Begin typing your search above and press return to search.

ఆ ఇద్దరు హీరోయిన్స్ అన్ లక్కీ..!

తెలుగులో ఒక మోస్తారు క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్ తమ స్టార్ ఫాలోయింగ్ పెంచుకునే క్రమంలో ఇతర భాషల అవకాశాలను చేస్తుంటారు.

By:  Ramesh Boddu   |   22 Jan 2026 11:43 AM IST
ఆ ఇద్దరు హీరోయిన్స్ అన్ లక్కీ..!
X

తెలుగులో ఒక మోస్తారు క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్ తమ స్టార్ ఫాలోయింగ్ పెంచుకునే క్రమంలో ఇతర భాషల అవకాశాలను చేస్తుంటారు. ఆ ప్రయత్నంలో వారికి సక్సెస్ వస్తే కెరీర్ గ్రాఫ్ మరింత పెరుగుతుంది. ఒకవేళ అక్కడ చేదు అనుభవాలు ఎదురైతే తెలుగులోనే కొనసాగుతారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఇద్దరు భామలు ఇక్కడ కాస్త బ్యాడ్ ఫేస్ నడుస్తున్న కారణంగా తమిళ ఎంట్రీ ఇచ్చారు. అక్కడ క్రేజీ సినిమాలతోనే ఈ హీరోయిన్స్ తెరంగేట్రం జరిగింది. కానీ అన్ లక్కీ ఏంటంటే ఆ సినిమాలు వాళ్లకు కలిసి రాలేదు.

ఉప్పెనతో యూత్ ఆడియన్స్ కి..

తొలి సినిమా ఉప్పెనతో యూత్ ఆడియన్స్ కి దగ్గరైంది కృతి శెట్టి. అమ్మడు ఆ సినిమా హిట్ తో అరడజను సినిమాల దాకా చేసింది. ఐతే వాటి ఫలితాలు అమ్మడి ఫేట్ ని మార్చేశాయి. స్టార్ అవుతుందని అనుకున్న కృతి కాస్త వరుస ఫ్లాపులతో కనీసం ఛాన్స్ లు లేని విధంగా కెరీర్ తయారు అయ్యింది. తెలుగులో ఎలాగు అవకాశాలు లేవని తమిళ్ లో ట్రై చేస్తుంది అమ్మడు.

అక్కడ ప్రదీప్ రంగనాథన్ తో ఎల్.ఐ.కె, రవి మోహన్ తో జినీ తో పాటు కార్తితో వా వాతియార్ సినిమా చేసింది. వా వాతియార్ సినిమా అసలైతే డిసెంబర్ లో రిలీజ్ అవ్వాల్సింది కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల రిలీజ్ వాయిదా పడింది. ఫైనల్ గా సంక్రాంతికి సినిమా రిలీజ్ అవగా ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. కార్తి పక్కన కృతి కోలీవుడ్ లో అదరగొట్టేస్తుంది అనుకుంటే అది కుదరలేదు.

శ్రీలీల ధమాకా డాన్స్..

ఇక మరో హీరోయిన్ శ్రీలీల ధమాకా డాన్స్ ప్రేక్షకులను అలరిస్తుంది. కానీ తెలుగులో అమ్మడు వరుస ఫ్లాపులతో కెరీర్ రిస్క్ లో ఉంది. అందుకే తమిళ్ లో ఎంట్రీపై సూపర్ ఎగ్జైట్ అయ్యింది. అంచనాలకు తగినట్టుగానే శివ కార్తికేయన్ పరాశక్తితో శ్రీలీల కోలీవుడ్ ఎంట్రీ జరిగింది. సినిమా కూడా మంచి బజ్ తోనే రిలీజైంది. కానీ కమర్షియల్ గా సినిమా వర్క్ అవుట్ కాలేదు. పరాశక్తిలో శ్రీలీల తన వరకు బాగానే అనిపించింది. ఐతే ఫైనల్ రిజల్ట్ డిజప్పాయింట్ చేసింది.

తెలుగులో రాణించలేని శ్రీలీల, కృతి శెట్టి ఇప్పుడు వారి ఫోకస్ కోలీవుడ్ మీద పెట్టారు. కృతి శెట్టికి అక్కడ ఇంకా లైన్ లో రెండు సినిమాలు ఉన్నాయి. శ్రీలీల మాత్రం పరాశక్తి చేసింది. ఐతే అమ్మడికి బాలీవుడ్ మూవీ ఉంది. కార్తీక్ ఆర్యన్ తో చేస్తున్న లవ్ స్టోరీ మీద చాలా హోప్స్ పెట్టుకుంది శ్రీలీల.

మరి ఈ ఇద్దరి హీరోయిన్స్ కెరీర్ లో కాస్త లక్ తోడై మంచి సినిమాలు పడితే మళ్లీ తిరిగి ఫాంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. శ్రీలీల పట్టు వదలకుండా ప్రయత్నాలు చేస్తుంది. మరోపక్క కృతి కూడా తన ఫోటో షూట్స్ తో ఆడియన్స్ ని ఖుషి చేస్తుంది. ఇద్దరి ప్రయత్నాలు బాగున్నాయి మరి ఎవరి కెరీర్ ఎలా టర్న్ అవుతుంది అన్నది చూడాలి.