Begin typing your search above and press return to search.

తెలుసు కదా ట్రైలర్: ఇద్దరి అమ్మాయిల మధ్యలో సిద్ధు బోల్డ్ ప్రేమకథ

సక్సెస్ ఫెయిల్యూర్స్ సంబంధం లేకుండా ప్రతీ సినిమాతో ఒక డిఫరెంట్ స్టోరీ లైన్ ను టచ్ చేస్తున్నాడు సిద్ధు జొన్నలగడ్డ.

By:  M Prashanth   |   13 Oct 2025 3:43 PM IST
తెలుసు కదా ట్రైలర్: ఇద్దరి అమ్మాయిల మధ్యలో సిద్ధు బోల్డ్ ప్రేమకథ
X

సక్సెస్ ఫెయిల్యూర్స్ సంబంధం లేకుండా ప్రతీ సినిమాతో ఒక డిఫరెంట్ స్టోరీ లైన్ ను టచ్ చేస్తున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. అలాగే క్యారెక్టర్స్ విషయంలో కూడా కొత్త వేరియషన్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. 'డీజే టిల్లు' సినిమాతో యూత్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో సిద్ధు జొన్నలగడ్డ, ఇప్పుడు దర్శకురాలిగా మారిన కోన నీరజ తో 'తెలుసు కదా' అనే సినిమాతో సిద్ధమవుతున్నాడు.


ఈ సినిమా ప్రమోషనల్ మెటీరియల్‌తో, ముఖ్యంగా ఎస్. థమన్ పాటలతో ఇప్పటికే బజ్ క్రియేట్ చేసింది. తాజాగా విడుదలైన ట్రైలర్, ఈ సినిమాపై ఆసక్తిని పెంచింది. సిద్ధు రొమాంటిక్ రిలేషన్‌షిప్స్, దాని వల్ల వచ్చే ఎమోషనల్ మూమెంట్స్ చుట్టూ అల్లిన ఈ కథ డిఫరెంట్ గా ఉన్నట్లు అర్ధమవుతుంది. ​'తెలుసు కదా' ట్రైలర్ చూస్తే, సిద్ధు పాత్ర కొత్తగా ఇంటెన్స్‌గా కనిపిస్తోంది.

ట్రైలర్ మొదటి నుంచీ సిద్ధు, తన రొమాంటిక్ రిలేషన్‌షిప్స్ గురించిన ఉద్దేశాలను చెబుతూ పోతాడు. రాశీ ఖన్నా శ్రీనిధి శెట్టి ఇద్దరు హీరోయిన్స్‌తో సమాంతరంగా డేటింగ్ చేయడం, వారితో రిలేషన్‌షిప్స్ కొనసాగించడం చూపించారు. ఈ వ్యవహారం వల్ల అతనికి, అతని కుటుంబానికి కలిగే పరిస్థితులను చాలా బాగా క్యాప్చర్ చేశారని తెలుస్తోంది.

​దర్శకురాలు నీరజ కోన ఈ సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని చాలా ఎస్తెటిక్‌గా చిత్రీకరించారు. విజువల్స్, స్టైలిష్ ఫ్రేమ్స్ సినిమాకు ఒక కొత్త ఆకర్షణను తీసుకొచ్చాయి. సిద్ధు తన చార్మ్‌తో ఈ భిన్నమైన పాత్రను చాలా ఈజీగా హ్యాండిల్ చేశాడు. అతని ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఈ ట్రైలర్‌కు ఒక హైలైట్‌గా నిలిచాయి.

​ట్రైలర్‌లో అయితే స్టోరీ లైన్ ఏంటనేది పూర్తిగా రివీల్ చేయలేదు. ఎమోషన్స్ ఎప్పుడూ మన కంట్రోల్‌లోనే ఉండాలి, ప్రేమించిన వాళ్లకు అస్సలు ఇవ్వకూడదు అనుకునే మనస్తత్వంతో సిద్ధు ఉంటాడు.

అలాంటి అబ్బాయి ఇద్దరమ్మాయిలతో డేటింగ్‌లోకి వెళ్లే క్రమంలో అతని ఎమోషన్స్ ఏ విధంగా మారతాయి అనే క్యూరియసిటిని క్రియేట్ చేశారు. ఇక వైవా హర్ష కాంబినేషన్ రెగ్యులర్ కామెడి టోన్ లో కాకుండా కథలో హీరో భావాలను హైలెట్ చేసేలా ఉంది. ఇక హీరోయిన్స్ హీరో తో కలిసి ఎలా జర్నీ చేస్తారు? ఇంతకీ వీరి మధ్య ఏం జరిగింది? అనేది సినిమా చూస్తేనే తెలియాలి.

చూస్తుంటే రెగ్యులర్ లవ్ స్టోరీ అయితే అనిపించడం లేదు. మరోవైపు, ఈ సినిమాకు థమన్ అందించిన బీజీఎం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా క్వాలిటీని పెంచాయి. ఇక ​దీపావళి వీకెండ్ లో గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న సినిమాల్లో తెలుసు కదా.. ఇంపాక్ట్ క్రియేగ్ చేసేలా కనిపిస్తోంది. ట్రైలర్ లో ఉన్న ప్రత్యేకత సినిమాల్లో ఉంటే కచ్చితంగా యూత్ ఆడియెన్స్ ను భారీగా థియేటర్స్ కు లాగే ఛాన్స్ ఉంది.