హీరో కం నిర్మాతలుగా దిగ్విజయంగా!
నేటి తరం హీరోలు నటనకే పరిమితం కాకుండా తమకంటూ సొంత నిర్మాణ సంస్థలను ఏర్పాటు చేసుకుంటున్నారు.
By: Srikanth Kontham | 4 Aug 2026 11:21 AM ISTకాలంతో పాటు నిర్మాణ శైలిలోనూ సంచలన మార్పులు వస్తున్నాయి. నేటి తరం హీరోలు నటనకే పరిమితం కాకుండా తమకంటూ సొంత నిర్మాణ సంస్థలను ఏర్పాటు చేసుకుంటున్నారు. తమ సొంత చిత్రాలకే కాకుండా తోటి నటులతోనూ భారీ క్రేజీ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తూ టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుడుతున్నారు.ఈ జాబితాలో నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై విభిన్నమైన కథలతో పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. తన సినిమాలే కాకుండా కొత్త దర్శకులను, ప్రతిభావంతులైన నటీనటులను ప్రోత్సహిస్తూ యువ హీరోలతోనూ సినిమాలు నిర్మిస్తూ నిర్మాతగానూ తన మార్క్ చూపిస్తున్నారు.
అలాగే అగ్ర హీరో అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా ఎప్పనుంచో నిర్మాణ రంగంలో కొనసాగుతూనే యువ హీరోలతో విభిన్నమైన కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను నిర్మిస్తున్నారు. మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ఇతర బ్యానర్ల భాగస్వామ్యంలో ఇతర హీరోలకు సంబంధించిన ప్రాజెక్ట్‌ల నిర్మా ణంలోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. నందమూరి కళ్యాణ్‌రామ్ ఎన్‌టిఆర్ ఆర్ట్స్ పతాకంపై వైవిధ్యమైన కథలతో ఇతర హీరోల సినిమాలను కూడా విజయవంతంగా నిర్మిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదిం చుకుంటున్నారు.
సూపర్ స్టార్ మహేష్ కూడా జీఎంబీ బ్యానర్ పై కంటెంట్ ఓరియేంటెడ్ సినిమాలు విజయవంతంగా నిర్మిస్తున్నారు. ఇంకా చాలా మంది హీరోలు నిర్మాణంలో పెట్టుబడలు పెడుతున్నారు. వారి పేర్లు బయటకు రాకుండా? కేవలం హీరోగానే ప్రొజెక్ట్ అవుతున్నారు. అవసరం మేర మాత్రమే నిర్మాతగా పేర్లను అధికారికంగా ప్రకటిస్తున్నారు. యువ హీరో కిరణ్ అబ్బవరం సైతం సొంత బ్యానర్‌పై విభిన్న చిత్రాలను నిర్మిస్తూ ప్రయోగాత్మక సినిమాలకు పెద్దపీట వేస్తున్నారు. ఈ విధంగా హీరోలే స్వయంగా నిర్మాతలుగా మారడం వల్ల చిత్ర పరిశ్రమలో ఆర్థిక సమీకరణాలు మారుతున్నాయి.
రెమ్యునరేషన్ తీసుకునే నటుల్లా కాకుండా సినిమా బిజినెస్, మార్కెటింగ్, నాణ్యతా ప్రమాణాలపై పూర్తి అవగా హనతో వ్యవహరిస్తున్నారు. దీంతో టాలీవుడ్‌లో కంటెంట్ ఉన్న చిత్రాలకు మరింత ప్రోత్సాహం లభిస్తోందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. నటులుగా ప్రేక్షకులను అలరిస్తూనే అగ్ర నిర్మాతలుగా బాధ్యతలు మోస్తున్న హీరోల ప్రయాణం టాలీవుడ్ భవిష్యత్తును మరింత బలోపేతం చేస్తోంది. ఇతర నటీనటులకు కూడా ఆదర్శంగా నిలుస్తున్న నిర్మాతలు, తెలుగు సినిమా స్థాయిని జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
