Begin typing your search above and press return to search.

స్టార్ హీరోల ఎదురుచూపు దేని కోసం ఇండస్ట్రీ హిట్ కొట్టాలంటే ఆ ఒక్కటి మార్చుకోవాల్సిందేనా...

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు.

By:  Gopi Velupala   |   23 Sept 2026 11:00 PM IST
స్టార్ హీరోల ఎదురుచూపు దేని కోసం ఇండస్ట్రీ హిట్ కొట్టాలంటే ఆ ఒక్కటి మార్చుకోవాల్సిందేనా...
X

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని సైతం శాసించే స్థాయికి మన తెలుగు హీరోలు వెళ్లడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన రాని గుర్తింపును మన స్టార్ హీరోలు తెచ్చుకున్నారు. పాన్ ఇండియాలో పెను సంచలనాలను సృష్టిస్తూ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయారు. ఇలాంటి సందర్భంలోనే ప్రస్తుతం వాళ్లు ఎలాంటి సినిమాలు చేస్తే ఇండస్ట్రీ హిట్లు దక్కుతాయనే విషయంలో స్పెషల్ కేర్ అయితే తీసుకుంటున్నారు. ఇప్పటివరకు చేసిన సినిమాలన్నింటిని పక్కన పెడుతూ కొత్త కథల మీద ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. నిజానికి ఇండస్ట్రీ హిట్లు దక్కాలి అంటే హీరోలు సేఫ్ జోన్ నుంచి బయటికి రావాల్సిన అవసరమైతే ఉంది.

కమర్షియల్ సినిమాలనే కాకుండా ఆర్ట్ సినిమాల వైపు కూడా మన వాళ్ళు స్పెషల్ ఫోకస్ పెడితే తప్పకుండా ప్రేక్షకుడికి ఒక డిఫరెంట్ ఫీలింగ్ కలుగుతుంది. కొత్తదనాన్ని ఎప్పుడైతే హీరోలు ముందుకు తీసుకొస్తారో అప్పుడు ప్రేక్షకులు తప్పకుండా ఆ సినిమాలను ఆదరిస్తారు. అందువల్లే తమలో ఉన్న ఒక ఫ్రెష్ ఫీల్ ను బయటికి తీసుకొస్తూ వాళ్లను వాళ్లు కొత్తగా ప్రజెంట్ చేసుకునే ప్రయత్నం చేస్తే మాత్రం తప్పకుండా వాళ్లకు ఇండస్ట్రీ హిట్లు దక్కుతాయనేది వాస్తవం. ప్రస్తుతం ఉన్న రోజుల్లో మన స్టార్ హీరోలు వాళ్ళని వాళ్లు గొప్పగా ప్రజెంట్ చేసుకుంటే తప్పకుండా వాళ్ళు విజయాలను సాధించడమే కాకుండా ఇండస్ట్రీ హిట్ల ను సైతం తమ ఖాతాలో వేసుకుంటారనేది వాస్తవం...

ఇక ఇప్పటికే చాలామంది హీరోలు డిఫరెంట్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు.. పాన్ ఇండియాలో తెలుగు హీరోల హవా ఎక్కువగా కొనసాగుతుంది. కాబట్టి మనవాళ్లు చేసే సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంటే తప్పకుండా ఇండస్ట్రీ హిట్ గా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మన హీరోలకు ఎక్కడ లేని క్రేజ్ అయితే దక్కుతుంది. మనవళ్ళు చేసే ప్రతి సినిమా కోసం యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అంటే మన వాళ్లకు ఏ రేంజ్ గుర్తింపు ఉందొ మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇలాంటి ఒక మంచి మూమెంట్ ను వాడుకొని మన హీరోలు ఎక్కువ సంఖ్యలో ఇండస్ట్రీ హిట్లను సాధిస్తే బాగుంటుంది...