Begin typing your search above and press return to search.

తెరపై జరిగినట్టు వుండదు.. రాశి ఎమోషనల్ కామెంట్స్!

హీరోయిన్ రాశి ఖన్నా త్వరలోనే 'తెలుసు కదా' అనే మూవీతో మన ముందుకు రాబోతోంది.

By:  Madhu Reddy   |   13 Oct 2025 1:44 PM IST
తెరపై జరిగినట్టు వుండదు.. రాశి ఎమోషనల్ కామెంట్స్!
X

హీరోయిన్ రాశి ఖన్నా త్వరలోనే 'తెలుసు కదా' అనే మూవీతో మన ముందుకు రాబోతోంది. ఈ సినిమా అక్టోబర్ 17న అంటే మరో నాలుగు రోజుల్లో విడుదలకు సిద్ధంగా ఉండడంతో సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా గడుపుతున్నారు చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలోనే రాశిఖన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సినిమాతో పాటు ప్రేమ గురించి ఎమోషనల్ కామెంట్స్ చేసింది. తెరపై చూపించినట్లుగా అన్ని ప్రేమలు అలా ఉండవు. నిజ జీవితంలో వేరుగా ఉంటాయి అని రాశిఖన్నా మాట్లాడిన మాటలు చాలామందిని ఆకట్టుకున్నాయి.ముఖ్యంగా ప్రేమ గురించి రాశి ఖన్నా ఎందుకు అంత ఎమోషనల్ గా మాట్లాడింది.. ఆమె లైఫ్ లో ఏదైనా చేదు అనుభవాలు ఉన్నాయా అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

సిద్దు జొన్నలగడ్డ హీరోగా.. శ్రీనిధి శెట్టి,రాశి ఖన్నా హీరోయిన్స్ గా వస్తున్న తాజా మూవీ తెలుసు కదా.. నీరజ కోన దర్శకురాలిగా చేసిన ఈ సినిమా ప్రమోషన్స్ లో తాజాగా రాశి ఖన్నా మాట్లాడుతూ.. "తెలుసు కదా సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండడంతో అందరూ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనుకుంటారు.కానీ ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు. ఈ సినిమాలో ఒక మంచి పాయింట్ ఉంది. ఈ సినిమాల ప్రేమ యొక్క వాస్తవికతను ప్రతిబింబిస్తుంది.

అలాగే నేను చిన్నతనంలో ఎక్కువగా షారుఖ్ ఖాన్ సినిమాలను ఆస్వాదిస్తూ పెరిగాను. ఆయన సినిమాలను నేను చిన్నప్పటినుండి చూసాను. ఈ సినిమాలను చూసి తెరపై చూపించినట్టు నిజ జీవితంలో కూడా ప్రేమ అలాగే ఉంటుందని నేను అనుకున్నాను.కానీ అది వాస్తవం కాదు.ఎందుకంటే తెరపై చూసే ప్రేమకి మన నిజ జీవితంలో ఉండే ప్రేమకి చాలా తేడాలు ఉంటాయి. తెరపై చూసే ప్రేమ నిజ జీవిత ప్రేమకి భిన్నంగా ఉంటుంది.. సినిమాల్లో వర్ణించలేనివి నిజ జీవితంలో చూస్తాము..

అలాగే నేను కొన్ని హృదయ విదారక సంఘటనలు ఎదుర్కొన్న తర్వాతే ఈ విషయాలన్నీ అర్థం చేసుకోగలిగాను. ఇతరుల మీద నా ఆనందం ఎందుకు ఆధారపడి ఉండాలని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. నా చేతుల్లో ఉన్నది నేను చేయాలి ఇతరుల నుండి ఏమీ ఆశించకూడదని ఫిక్స్ అయ్యాను" అంటూ రాశి ఖన్నా నిజ జీవితంలో ఉండే ప్రేమల గురించి ఎమోషనల్ కామెంట్స్ చేసింది.

అయితే రాశి ఖన్నా చేసిన కామెంట్లు విన్న చాలా మంది నెటిజన్లు ఆమె లైఫ్ లో ప్రేమ కారణంగా చాలానే ఇబ్బందులు ఫేస్ చేసినట్టు అర్థమవుతుంది. అందుకే రీల్ లైఫ్, రియల్ లైఫ్ ప్రేమలు భిన్నంగా ఉంటాయని చెప్పుకొచ్చింది. తాను రెండుసార్లు ప్రేమలో పడ్డానని, ఒకటి ఇండస్ట్రీలోకి రాకముందు, రెండోది ఇండస్ట్రీలోకి వచ్చాక అని కూడా స్పష్టం చేసింది.

రాశి ఖన్నా సినిమాల విషయానికి వస్తే.. తెలుసు కదా మూవీ తో పాటు పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా నటిస్తోంది. అలాగే హిందీలో 120 బహదూర్ తో పాటూ మరో 3 చిత్రాలలో నటిస్తోంది.