ఈ వారం థియేటర్లలో సందడి చేసే చిత్రాలు.. మరి ఓటీటీ?
మరి థియేటర్లలో సందడి చేయబోయే సినిమాలతో పాటు ఇటు ఓటీటీలో కూడా ఎలాంటి చిత్రాలు ఈ వారం ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం.
By: Madhu Reddy | 6 Oct 2025 1:03 PM ISTఅక్టోబర్ నెల మొదలయ్యి అప్పుడే ఐదు రోజులు పూర్తయింది. అందులో భాగంగానే థియేటర్లలో అక్టోబర్ 1న విడుదలైన ధనుష్ 'ఇడ్లీ కొట్టు' , రిషబ్ శెట్టి 'కాంతార చాప్టర్ - 1' చిత్రాలతో పాటు గత నెల సెప్టెంబర్ 25వ తేదీన పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ' సినిమాలు కూడా థియేటర్లలో దూసుకుపోతున్నాయి. వీటితోపాటు ఈ వారం వినోదం పంచడానికి ఇంకొన్ని సినిమాలు సిద్ధమయ్యాయి. మరి థియేటర్లలో సందడి చేయబోయే సినిమాలతో పాటు ఇటు ఓటీటీలో కూడా ఎలాంటి చిత్రాలు ఈ వారం ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం.
శశివదనే..
రక్షిత్ అట్లూరి హీరోగా, కోమలి ప్రసాద్ హీరోయిన్ గా నటించిన చిత్రం శశివదనే. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వంలో గోదావరి నేపథ్యంతో సాగే ఈ కథ లవ్ స్టోరీతో పాటు ఇప్పటివరకు తెరపై చూడని తండ్రీకొడుకుల సెంటిమెంట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ముఖ్యంగా క్లైమాక్స్ ప్రేక్షకులను తప్పకుండా థ్రిల్ చేస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ 10వ తేదీన థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా మంచి ఫీల్ గుడ్ మూవీ అని మేకర్స్ స్పష్టం చేశారు.
కానిస్టేబుల్:
గత కొన్ని రోజులుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న వరుణ్ సందేశ్ ప్రస్తుతం స్ఫూర్తి నింపడానికి కానిస్టేబుల్ గా సిద్ధం అయ్యారు. మధులిక వారణాసి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్యన్ సుభాన్ ఎస్. కె దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కూడా అక్టోబర్ 10వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతోంది. సస్పెన్స్, డ్రామా కామెడీ తో రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో తెలియాల్సి ఉంది.
అరి:
అరి: మై నేమ్ ఈజ్ నో బడీ అనే ఒక ఉపశీర్షిక తో రాబోతున్న ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్, సాయికుమార్, వినోద్ వర్మ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జయశంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ మూడు చిత్రాలు ఈ వారం థియేటర్లలో విడుదలై సందడి చేయనున్నాయి.
ఇటు ఓటీటీలో ఈ వారం స్ట్రీమింగ్ కానున్న చిత్రాలు/ వెబ్ సిరీస్ ల విషయానికి వస్తే..
నెట్ ఫ్లిక్స్:
వార్ 2 : అక్టోబర్ 9
స్విమ్ టు మీ - అక్టోబర్ 10
ది విమెన్ ఇన్ క్యాబిన్ 10 - అక్టోబర్ 10
కురుక్షేత్ర (యానిమేషన్ సిరీస్) - అక్టోబర్ 10
జియో హాట్ స్టార్:
మిరాయ్ - అక్టోబర్ 10
సెర్చ్ : ది నైనా మర్డర్ కేస్ (సిరీస్) - అక్టోబర్ 10
అమెజాన్ ప్రైమ్ వీడియో:
మెయింటెనెన్స్ రిక్వైర్డ్ - అక్టోబర్ 10
సన్ నెక్స్ట్ :
త్రిభానదారి బార్బరిక్ - అక్టోబర్ 10
జీ 5:
స్థల్ - అక్టోబర్ 10
