Begin typing your search above and press return to search.

రూ.3000 కోట్ల డైరెక్టర్‌పై కన్నేసిన టాలీవుడ్ హీరో?

ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు ఒకే ఒక్క పేరు మార్మోగిపోతోంది.. అదే ఆదిత్య ధర్.

By:  M Prashanth   |   28 April 2026 5:00 AM IST
రూ.3000 కోట్ల డైరెక్టర్‌పై కన్నేసిన టాలీవుడ్ హీరో?
X

ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు ఒకే ఒక్క పేరు మార్మోగిపోతోంది.. అదే ఆదిత్య ధర్. ‘ఉరి’ సినిమాతో నేషనల్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న ఈ దర్శకుడు, ‘ధురంధర్’ ఫ్రాంచైజీతో ఏకంగా ఇండియన్ బాక్సాఫీస్ లెక్కలనే మార్చేశారు. ఈ క్రేజీ డైరెక్టర్‌తో సినిమా చేయడానికి ఇప్పుడు బాలీవుడ్ కంటే సౌత్ హీరోలే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఒక టాలీవుడ్ స్టార్ హీరో, ఆదిత్య ధర్‌ను ఎలాగైనా తన ప్రాజెక్టులోకి తీసుకురావాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారనే టాక్ ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన ‘ధురంధర్’ రెండు భాగాలు కలిపి ఏకంగా రూ. 3000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డ్ క్రియేట్ చేశాయి. పార్ట్ 1, పార్ట్ 2 చాలా తక్కువ గ్యాప్ లో వచ్చి బాక్సాఫీస్ వద్ద కనివినీ ఎరుగని విధ్వంసం సృష్టించడంతో ఆదిత్య ధర్ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిపోయారు. ఈ ట్రాక్ రికార్డ్ చూసిన మన తెలుగు స్టార్ హీరో, ఇప్పటికే రెండు సార్లు ఈ దర్శకుడికి కబురు పంపినట్లు సమాచారం.

తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆదిత్య విజన్ లో ఉంటే పాన్ ఇండియా రేంజ్ లో వెయ్యి కోట్ల మార్కును ఈజీగా టచ్ చేయొచ్చని ఆ హీరో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్టార్ హీరో తన సన్నిహిత వర్గాల ద్వారా ఆదిత్య ధర్ కు అప్రోచ్ అవ్వడమే కాకుండా, ఒక బడా ప్రొడ్యూసర్ తో కూడా రాయబారం పంపారట. ప్రస్తుతం ఆదిత్య ధర్ తన ‘ధురంధర్’ బాధ్యతల నుంచి ఇప్పుడిప్పుడే ఫ్రీ అవుతున్నారు.

ఈ గ్యాప్ లోనే ఆయనను లాక్ చేయాలని సదరు హీరో పట్టుదలతో ఉన్నట్లు ఇన్ సైడ్ టాక్. రూ. 1000 కోట్ల వసూళ్లు రాబట్టగల సత్తా ఉన్న డైరెక్టర్ల కోసం ఇప్పుడు హీరోల మధ్య గట్టి పోటీ నడుస్తోంది. మరి ఆదిత్య ధర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తారా లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. అయితే ఈ వార్తల్లో ఎంత నిజముందనేది ఇంకా అఫీషియల్ గా తేలాల్సి ఉంది. ఆ స్టార్ హీరో ఎవరనేది కూడా ప్రస్తుతానికి సీక్రెట్ గానే ఉంచారు.

సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి వార్తలు కొన్నిసార్లు హైప్ క్రియేట్ చేయడానికి కూడా పుడుతుంటాయి. ఆదిత్య ధర్ టీమ్ నుంచి కానీ, ఆ హీరో వైపు నుంచి కానీ ఎలాంటి రియాక్షన్ రాకపోవడంతో అందరూ వెయిటింగ్ మోడ్ లో ఉన్నారు. కానీ ప్రొఫెషనల్ గా చూస్తే, ఒకవేళ ఈ కాంబో సెట్ అయితే మాత్రం బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.