Begin typing your search above and press return to search.

తెలుసు కదా రిజల్ట్.. ఆ కారణం వల్లే..

అయితే మంచి బజ్ మధ్య రిలీజ్ అయిన తెలుసు కదా మూవీకి ఆడియన్స్ నుంచి మిక్స్ డ్ టాక్ మాత్రమే వచ్చింది. కానీ సినిమా మాత్రం ఓ డిఫరెంట్ కథతో రూపొందింది.

By:  M Prashanth   |   21 Oct 2025 6:50 PM IST
తెలుసు కదా రిజల్ట్.. ఆ కారణం వల్లే..
X

టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ లీడ్ రోల్ లో నటించిన తెలుసు కదా మూవీ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రొమాంటిక్ అండ్ మ్యూజికల్ ఎంటర్టైనర్‌ గా ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకత్వం వహించిన ఆ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు.

రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించిన ఆ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి, హర్ష చెముడు కీలక పాత్రల్లో నటించారు. కామెడీ, ఎమోషన్, ఫ్యామిలీ వ్యాల్స్ తో మిళితమైన మూవీకి తమన్ మ్యూజిక్ అందించారు. దీపావళి పండుగ కానుకగా అక్టోబర్ 17వ తేదీన సినిమాను వరల్డ్ వైడ్ గా విడుదల చేశారు మేకర్స్.

అయితే మంచి బజ్ మధ్య రిలీజ్ అయిన తెలుసు కదా మూవీకి ఆడియన్స్ నుంచి మిక్స్ డ్ టాక్ మాత్రమే వచ్చింది. కానీ సినిమా మాత్రం ఓ డిఫరెంట్ కథతో రూపొందింది. యంగ్ ఆడియన్స్ కు మాత్రమే కనెక్ట్ అయింది. ముఖ్యంగా స్టోరీని అర్థం చేసుకున్న వాళ్లకు నచ్చింది. ఆ విషయాన్ని కొందరు సినీ ప్రియులు.. ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా చెప్పారు.

అదే సమయంలో క్రిటిక్స్ కూడా చాలా మంది సినిమాపై రివ్యూస్ ఇచ్చారు. కొందరు సినిమా సూపర్ నేరేషన్ తో బాగుందని చెబుతున్నారు. సింపుల్ కథతో బాగా తీశారని.. సిద్ధు బ్యాక్ టూ కోర్ అంటూ కొనియాడుతున్నారు. చాలా కన్వర్జేషన్స్ లో డెప్త్ ఫుల్ గా ఉందని అంటున్నారు. మెచ్యూరిటీ ఉందని రివ్యూస్ చేస్తున్నారు.

దీంతో మెచ్యూరిటీతో ఆలోచించిన క్రిటిక్స్ కు బాగా నచ్చిందనే చెప్పాలి. అదే సమయంలో సోషల్ మీడియాలో కొందరు సిద్దు ఫ్యాన్స్.. మంచి మూవీ అని చెబుతున్నారు. డైలాగ్స్ కొన్ని సూపర్ గా ఉన్నాయని అంటున్నారు. ఫీలింగ్స్ రమ్మంటే వచ్చాయా.. పొమ్మంటే పోడానికి.. కొన్ని ఫీలింగ్స్ అంత ఈజీగా పోవు అంటూ సిద్ధూ చెప్పిన డైలాగ్స్ ను ట్రెండ్ చేస్తున్నారు.

ఏదేమైనా మూవీకు మిక్స్ డ్ రెస్పాన్స్, మిక్స్ డ్ టాక్ వచ్చినా.. తెలుసు కదా ఓ స్పెషల్ సినిమా అని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. దీపావళి కానుకగా వచ్చిన చిత్రాల్లో ఇది ఒక మంచి చిత్రం. కానీ సినిమా స్టోరీ విషయంలో కన్ఫ్యూజ్ అయిపోతుండడం వల్లే అందరికీ నచ్చడం లేదని అర్థమవుతుంది. మెచ్యూరిటీతో ఆలోచిస్తే మాత్రం మూవీ కచ్చితంగా నచ్చుతుంది.