ఒళ్లు హూనం చేసుకుంటున్న స్టార్స్..!
నెక్స్ట్ పెద్ది కోసం చరణ్ బీభత్సం.. పెద్ది ఫస్ట్ షాట్ లోనే మాస్ గెటప్ తో చరణ్ అదరగొట్టాడు. ఇప్పుడు సినిమాలో మరో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఉండగా దాని కోసం పూర్తి మేకోవర్ చేస్తున్నాడట.
By: Ramesh Boddu | 28 Sept 2025 7:00 AM ISTస్టార్ ఇమేజ్ ని చూసి వాళ్ల మెయింటైనెన్స్ చూసి సూపర్ అనుకుంటాం కానీ సినిమా కోసం వాళ్లు పడే కష్టం.. చేసే హార్డ్ వర్క్.. అనుభవించే బాధ ఎవరికీ తెలియదు. ముఖ్యంగా క్యారెక్టర్ కోసం తమని తాము మార్చుకునేందుకు బీభత్సమైన వర్క్ అవుట్స్ చేస్తారు. మనం స్టార్స్ కదా మమం ఎందుకు చేయాలంటే కుదరదు అతను ఎంత పెద్ద స్టార్ అయినా సరే ఒళ్లు హూనం చేసుకోవాల్సిందే.
ప్రస్తుతం స్టార్ హీరోలు అందరు కూడా చేస్తున్న సినిమాల కోసం బడీ ట్రాన్స్ ఫర్మేషన్ చేస్తున్నారు. ఉన్న పళంగా చేస్తున్న పాత్రల్లో సెట్ అయ్యేలా తమ షేప్ మార్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఫస్ట్ సూపర్ స్టార్ మహేష్ గురించి చెప్పాలి. రాజమౌళితో సినిమా అంటే అది మామూలుగా ఉండదు. గ్లోబ్ త్రొటెన్ సినిమా కోసం మహేష్ ట్రాన్స్ ఫర్మేషన్ ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ ఇవ్వబోతుంది.
పెద్ది కోసం చరణ్..
నెక్స్ట్ పెద్ది కోసం చరణ్ బీభత్సం.. పెద్ది ఫస్ట్ షాట్ లోనే మాస్ గెటప్ తో చరణ్ అదరగొట్టాడు. ఇప్పుడు సినిమాలో మరో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఉండగా దాని కోసం పూర్తి మేకోవర్ చేస్తున్నాడట. దానికి ఫుల్ గా వర్క్ అవుట్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది. పెద్దిలో చరణ్ రెండు డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న రోల్ లో కనిపిస్తాడట. అందుకోసం చరణ్ బాగా కష్టపడుతున్నాడు.
ఇక ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా కష్టపడుతున్నాడు. తన లుక్స్ తోనే ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ చేయాలని చూస్తున్నాడు తారక్. అందుకే సినిమాలో క్యారెక్టర్ కోసం పూర్తిగా ట్రాన్స్ ఫర్మేషన్ అవుతున్నారట. ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ లుక్ ఎలెక్ట్రిఫైయింగ్ గా ఉంటుందని తెలుస్తుంది.
ప్రభాస్ కూడా రాజా సాబ్ కోసం ఫంకీ స్టైల్ స్టైలిష్ లుక్ లో కనిపించనున్నాడు. ఫౌజీలో మళ్లీ వేరే లుక్. సందీప్ వంగ స్పిరిట్ కోసం కొత్త లుక్ ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇలా ప్రభాస్ ట్రాన్స్ ఫర్మేషన్ రెబల్ ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇస్తుంది.
నాని ది ప్యారడైజ్..
న్యాచురల్ స్టార్ నాని వరుస హిట్లతో దూసుకెళ్తున్నాడు. ది ప్యారడైజ్ కోసం నాని మేకోవర్ చూస్తున్నాం.. జడల్ రోల్ లో నాని అదరగొట్టేస్తాడట. అంతేకాదు సినిమాలో నాని మరో లుక్ కూడా ఉంటుందట. అది కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని టాక్.
అల్లు అర్జున్ అట్లీతో చేస్తున్న సినిమాకు కొత్త లుక్ ట్రై చేస్తున్నాడట. ఐతే ఆ సినిమా హాలీవుడ్ రేంజ్ ట్రీట్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
ఇలా ప్రతి హీరో తన సినిమా కోసం కొత్త లుక్ తో సర్ ప్రైజ్ చేయాలని చూస్తున్నారు. ఈ ట్రాన్స్ ఫర్మేషన్ కూడా సినిమాలో క్యారెక్టర్ కి యాప్ట్ అయ్యేలా నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చేలా ఉండాలని చూస్తున్నారు.
