Begin typing your search above and press return to search.

సీనియర్ స్టార్స్ ఎక్స్ పెరిమెంట్ లెక్క వేరు..!

టాలీవుడ్ లో తప్ప ఇతర భాషల సీనియర్ హీరోలంతా కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ లతో రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు.

By:  Ramesh Boddu   |   6 Dec 2025 10:00 PM IST
సీనియర్ స్టార్స్ ఎక్స్ పెరిమెంట్ లెక్క వేరు..!
X

టాలీవుడ్ లో తప్ప ఇతర భాషల సీనియర్ హీరోలంతా కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ లతో రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ముఖ్యంగా డ్యూయెట్లు, ఫైట్లు లాంటివి ఎప్పుడో మానేసి సరికొత్త కాన్సెప్ట్ తో తమలోని కొత్త యాంగిల్ ని కొత్త కథలను తీసుకొస్తున్నారు. ఐతే తెలుగు సీనియర్ స్టార్స్ అలా చేయరు. వారు చేయడం కాదు ఇక్కడ ఫ్యాన్స్ అలా చేసినా యాక్సెప్ట్ చేయరు. కేవలం ఫ్యాన్స్ కోసమే మన సీనియర్ స్టార్స్ సినిమాలు చేస్తున్నారా అంటే అవును వారికోసమే అనే మాటే వినిపిస్తుంది.

మెగా ఫ్యాన్స్ మాస్ అండ్ కమర్షియల్ సినిమాలు..

ఎక్సాంపుల్ కి మన మెగాస్టార్ కెరీర్ స్వింగ్ లో ఉన్నప్పుడే కొన్ని ప్రయోగాలు చేశాడు కానీ అప్పుడే ఆదరించలేదు. ఐతే ఇప్పుడు ఈ ఏజ్ లో ఆయన అలాంటి సినిమాలు చేయొచ్చు కదా అనుకోవచ్చు. మెగాస్టార్ ఇమేజ్ కు మెగా ఫ్యాన్స్ ఆయన నుంచి ఇంకా మాస్ అండ్ కమర్షియల్ సినిమాలే ఆశిస్తున్నారు. సో ఇప్పటికైతే అలాంటి సినిమాలే చేయాలి. అలా కాకుండా మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి వాళ్లు చేస్తున్న సినిమాలు చేయమంటే మాత్రం రిజల్ట్ తేడా కొట్టేస్తుంది.

మరో సీనియర్ హీరో బాలకృష్ణ కూడా మాస్ యాక్షన్ సినిమాలతోనే ఫ్యాన్స్ ని మెప్పిస్తున్నారు. ఆయనలోని మాస్ ఎనర్జీ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుంది. అందుకే ఆడియన్స్ ని మెప్పించాలనే రక్రకాల మాస్ స్టోరీస్ తో బాలయ్య సినిమాలు చేస్తుంటారు. ఇక వెంకటేష్, నాగార్జున కూడా కమర్షియల్ చట్రంలోనే సినిమాలు చేస్తుంటారు. అప్పుడప్పుడు నాగార్జున కొన్ని ఎక్స్ పెరిమెంట్స్ చేసినా అందులో కొన్ని సక్సెస్ లు అయితే మరికొన్ని ఫ్లాపులు అయ్యాయి.

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ నెగిటివ్ రోల్స్ చేస్తే..

మలయాళంలో మోహన్ లాల్ కథా బలం ఉన్న సినిమాలు చేస్తారు. ఆయన పాత్ర కోసం ఎలాంటి రిస్క్ అయినా తీసుకుంటారు. ఇక మమ్ముట్టి అయితే డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ తో సర్ ప్రైజ్ చేస్తారు. రీసెంట్ గా ఆయన ఒక సినిమాలో సైకో కిల్లర్ గా కనిపించారు. ఐతే అంత పెద్ద స్టార్ సైకో కిల్లర్ అంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా అనే డౌట్ వారికి ఉండదు. ఎందుకంటే అక్కడ ఆడియన్స్ వాళ్లని అలాంటి రోల్స్ లో చూడటానికి ఇష్టపడతారు. కానీ మన దగ్గర అలా కాదు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ నెగిటివ్ రోల్స్ చేస్తే అసలు ఒప్పుకోలేరు. రీసెంట్ గా కూలీ కోసం నాగార్జున చేసిన నెగిటివ్ రోల్ కూడా అంత ఇంపాక్ట్ చూపించలేకపోయింది.

సో మలయాళ స్టార్స్ తో మన స్టార్స్ కపేరిజన్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో డిస్కషన్ పాయింట్ అయినా తెలుగు స్టార్స్ లెక్క వేరు.. వారి సినిమాల రీచ్ వేరు. మలయాళ స్టార్స్ పంథా వేరు వారి సినిమాల కమిట్మెంట్ వేరు. ముఖ్యంగా అక్కడ ఇక్కడ ఆడియన్స్ మైండ్ సెట్ పూర్తిగా వేరుగా ఉంటుంది. అందుకే సినిమాలు కూడా డిఫరెంట్ గా ఉంటాయి.