అప్ కమింగ్ లవ్ స్టోరీస్ లైనప్ ఇలా!
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రాబోయే రెండు నెలలు రొమాంటిక్ - యూత్‌ఫుల్ లవ్ స్టోరీల సందడి గట్టిగా ఉండబోతోంది.
By: Srikanth Kontham | 22 Aug 2026 5:00 AM ISTటాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రాబోయే రెండు నెలలు రొమాంటిక్ - యూత్‌ఫుల్ లవ్ స్టోరీల సందడి గట్టిగా ఉండబోతోంది. పెద్ద సినిమాలతో పాటు మిడ్-రేంజ్ చిత్రాలు కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా కొత్త జోడీలు, వైవిధ్యమైన కథలతో వస్తున్న ప్రాజెక్ట్‌లపై ట్రేడ్ వర్గాల్లో, ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.`బేబీ` చిత్రంతో సంచలనం సృష్టించిన ఆనంద్ దేవరకొండ- వైష్ణవి చైతన్య జోడీ మరోసారి థియేటర్లలో అల్లరి చేయడానికి సిద్ధమైంది. సెప్టెంబర్ 11న విడుదల కానున్న `ఎపిక్` చిత్రంపై ఇప్పటికే మంచి హైప్ ఉంది.
పాపులర్ వెబ్ సిరీస్ `90s - ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ ` స్పిన్-ఆఫ్‌గా వస్తున్న ఈ సినిమాపై యూత్‌లో విపరీతమైన ఆసక్తి కనిపిస్తోంది. మరోవైపు టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై వస్తున్న `రోమాంచకం` చిత్రం సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్‌కుమార్ జంటగా నటిస్తున్న సినిమా పల్లెటూరి నేపథ్యంలో సాగే ఇంటెన్స్, వైవిధ్యమైన ప్రేమకథగా తెరకెక్కింది.
ఇక అశోక్ గల్లా - శ్రీ గౌరీ ప్రియ ప్రధాన తారాగణంగా రూపొందుతున్న `వీసా` (వింటార సరదాగా) సినిమా అక్టోబర్ మధ్యలో ప్రేక్షకుల ముందుకు రానుంది. విదేశీ నేపథ్యంలో అక్కడి యువత ఎదుర్కొనే రొమాంటిక్ సవాళ్లు, భావోద్వేగాల ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో శివాత్మిక రాజశేఖర్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. వీటితో పాటు మిడ్-రేంజ్ సినిమాల జాబితాలో మరికొన్ని విభిన్న జోనర్ చిత్రాలు కూడా బాక్సాఫీస్ రేసులో నిలవడానికి పోటీపడుతున్నాయి.
అల్లరి నరేష్ సినిమాలతో పాటు ఇతర క్రేజీ ప్రాజెక్ట్‌లు కూడా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి క్యూ కడుతుండటంతో టాలీవుడ్ బాక్సాఫీస్ కలెక్షన్ల జోరు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంకా అప్పటికప్పుడు రిలీజ్ డేట్ లాక్ చేసే చిత్రాలు కూడా చాలానే ఉన్నాయి. కొంత మంది అగ్ర హీరోలు లాక్ చేసిన తేదీల్లో గనుక రాకపోతే అప్పటికప్పుడు రిలీజ్ తేదీల్ని ప్రకటించి రిలీజ్ చేస్తుంటారు. ఎలాంటి ప్రచారం లేకుండా రిలీజ్ అయిన సినిమాలు కూడా రిలీజ్ తర్వాత మౌత్ టాక్ తో సంచలనం సృష్టిస్తున్నాయి. అలాంటి ప్లానింగ్ తో మరికొంత మంది మేకర్స్ ఉన్నారు.
మొత్తంగా ఈ ఏడాది శరదృతువు సీజన్ పూర్తిగా లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లదే అయ్యేలా ఉంది. కంటెంట్ బలమున్న చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఏ విధంగా అలరిస్తాయనేది త్వరలోనే తేలనుంది.
