జపానోళ్లు కూడా టాలీవుడ్ అభిమానుల్లా!
ప్రపంచంలో ఎక్కడా లేని సినిమా అభిమానం తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. ఆంధ్రా ప్రాంతం పరంగా చూస్తే పీక్స్ లో ఉంటుంది.
By: Srikanth Kontham | 20 Aug 2025 3:42 PM ISTప్రపంచంలో ఎక్కడా లేని సినిమా అభిమానం తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. ఆంధ్రా ప్రాంతం పరంగా చూస్తే పీక్స్ లో ఉంటుంది. హీరోలను దేవుళ్లగా భావిస్తారు. వారి ఫోటోలకు పాలాభిషేకం , రక్తాభిషేకం చేస్తుంటారు. హీరోయిన్లకు గుడులు గోపురాలు నిర్మిస్తారు. అభిమాన హీరో సినిమా రిలీజ్ అవు తుందంటే థియేటర్ ని కొత్త పెళ్లి కూతురులా ముస్తాబు చేస్తారు. థియేటర్ ఖాళీగా ఉందంటే ఆ టికెట్లు కూడా వారే కొనేసి గొప్ప అభిమానం చాటుకుంటారు. హీరోలను బొమ్మలను ఒంటి మీద పచ్చబొట్టులు వేసుకుంటారు.
జపాన్ లో తెలుగు సినిమా:
బైక్ నెంబర్ ప్లేట్లపై నెంబర్ కు బదులు హీరో బొమ్మలేసుకుంటారు. అదే హీరో కోసం సోషల్ మీడియాలో కొట్లాటకు దిగుతుంటారు. ఇలా ఒకటేంటి తన మనసుకు నచ్చిన హీరో అయితే? అతడి కోసం ప్రాణాలకు సైతం తెగించి ముందకెళ్లే అభిమానం తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో నిత్యం కనిపిస్తూనే ఉంటుంది. తాజాగా ఇదే సంస్కృతి సంప్రదాయాన్ని జపానోళ్లు కూడా పాటిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు విరివిగా జపాన్ లోనూ రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే.
హద్దులు దాటిన అభిమానం
దీంతో తెలుగు హీరోల ప్రాబల్యం అక్కడా భారీగా పెరుగుతోంది. అభిమానులు బలంగా ఏర్పడుతున్నారు. తెలుగు హీరోలు ఏ దేశం వెళ్లినా? వాళ్లను లైవ్ లో చూడటం కోసం జపాన్ అభిమానులు ఆయా దేశాల్లో రెక్కలు కట్టుకుని వాలిపోతున్నారు. ఆ మధ్య ఓ జపాన్ అభిమాని తెలుగులో ఓ పెద్ద స్టార్ ను చూడటం కోసం నేను జపాన్ నుంచి వచ్చానని చెప్పారు. ఆ సమయంలో ప్రాంగణం వద్ద విపరీతమైన క్రౌడ్ ఉంది. అంత మంది జనాన్ని సైతం లెక్క చేయకుండా ఆ అభిమాని అతడి ఆటోగ్రాఫ్ కోసం నానా అవస్తులు పడ్డారు.
జపాన్ హీరోలను మించి
చివరికి ఎలాగూ చేరుకుని తాను అనుకున్నది సాధించారు అనుకోండి. ఆ తర్వాత మరో హీరో కోసం కొంత మంది చైనా, మలేయాషి నుంచి కూడా హైదారాబాద్ కి విచ్చేసారు. ఎందుకంటే నేరుగా కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చామన్నారు. అటుపై ఓ భార్యాభర్తల జంట కూడా మరో హీరోపై అలాంటి అభిమానమే చూపించింది భాగ్యనగరంలో. ఇటీవలే మరో జపాన్ అభిమాని కూడా అలాంటి సాహసమే చేసాడు. జపాన్ లో ఇంత వరకూ ఈ తరహా కల్చర్ లేదు. జపాన్ లోనూ ఏటా ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఎంతో మంది హీరోలున్నారు. వాళ్లను మంచిన ఆదరణ తెలుగు హీరోలకు దక్కడం విశేషం.
