Begin typing your search above and press return to search.

టాలీవుడ్ బాక్సాఫీస్.. ఓవర్సీస్‌లో 3 మిలియన్ కొట్టిన హీరోలు!

తెలుగు సినిమా రేంజ్ ఇప్పుడు కేవలం రెండు రాష్ట్రాలకే పరిమితం కాలేదు. గ్లోబల్ మార్కెట్‌లో మన హీరోలు సృష్టిస్తున్న రికార్డులు మామూలుగా లేవు.

By:  M Prashanth   |   21 Jan 2026 9:32 AM IST
టాలీవుడ్ బాక్సాఫీస్.. ఓవర్సీస్‌లో 3 మిలియన్ కొట్టిన హీరోలు!
X

తెలుగు సినిమా రేంజ్ ఇప్పుడు కేవలం రెండు రాష్ట్రాలకే పరిమితం కాలేదు. గ్లోబల్ మార్కెట్‌లో మన హీరోలు సృష్టిస్తున్న రికార్డులు మామూలుగా లేవు. ముఖ్యంగా ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద 3 మిలియన్ డాలర్ల క్లబ్బులో చేరడం అనేది ఒకప్పుడు అసాధ్యంగా ఉండేది. కానీ ఇప్పుడు మన స్టార్లు అక్కడ కూడా తమ స్టార్ హోదాను పెంచుకుంటూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. ఈ ఘనత సాధించిన హీరోల లిస్టును గమనిస్తే తెలుగు సినిమా సత్తా ఏంటో అర్థమవుతుంది.

ఓవర్సీస్ లో భారీ వసూళ్లు రావాలంటే అవి పాన్ ఇండియా సినిమాలు కావాలి అనుకుంటారు. కానీ చిరంజీవి మాత్రం కేవలం మన శంకరవరప్రసాద్ తెలుగు వెర్షన్ తోనే హై రేంజ్ లో విధ్వంసం సృష్టించి అందరికీ షాక్ ఇచ్చాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చిరు చేసిన కామెడీకి అమెరికా ఆడియన్స్ ఫిదా అయిపోయారు. థియేటర్లలో సెలబ్రేషన్స్ చూస్తుంటే మెగా మేనియా ఏ మాత్రం తగ్గలేదని క్లియర్ గా అర్థమవుతోంది.

​ఈ సక్సెస్ తో 3 మిలియన్ డాలర్ల క్లబ్బులో ఉన్న యంగ్ హీరోల పక్కన మెగాస్టార్ కూడా చేరిపోయారు.

ఈ జాబితాలో రెబల్ స్టార్ ప్రభాస్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. బాహుబలి సిరీస్‌తో మొదలైన ఆయన జైత్రయాత్ర కల్కి వరకు ఏకంగా ఆరు సినిమాలతో 3 మిలియన్ డాలర్ల మార్కును అందుకుంది. ప్రభాస్ సినిమా అంటే చాలు ఓవర్సీస్ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారని ఈ లెక్కలు చెబుతున్నాయి. అది కూడా సక్సెస్ ఫెయిల్యూర్స్ సంబంధం లేకుండా వెళుతున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూడు సినిమాలతో సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు. RRR తో మొదలైన ఆయన గ్లోబల్ క్రేజ్ దేవర, వార్ 2 చిత్రాల వరకు కొనసాగింది. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చెరో రెండు సినిమాలతో తమ సత్తా చాటారు. పుష్ప 2 తో బన్నీ, రంగస్థలం RRR తో చరణ్ ఈ ఫీట్ సాధించి తమకంటూ ఒక ప్రత్యేక వర్గం ప్రేక్షకులను సంపాదించుకున్నారు.

ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే యంగ్ హీరో తేజ సజ్జ కూడా ఈ లిస్టులో ఉండటం. హనుమాన్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ కుర్ర హీరో, రీసెంట్‌గా మిరాయ్ మూవీతో కూడా 3 మిలియన్ డాలర్ల క్లబ్బులో చేరి తన రేంజ్ ఏంటో నిరూపించుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు భారత్ అనే నేను సినిమాతో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG తో, అలాగే మెగాస్టార్ చిరంజీవి తన లేటెస్ట్ హిట్ మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో ఈ జాబితాలో నిలిచారు.

ఇప్పుడు తెలుగు హీరోలకు ఓవర్సీస్ లో ఉండే మార్కెట్ వాల్యూ ఏకంగా కోట్లలో ఉంటోంది. కేవలం పెద్ద హీరోలే కాకుండా కంటెంట్ బాగుంటే చిన్న హీరోలు కూడా మిలియన్ డాలర్ల వసూళ్లను సాధిస్తున్నారు. భవిష్యత్తులో రాబోయే భారీ ప్రాజెక్టుల వల్ల ఈ 3 మిలియన్ డాలర్ల క్లబ్బులో మరిన్ని కొత్త సినిమాలు చేరే అవకాశం ఉంది.

3 మిలియన్ డాలర్ల మార్క్ అందుకున్న తెలుగు హీరోలు, సినిమాలు:

ప్రభాస్: 6 సినిమాలు (బాహుబలి 1, బాహుబలి 2, సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి)

ఎన్టీఆర్: 3 సినిమాలు (RRR, దేవర, వార్ 2)

అల్లు అర్జున్: 2 సినిమాలు (అల వైకుంఠపురములో, పుష్ప 2)

రామ్ చరణ్: 2 సినిమాలు (రంగస్థలం, RRR)

తేజ సజ్జ: 2 సినిమాలు (హనుమాన్, మిరాయ్)

మహేష్ బాబు: 1 సినిమా (భారత్ అనే నేను)

పవన్ కళ్యాణ్: 1 సినిమా (OG)

చిరంజీవి: 1 సినిమా (మన శంకరవరప్రసాద్ గారు)