Begin typing your search above and press return to search.

డీజే టిల్లు కాదు.. ఇప్పట్నుంచి తెలుసు కదా అంటారు

డీజే టిల్లు సినిమాలతో యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డకు యూత్ లో ఫుల్ క్రేజ్ వచ్చిన విషయం తెలిసింది.

By:  M Prashanth   |   31 July 2025 10:54 AM IST
Telusu Kada First Song: Siddu & Raashi Spark Romance
X

డీజే టిల్లు సినిమాలతో యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డకు యూత్ లో ఫుల్ క్రేజ్ వచ్చిన విషయం తెలిసింది. ప్రస్తుతం ఆయన తెలుసు కదా సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. నీరజ కోనా తెరక్కిస్తున్న ఈ సినిమాలో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా సినిమా నుంచి తొలి పాట రిలీజ్ చేశారు.

సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఫస్ట్ సింగిల్ రిలీజ్ కోసం ఓ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లోనే తమన్ స్వరాలు సమకూర్చిన మల్లిక గంద అనే పాట తాజాగా రిలీజైంది. లిరిసిస్ట్ కృష్ణ కాంత్ రాసిన ఈ పాటను సిధ్ శ్రీరామ్ పాటను ఆలపించారు. మెలోడియస్ గా ఉన్న ఈ పాట మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటుంది.

తమన్ మ్యూజిక్ తో మరోసారి మ్యాజిక్ చేశారు. ఇక ఈ పాటలో సిద్ధు- రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరినట్లు కనిపిస్తుంది. వైఫ్ అండ్ హస్బెండ్ గా కనిపిస్తున్నారు. రొమాంటిక్ గా ఉన్న ఈ పాట ఆలరిస్తుంది. ఇది పక్కా 2025 రొమాంటిక్ హిట్ లో ఒకటిగా నిలువడం పక్కా అని ఆడియెన్స్ కామెంట్ పెడుతున్నారు.

మరోవైపు ఈ సాంగ్ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న రాశీ ఖన్నా మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ.. ఈ ఈవెంట్ లో తమన్, సిద్ శ్రీరామ్ స్టార్లు. తమన్ అద్భుతమైన సంగీతం అందించారు. లవ్ స్టోరీకి మ్యూజిక్ అందించాలంటే అందిరికీ ఫస్ట్ ఛాయిస్ తమనే. ఇక ఫీమేల్ డైరెక్టర్ తో పనిచేయడం నాకు ఇదే తొలిసారి.

నీరజా కోన ఈ సినిమాకు వెన్నుముక. అయితే అందరూ సిద్దు బెస్ట్ ఫిల్మ్ డీజే టిల్లు అని చెబుతున్నారు. కానీ, ఈ సినిమా చూసిన తర్వాత అందరూ తెలుసు కదా అని చెబుతారు. ఈ సినిమాలో సిద్ధు క్యారెక్టర్ తో ప్రేమలో పడిపోతారు. అంత బాగా వచ్చింది. అని రాశీ ఖన్నా అన్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాతోనే నీరజ కోన డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. ట్రై యాంగిల్ స్టోరీగా ఇది తెరకెక్కుతుంది. ఇటీవల టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో సిద్ధు- రాశీ ఖన్నా- శ్రీనిధి శెట్టి మధ్య సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. అక్టోబర్ 17న ఈ సినిమా రిలీజ్ కానుంది.