డెబ్యూ హిట్ తర్వాత ప్లాప్‌తో షాక్ ఇచ్చిన హీరోలు!
మొదటి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసి, ఆ తర్వాత ప్లాపులతో ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన ఆ టాలీవుడ్ హీరోలెవరో ఇప్పుడు చూద్దాం..
By: Madhu Reddy | 27 May 2026 4:00 AM ISTటాలీవుడ్‌లో మొదటి సినిమాతోనే రాత్రికి రాత్రే స్టార్స్ అయిపోయిన హీరోలు చాలా మంది ఉన్నారు.మొదటి సినిమా హిట్ అవ్వడంతో వీరి కెరీర్ ఓ రేంజ్‌లో దూసుకుపోతుందని అందరూ అనుకుంటారు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే, ఆ తర్వాత వచ్చిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడంతో ఈ హీరోలు కోలుకోలేకపోయారు. మొదటి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసి, ఆ తర్వాత ప్లాపులతో ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన ఆ టాలీవుడ్ హీరోలెవరో ఇప్పుడు చూద్దాం..
వరుణ్ సందేశ్, ఆది :
హ్యాపీ డేస్’ సినిమాతో వరుణ్ సందేశ్ మంచి స్థాయి గుర్తింపు, క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత 'కొత్త బంగారు లోకం' హిట్ అయినా, ఆ తర్వాత వచ్చిన కథల ఎంపిక దెబ్బకొట్టడంతో వరుస ప్లాపులతో వెనుకబడిపోయాడు. అలాగే ఇక డైలాగ్ కింగ్ సాయికుమార్ కొడుకు ఆది కూడా 'ప్రేమ కావాలి' సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. కానీ ఆ తర్వాత 13 ఏళ్ల వరకు సరైన సక్సెస్లేదు ఇటీవల వచ్చిన శంభాలా మూవీ తో ఒక సాలిడ్ హిట్ అందుకున్నాడు.
మెగా హీరో వైష్ణవ్ తేజ్:
మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన పంజా వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' సినిమాతో 100 కోట్ల క్లబ్‌లో చేరి టాలీవుడ్‌ను ఊపేశాడు. మొదటి సినిమాతోనే ఇంతటి భారీ హిట్ కొట్టిన హీరోలు అరుదుగా ఉంటారు. కానీ దురదృష్టవశాత్తూ ఆ తర్వాత వైష్ణవ్ నటించిన 'కొండపొలం', 'రంగ రంగ వైభవంగా', 'ఆదికేశవ' లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టాయి. ఇక సరైన సక్సెస్ పడకపోవడంతో ఇప్పటికీ ఒక సాలిడ్ హిట్ కోసం వెతుకులాటలోనే ఉన్నాడు
అఖిల్ అక్కినేని :
ఇక కింగ్ నాగార్జున వారసుడిగా అఖిల్ ఎంట్రీ ఇచ్చినప్పుడు అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కానీ వినాయక్ దర్శకత్వంలో వచ్చిన 'అఖిల్' సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత 'హలో', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' లాంటి సినిమాలు కాస్త ఫర్వాలేదనిపించినా, భారీ బడ్జెట్‌తో వచ్చిన 'ఏజెంట్' మళ్లీ పెద్ద షాక్ ఇచ్చింది. అఖిల్ ఇప్పటికీ తన రేంజ్‌కు తగ్గ మాస్ హిట్ కోసం కష్టపడుతున్నాడు.ఇక త్వరలో రాబోతున్న లెనిన్ మూవీ పైన ఆశలన్నీ పెట్టుకున్నాడు.
నితిన్, రాజ్ తరుణ్:
యాంగ్ హీరో నితిన్ తన తొలి చిత్రం 'జయం'తో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత 'దిల్' వచ్చినా, కెరీర్ మధ్యలో దాదాపు డజనుకు పైగా వరుస పరాజయాలతో చాలా ఇబ్బంది పడ్డాడు. మొన్న వచ్చిన తమ్ముడు కూడ ఆశించినంత హిట్ కాలేదు. ఇక రాజ్ తరుణ్ కూడా ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ, 'కుమారి 21F' సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టి లక్కీ హీరో అనిపించుకున్నాడు. కానీ ఆ తర్వాత కథల సెలక్షన్ లోపించడంతో వరుసగా ఫ్లాప్స్ వచ్చి రేసులో వెనుకబడిపోయాడు.
సినిమా ఇండస్ట్రీలో మొదటి హిట్ అనేది కేవలం ఎంట్రీ కార్డ్ మాత్రమే అని ఈ హీరోల కెరీర్ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ నిలదొక్కుకోవాలంటే ప్రతి సినిమాకూ అంతే జాగ్రత్తగా కథలను ఎంచుకోవాలి. మరి ఈ హీరోలంతా త్వరలోనే మంచి కంబ్యాక్ ఇచ్చి, మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఆశిద్దాం..
