Begin typing your search above and press return to search.

తెలుసు కదా.. సిద్ధు చెప్పిన ఫోర్త్ వీల్ సీక్రెట్..!

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటించిన తెలుసు కదా సినిమాను నీరజ కోన డైరెక్ట్ చేశారు.

By:  Ramesh Boddu   |   14 Oct 2025 11:15 AM IST
తెలుసు కదా.. సిద్ధు చెప్పిన ఫోర్త్ వీల్ సీక్రెట్..!
X

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటించిన తెలుసు కదా సినిమాను నీరజ కోన డైరెక్ట్ చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 17న రిలీజ్ అవుతుంది. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో సాంగ్స్ ఇప్పటికే ఆడియన్స్ ని మెప్పించాయి. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ కూడా సంథింగ్ క్యూరియస్ అబౌట్ మూవీ అనేలా చేసింది. తెలుసు కదా సినిమా మీద సిద్ధు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. దానికి రీజన్ సినిమా మీద అతనికి ఉన్న నమ్మకం.

హర్ష వచ్చిన ప్రతిసారి ఎంటర్టైన్..

ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో సినిమాలో హర్ష రోల్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు హీరో సిద్ధు. హర్ష కనిపించిన ప్రతిసారి నవ్వు వస్తుందని.. మా ముగ్గురితో పాటు హర్ష కూడా ఈ సినిమాకు ఫోర్త్ వీల్ అని అన్నాడు. సినిమా మొత్తం తనతో ఉంటూ ఎంటర్టైన్ చేస్తాడని. సినిమాలో కచ్చితంగా హ్యూమర్ ఉంటుంది. కానీ హర్ష వచ్చిన ప్రతిసారి ఎంటర్టైన్ అవుతారని అన్నాడు సిద్ధు.

తెలుసు కదా జెన్ Z లవ్ స్టోరీగా వస్తుంది. సిద్ధు జాక్ తర్వాత వస్తున్న ఈ సినిమా ట్రైలర్ అయితే స్పెషల్ గానే అనిపించింది. మొన్నటిదాకా కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన నీరజ కోన మొదటిసారి మెగా ఫోన్ పట్టుకుని చేసిన సినిమా తెలుసు కదా. ఈ సినిమా రిలీజ్ కు ముందే పాటలతో థమన్ బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు. మల్లిక గంద సాంగ్ ఇప్పటికే చార్ట్ బస్టర్ గా నిలిచింది.

జాక్ తీసి షాక్ ఇచ్చిన సిద్ధు..

డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ తర్వాత జాక్ తీసి షాక్ ఇచ్చిన సిద్ధు. తెలుసు కదా లాంటి ఒక మంచి లవ్ స్టోరీతో వస్తున్నాడు. ఐతే ప్రస్తుతం లవ్ స్టోరీ అంటే లిప్ లాక్స్ ఆశించడం కామనే. కానీ ఈ సినిమాలో వాటికన్నా ఎమోషనల్ ఇంటిమసీ ఉంటుందని అది కచ్చితంగా ఆడియన్స్ ని మెప్పిస్తుందని అన్నాడు సిద్ధు జొన్నలగడ్డ. హిట్ 3 తర్వాత శ్రీనిధి శెట్టి చేస్తున్న ఈ సినిమాలో ఆమె రోల్ స్పెషల్ గా ఉంటుందని తెలుస్తుంది. రాశి ఖన్నా కూడా ఈ సినిమాపై చాలా హోప్ తో ఉంది. మరి నీరజ కోన తెలుసు కదా సినిమాను ప్రేక్షకులకు ఎంత దగ్గరయ్యేలా చేసిందో తెలియాలంటే మరో 3 రోజులు వెయిట్ చేయాల్సిందే.