లకు ప్రత్యక స్థానం ఉంటుంది. కథకు తగ్గట్టుగా ఒక వరల్డ్ ను క్రియేట్ చేయడంలో ఆయన టీమ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇప్పుడు వారణాసి విషయంలో కూడా అదే రేంజ్ లో భారీ సెట్లు నిర్మిస్తున్నట్లు లీక్ ఫొటో చూస్తే క్లియర్ గా అర్థమవుతోంది. అయితే లీకుల బెడదపై కొందరు ఫైర్ అవుతుంటే.. మరికొందరు నెటిజన్లు మాత్రం డైనోసార్ కోసమే డిస్కస్ చేసుకుంటున్నారు.
ఎందుకంటే గుడి అంటే ఎవరైనా ఆధ్యాత్మికత గుర్తొస్తుంది. డైనోసార్ అంటే కొన్ని వేల ఏళ్ల క్రితం ఉన్న ప్రీ హిస్టారిక్ వరల్డ్ గుర్తొస్తుంది. అలాంటి రెండు పూర్తిగా భిన్నమైన అంశాలను రాజమౌళి ఒకే ఫ్రేమ్ లోకి తీసుకురావడం ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది. సినిమా కథలో ఆ రెండింటికీ ఏదైనా లింక్ ఉందా లేక ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే ఓ భారీ విజువల్ కోసం మాత్రమే ఆ సెట్ ను సిద్ధం చేశారా అనేది తెలియాల్సి ఉంది.
ఇప్పటికే వారణాసి విషయంలో టైమ్ ట్రావెల్, ప్రపంచాన్ని చుట్టే కథ వంటి ఎలిమెంట్స్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు డైనోసార్ లుక్ బయటకు రావడంతో ఆ ఇంట్రెస్ట్ మరింత పెరిగింది. ప్రాచీన ప్రపంచం, అప్పటి జీవులు.. ఇలా చాలా ఎలిమెంట్స్ ను కలిపి రాజమౌళి కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నారనే చర్చ మొదలైంది. అయితే లీక్డ్ ఫొటో ఆధారంగా సినిమా కథ ఇదేనని చెప్పడం కష్టం. ఇప్పటి వరకు స్టోరీపై ఎలాంటి క్లారిటీ లేదు.
అందుకే ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్నవన్నీ రూమర్లే. కానీ ఒక్క విషయం మాత్రం కనిపిస్తోంది. ‘వారణాసి’లో ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని ప్రపంచాన్ని చూపించాలనే ప్రయత్నం జరుగుతోంది. ఒక చిన్న లీక్డ్ ఫొటోనే ఇంత హైప్ పెంచితే.. సినిమా నుంచి ఫస్ట్ లుక్, టీజర్ లేదా స్టోరీకి సంబంధించిన మరిన్ని విజువల్స్ బయటకు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
ఇక సినిమాను రూ.1000 కోట్లకుపైగా భారీ బడ్జెట్ తో కేఎల్ నారాయణ రూపొందిస్తుండగా, పలువురు ఇంటర్నేషనల్ అండ్ ఇండియన్ స్టార్స్ నటిస్తున్నారు. మహేష్ బాబుతోపాటు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ లీడ్ రోల్స్ పోషిసున్నారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా, వచ్చే ఏడాది ఉగాది కానుకగా ఏప్రిల్ 7న సినిమా ఐమ్యాక్స్ ఫార్మాట్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
