రవితేజ బయోపిక్ చేద్దామనుకున్న.. మంచి కథ ఉంటే చెప్పండి: సిద్ధు
తెలుసు కదాలో క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడుతూ.. సినిమాలో క్యారెక్టరైజేషన్ స్ట్రాంగ్ గా ఉంటుందని తెలిపారు. "క్లైమాక్స్ ఇప్పటికే చూశా.
By: M Prashanth | 15 Oct 2025 12:56 AM ISTటాలీవుడ్ యంగ్ హీరో, స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ.. ఇప్పుడు తెలుసు కదా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. నీరజ కోన దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా.. అక్టోబర్ 18వ తేదీన రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సిద్ధు తాజాగా ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఆ సమయంలో మీడియా ప్రతినిధులతో పలు విషయాలపై మాట్లాడారు.
ముందుగా తెలుసు కదా మూవీ ఎప్పుడు స్టార్ట్ అయిందో, కథను నీరజ ఎప్పుడు చెప్పారో వివరించారు సిద్ధు. "ఏడాదిన్నర క్రితం బయట కలిసినప్పుడు ఓ ఐడియా రూపంలో కథ చెప్పారు నీరజ. ఎగ్జైటింగ్ గా ఉందని అన్నా. మళ్లీ మరోసారి కలిసినప్పుడు ఫుల్ లైన్ చెప్పారు. ఐడియా బాగుంది కానీ వర్క్ చేయాలని చెప్పా. స్టోరీ ఓకే.. క్యారెక్టరైజేషన్ లో వర్క్ కావాలని చెప్పా. టిల్లు స్క్వేర్ తర్వాత కాబట్టి క్యారెక్టరైజేషన్ లో డెప్త్ ఉండాలని కూడా తెలిపా. అది బాగుంటే సినిమాలు ఆడుతాయి. కాబట్టి స్ట్రాంగ్ గా ఉండాలి. ఆ తర్వాత సినిమా స్టోరీ ఓకే చేసి అనౌన్స్ చేశాం" అని చెప్పారు.
తెలుసు కదాలో క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడుతూ.. సినిమాలో క్యారెక్టరైజేషన్ స్ట్రాంగ్ గా ఉంటుందని తెలిపారు. "క్లైమాక్స్ ఇప్పటికే చూశా. సినిమాలో క్యారెక్టర్ సర్ప్రైజ్ చేస్తుందని అనుకుంటున్నా. థియేటర్ జడ్జిమెంట్ కోసం వేచి చూస్తున్నానని, జనాలు ఎలా అనుకుంటారో చూడాలని అన్నారు. అప్పుడే కదా అసలు సక్సెస్ తెలుస్తుంది" అంటూ సిద్ధు చెప్పుకొచ్చారు.
ఆ తర్వాత సినిమాలో హర్ష కామిక్ టైమింగ్ కోసం మాట్లాడారు. తెలుసు కదాలో చాలా హ్యూమర్ ఉంటుందని, కానీ కామెడీ ఎక్కువగా ఉండకపోవచ్చని చెప్పారు. హర్ష క్యారెక్టర్ అప్పుడప్పుడు నవ్విస్తుంటుందని వెల్లడించారు. అనంతరం ట్రైలర్ డిలేపై క్లారిటీ ఇచ్చారు. "సోషల్ మీడియాలో ఎందుకు లేటైందో నాకు తెలియదు. ముందు ఓ ట్రైలర్ కట్ చేశాం. వైజాగ్ లో లాంఛ్ అనుకుంటే క్యాన్సిల్ అయింది. సడెన్ గా ట్రైలర్ చూశాక నచ్చలేదు. మళ్లీ కట్ చేసి రిలీజ్ చేశాం" అని చెప్పారు.
మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిద్ధు ఆ అంశంపై స్పందించారు. "మైక్ ఉంది కదా అని చెప్పి అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. దానికి ఏం రియాక్ట్ అవ్వాలో నాకు నచ్చలేదు. దానిని దాటవేశా. ట్రైలర్ వల్ల బజ్ వచ్చింది. పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. సినిమా అనే విషయం మర్చిపోతున్నారా.. పర్సనల్ మైక్ పట్టుకుని.. హీరో ఉన్నాడని ఆన్సరబుల్ పొజిషన్ లో ఉంటే అలా అనేయడం కరెక్ట్ కాదు. వాళ్లకు వాళ్లే రియలైజ్ ఇవ్వాలి. కూర్చుని మైక్ పట్టుకుంటే పవర్ ఫీలవుతున్నారు. ముందు ఒకలా.. తర్వాత ఒకలా ఉన్నారు. ఇది హెల్తీ వాతావరణం మాత్రం కాదు" అని అన్నారు.
"నా ఒపీనియన్ ఏం ఉండదు. అడిగే వాళ్ళని అడగండి. నాతో ఎవరైనా అలాంటి మాట అది నా క్యారెక్టర్ కాదు.. వాళ్ల క్యారెక్టర్ రిఫ్లెక్ట్ చేస్తుంది. నేను ప్రతి విషయాన్ని సీరియస్ గా తీసుకున్నా. పక్కన పెట్టా. దాని కోసం మర్చిపోవాలి. నేను ఏ స్టాండ్ పై లేను. అది తప్పో కాదో ఆమెనే తెలుసుకుంటారు. తెలుసుకోకపోయినా పర్లేదు. అందరూ గౌరవం మెయింటైన్ చేయాలి. అందరితో మాట్లాడితే చిల్ గా ఉంటుంది. అన్ హెల్తీ ఎక్స్పీరియన్స్ ఉండకూడదు" అని సిద్ధు తెలిపారు.
ఆ తర్వాత సినిమా కోసం మాట్లాడారు. "తెలుసు కదా ఒక ఒరిజినల్ ఫిల్మ్. 80 శాతం కొత్త సీన్స్. ఎక్కడా చూసి ఉండరు. సినిమాలోని ప్రతి సీన్ కొత్తగానే ఉంటుంది. స్ట్రాంగ్ క్యారక్టరైజేషన్స్ ఉంటాయి. హీరో ఇంకా స్ట్రాంగ్. ఏ సినిమా ఏ జాన్రాతో కంపేర్ చేయలేం. మూవీ రిలీజ్ అయ్యాక జాన్రా క్రియేట్ అవుతుంది" అని చెప్పారు. "సినిమా ఒప్పుకోవడానికి యూనిక్ పాయింట్ ఉంది. అందుకే ఒప్పుకున్నా. క్యారెక్టరైజేషన్ స్ట్రాంగ్ బిల్డ్ అయ్యాక షూటింగ్ కు వస్తా అనే చెప్పా. అదే జరిగింది" అని అన్నారు.
"పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో వర్క్ చేయడం ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. విశ్వ గారు ఎప్పుడూ వెనుకాడరు. మంచి సినిమా తీయడమే వాళ్ల మోటో" అని చెప్పిన సిద్ధు.. రవితేజ బయోపిక్ కోసం మాట్లాడారు. "నిజంగా అప్పుడు తీద్దామనుకున్నా. స్క్రిప్ట్ అంటే బయట రవితేజ తెలుసు. రవితేజ గారితో కాంబో కావాలంటే.. మంచి కథ ఉంటే చెప్పండి" అని తెలిపారు. నీరజ మేకింగ్ గురించి మాట్లాడుతూ, "ఫస్ట్ టైమ్ ఎక్స్పీరియన్స్ లేకుండా సినిమా చేయడం రిస్క్. కానీ రిస్క్ లేకుంటే రివార్డు రాదు. పాయింట్ నచ్చింది కాబట్టి ఓకే చెప్పా. నీరజ గారితో ఎలాంటి టీమ్ వర్క్ చేయాలో ముందే క్లారిటీగా ఉన్నా. తమన్ ను తీసుకొచ్చాం. నవీన్ గారిని, అవినాష్ గారిని తీసుకొచ్చా. అందుకే కరెక్ట్ లేదోమోనని అనిపించదు. పెద్ద సినిమాలాగానే అనిపిస్తుంది" అని తెలిపారు.
