Begin typing your search above and press return to search.

ఆ హీరోలంద‌రూ రిలీజ్ ఎటూ తేల్చుకోలేకా?

అధికారికంగా వాటి రిలీజ్ డేట్ ప్ర‌క‌టించే వ‌ర‌కూ రిలీజ్ ఎప్పుడు ఉంటుంద‌ని కచ్చిత‌మైన అంచ‌నా వేయ‌డం క‌ష్టం.

By:  Srikanth Kontham   |   30 Oct 2025 5:00 PM IST
ఆ హీరోలంద‌రూ రిలీజ్ ఎటూ తేల్చుకోలేకా?
X

స్టార్ హీరోల చిత్రాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి? అన్న‌ది కచ్చితంగా చెప్ప‌లేం. కొంత మంది స్టార్లు ముందే రిలీజ్ డేట్లు ఫిక్స్ చేసుకున్నా? చివ‌రి నిమిషంలో మారొచ్చు. మార‌లేదంటే య‌దావిధిగా రిలీజ్ అవుతాయి. అలాగే పాన్ ఇండియా సినిమాల విష‌యంలో ఇలాంటి సందిగ్ద‌త కొన‌సాగుతుంది. అధికారికంగా వాటి రిలీజ్ డేట్ ప్ర‌క‌టించే వ‌ర‌కూ రిలీజ్ ఎప్పుడు ఉంటుంద‌ని కచ్చిత‌మైన అంచ‌నా వేయ‌డం క‌ష్టం. వాళ్ల‌తో పాటు టైర్ 2 హీరోల రిలీజ్ ప‌రిస్థితి అలాగే మారింది. నాని, నిఖిల్, సాయితేజ్, అఖిల్ స‌హా చాలా మంది యంగ్ హీరోలు కూడా త‌మ సినిమా రిలీజ్ లు ఎప్పుడు ఉంటాయి? అన్న‌ది చెప్ప‌లేక‌పోతున్నారు.

టైర్ 2 హీరోల‌ది అదే ప‌రిస్థితి:

నాని హీరోగా న‌టిస్తోన్న `ది ప్యార‌డైజ్` మార్చిలో రిలీజ్ చేయాల‌నుకున్నాడు. పాన్ ఇండియా రిలీజ్ కావ‌డంతో మార్చి 27 అనుకున్నాడు. కానీ స‌రిగ్గా అదే తేదికి పాన్ ఇండియాలో `పెద్ది` రిలీజ్ అవుతుంది. దీంతో నాని ఆ డేట్ ను వ‌దులుకుంటున్నాడు. త‌దుప‌రి రిలీజ్ ఎప్పుడు ? అన్న‌ది ఇంకా డిసైడ్ అవ్వ‌లేదు. అలాగే నాగచైత‌న్య హీరోగా కార్తీక్ దండు ద‌ర్శ‌క‌త్వంలో ఓ మిస్టిక‌ల్ థ్రిల్ల‌ర్ తెరెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. `తండేల్` తర్వాత చైత‌న్య నుంచి రిలీజ్ అవుతున్న చిత్ర‌మిది. ఇప్ప‌టికే షూటింగ్ ఓ కొలిక్కి వ‌చ్చింది. వ‌చ్చే ఏడాది రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.

రెండు రిలీజ్ లు ఒకేసారి:

కానీ ఇంత వ‌ర‌కూ రిలీజ్ తేదీ ఇవ్వ‌లేదు. ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ రిలీజ్ స్లాట్ ఇస్తే గానీ డేట్ ఇవ్వ‌లేము అంటున్నారు. అలాగే మ‌రో యంగ్ హీరో నిఖిల్ న‌టిస్తోన్న రెండు సినిమాల విష‌యంలో కూడా ఇలాంటి తర్జ‌న భ‌ర్జ‌న కొన‌సాగుతుంది. `స్వ‌యంభు` విష‌యంలో ఎలాంటి డ్రామా న‌డుస్తుందో తెలిసిందే. ఈ సినిమా ఇప్ప‌టికే రిలీజ్ అవ్వాలి. కానీ ఇంత వ‌ర‌కూ క‌నీసం డేట్ కూడా ఇవ్వ‌లేని స‌న్నివేశంలో ఉన్నారు. మెగా మేన‌ల్లుడు సాయితేజ్ న‌టిస్తోన్న `సంబ‌రాల ఏటిగ‌ట్టు` చిత్రీక‌ర‌ణ దాదాపు పూర్త‌యింది.

రిలీజ్ గంద‌ర‌గోళం ఇంకా పెరుగుతుందా:

ఈ సినిమా చాలా కాలంగా సెట్స్ లోనే ఉంది. కానీ ఇంత వ‌ర‌కూ రిలీజ్ తేదీ ప్ర‌క‌టించ‌లేదు. వ‌చ్చే ఏడాదైనా రిలీజ్ అవుతుందా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కొంత మంది స్టార్ హీరోలు రిలీజ్ తేదీలు ఇచ్చి వెన‌క్కి తీసుకోవ‌డం తో లైన్ లో ఉన్న రిలీజ్ ల‌పై ఆ ప్ర‌భావం ప‌డుతుంది. ఇనిస్టెంట్ గా అప్ప‌టిక‌ప్ప‌డు రిలీజ్ ప్లాన్ ఛేంజ్ చేసుకోవాల్సి వ‌స్తోంది. మును ముందు ఈ రిలీజ్ గంద‌ర‌గోళం మ‌రింత పెరుగుతుంద‌ని విష్ల‌కులు అంచ‌నా వేస్తున్నారు.