Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్.. హిట్ల వెనుక సీక్రెట్ ఫార్ముల?

టాలీవుడ్‌లో హీరోల పాత్రల ఎంపికలో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. రంగస్థలంలో రామ్ చరణ్, రాజా ది గ్రేట్‌లో రవితేజ, లెనిన్‌లో అఖిల్, ఇట్లు అర్జునలో అనీష్ విభిన్న పాత్రల్లో నటించారు. F3లో వెంకటేశ్, వరుణ్ తేజ్ కామెడీ పాత్రలతో ఆకట్టుకున్నారు. కథకు కొత్తదనం తెచ్చే ఈ ప్రయోగాలకు ఆదరణ పెరుగుతోంది.

By:  Priya Chowdhary Nuthalapti   |   19 Nov 2026 1:25 PM IST
టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్.. హిట్ల వెనుక సీక్రెట్ ఫార్ముల?
X

కాలం మారే కొద్ది మనము మారాలి. సినిమా కథలు కూడా అంతే. తాజాగా టాలీవుడ్ సినిమాల్లో ఇప్పుడు కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. ఒకప్పుడు హీరో అంటే..స్టైలిష్ లుక్, అదిరిపోయే ఫైట్స్ ఉండాలని ప్రేక్షకులు భావించేవారు. కానీ ఇప్పుడు దర్శకులు ఆ పాత పద్ధతికి భిన్నంగా ఆలోచిస్తున్నారు. కథకు అవసరమైతే హీరోలు శారీరక వైకల్యం ఉన్న పాత్రల్లో నటించేందుకు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి పాత్రలు ప్రేక్షకులకు దగ్గరవుతున్నాయి. కొన్ని సినిమాల్లో ఈ ప్రయోగాలు మంచి ఫలితాలను కూడా ఇచ్చాయి.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి కాకా సినిమాలో అనస్వర రాజన్ పాత్రకు మాటలు రావని చిరంజీవి హింట్ ఇచ్చిన సంగతి తెలిసింది. అయితే ఇలా జరగడం మొదటిసారి కాదు.. ఈ మధ్యకాలంలో చాలా సినిమాల్లో ఇలా హీరో లేద హీరోయిన్లకు.. ఏదో ఒక లోపం పెట్టి చూపిస్తున్నారు.

గతంలో రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో వినికిడి లోపం ఉన్న చిట్టిబాబు పాత్రలో నటించారు. ఈ సినిమాలో ఆయన నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. అలాగే రవితేజ రాజా ది గ్రేట్ సినిమాలో అంధుడిగా కనిపించారు. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దర్శకుడు బుచ్చిబాబు సాన కూడా ఇలాంటి విభిన్న పాత్రలకు ప్రాధాన్యత ఎక్కువగానే ఇస్తారు. ఆయన మొదటి సినిమా 'ఉప్పెన'లో వైష్ణవ్ తేజ్ పాత్రకు సంబంధించిన ఓ కీలకమైన శారీరక సమస్య కథలో ముఖ్యమైన అంశంగా నిలిచింది. ఈ విషయం అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది.

ఇక బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన పెద్ది సినిమాలో రామ్ చరణ్ పాత్రకు కూడా శారీరక వైకల్యం చూపించారు. అఖిల్ అక్కినేని నటించిన లెనిన్ సినిమా క్లైమాక్స్ పాత్రలో.. హీరో అంధుడి పాత్రలో కనిపించారు. మరోవైపు ఇట్లు అర్జున సినిమాలో హీరో మూగవాడిగా నటించి తన హావభావాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక కామెడీ సినిమాల్లోనూ ఇలాంటి పాత్రలను ఉపయోగిస్తున్నారు. 'ఎఫ్ 3' సినిమాలో వెంకటేష్ రేచీకటి సమస్యతో, వరుణ్ తేజ్ నత్తితో కనిపించారు. ఈ పాత్రలతో దర్శకుడు అనిల్ రావిపూడి ప్రేక్షకులను నవ్వించారు.

ఇలాంటి పాత్రలు కథకు కొత్తదనాన్ని తీసుకొస్తాయి. పాత్రలు ఎదుర్కొనే సమస్యలు, అవమానాలు, వాటిని అధిగమించే విధానం ప్రేక్షకుల్లో భావోద్వేగాలను కలిగిస్తాయి. అందుకే ప్రస్తుతానికి ఈ ట్రెండ్ తెలుగులో బాగా వర్క్ అవుట్ అవుతున్నట్టు కనిపిస్తోంది.