70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2026 తెలుగు విజేతలు
70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2026లో అల్లు అర్జున్ లాంటి దిగ్గజ హీరో సరసన తేజ సజ్జ లాంటి రైజింగ్ ట్యాలెంట్ పురస్కారం అందుకోవడం నిజంగా గ్రేట్.
By: Sivaji Kontham | 22 Feb 2026 9:30 AM IST70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2026 వేడుక ఫిబ్రవరి 21న కేరళలోని కొచ్చిలో అత్యంత వైభవంగా జరిగింది. `పుష్ప 2: ది రూల్` చిత్రంతో అల్లు అర్జున్ మరోసారి తన సత్తా చాటారు. ఈ వేడుకలో తెలుగు సినిమాకు సంబంధించిన పూర్తి విజేతల జాబితా ఆసక్తిని కలిగించింది.
తెలుగు విజేతల వివరాలు పరిశీలిస్తే...
ఉత్తమ చిత్రం- పుష్ప 2: ది రూల్, ఉత్తమ దర్శకుడు: సుకుమార్ (పుష్ప 2: ది రూల్), ఉత్తమ చిత్రం (విమర్శకులు): లక్కీ బాస్కర్ (వెంకీ అట్లూరి), ప్రధాన పాత్రలో ఉత్తమ నటుడు (మేల్): అల్లు అర్జున్ (పుష్ప 2: ది రూల్) , ఉత్తమ నటుడు (క్రిటిక్స్): తేజ సజ్జా (హను-మాన్), ప్రధాన పాత్రలో ఉత్తమ నటి- నివేథ థామస్ (35 చిన్న కథ కాదు), ఉత్తమ నటి (విమర్శకులు): కాజల్ అగర్వాల్ (సత్యభామ), ఉత్తమ సహాయ నటుడు (మేల్): అమితాబ్ బచ్చన్ (కల్కి 2898 ప్రకటన), ఉత్తమ సహాయ నటుడు (ఫీమేల్): అంజలి (గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి), ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్: దేవిశ్రీ ప్రసాద్: రాంజో ప్రసాద్ శాస్త్రి (చుట్టమల్లె - దేవర: పార్ట్ 1), ఉత్తమ నేపథ్య గాయకుడు (పురుషుడు): శ్రీ కృష్ణ (కుర్చి మడతపెట్టి - గుంటూరు కారం), ఉత్తమ నేపథ్య గాయని (మహిళ): శిల్పా రావు (చుట్టమల్లె - దేవర: పార్ట్ 1), ఉత్తమ డెబ్యూ డైరెక్టర్: యధు వంశీ (కమిటీ కుర్రోళ్లు) ఉత్తమ తొలి పురుషుడు: సందీప్ సరోజ్ (కమిటీ కుర్రోళ్లు) ఉత్తమ తొలి నటి: నయన్ సారిక (గం గం గణేశ), ఉత్తమ కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్ (కూర్చి మడతపెట్టి - గుంటూరు కారం),
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: నితిన్ జిహానీ చౌదరి (కల్కి 2898 యాడ్), రామకృష్ణ & మోనికా (పుష్ప 2: ది రూల్) తదితరులు పురస్కారాలు అందుకున్నారు.
`పుష్ప 2` ప్రభంజనం:
ప్రధాన విభాగాలైన ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీతం వంటి ముఖ్యమైన అవార్డులను ఈ చిత్రం కొల్లగొట్టింది. పుష్ప మొదటి భాగంతో జాతీయ అవార్డు, ఫిల్మ్‌ఫేర్ అందుకున్న బన్నీ ఇప్పుడు రెండో భాగంతో కూడా `ఉత్తమ నటుడు`గా బ్లాక్ లేడీ(పురస్కారం)ని సొంతం చేసుకుని రికార్డు సృష్టించారు. విమర్శకుల ప్రశంసలు పొందిన `లక్కీ భాస్కర్` ఉత్తమ చిత్రం(క్రిటిక్స్ విభాగం)గా నిలవగా, తేజ సజ్జ , కాజల్ అగర్వాల్ తమ నటనకు గుర్తింపు పొందారు.
యువహీరో తేజ సజ్జా వెరీ స్పెషల్:
70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2026లో అల్లు అర్జున్ లాంటి దిగ్గజ హీరో సరసన తేజ సజ్జ లాంటి రైజింగ్ ట్యాలెంట్ పురస్కారం అందుకోవడం నిజంగా గ్రేట్. తన అద్భుతమైన నటనకు గాను తేజ సజ్జా తగిన గుర్తింపు పొందారు.
హను-మాన్ చిత్రంలో హనుమంతు అనే సామాన్య యువకుడి నుంచి సూపర్ హీరోగా మారే పాత్రలో ఈ యువనటుడు చూపిన ప్రదర్శనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అందుకే క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ నటుడిగా గౌరవం దక్కింది. తేజ సజ్జా నేడు తన రేంజ్‌ను హనుమాన్ చిత్రంతో ఒక్కసారిగా పాన్-ఇండియా స్థాయికి పెంచుకున్నారు.
కేవలం తేజ సజ్జకే కాకుండా, ఈ సినిమా ఫిలింఫేర్ 2026లోని పలు విభాగాల్లో గట్టి పోటీ ఇచ్చింది. విజువల్ ఎఫెక్ట్స్ , మేకింగ్ పరంగా ప్రశాంత్ వర్మ దర్శకత్వానికి కూడా మంచి గుర్తింపు లభించింది. తేజ సజ్జా మిరాయ్ కూడా వచ్చే ఏడాది అవార్డులలో సత్తా చాటుతుందని అంచనాలున్నాయి.
