న్యూ ఇయర్ స్పెషల్.. కొత్త పోస్టర్లతో ఆకట్టుకున్న సెలబ్రిటీస్!
కొత్త ఏడాది అటు ప్రేక్షకులలో సరికొత్త జోష్ నింపడానికి ఇప్పటికే కుర్ర హీరోలను మొదలుకొని స్టార్ హీరోల వరకు తమ సినిమాలకు సంబంధించి కొత్త పోస్టర్లను విడుదల చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు .
By: Madhu Reddy | 1 Jan 2026 10:38 PM ISTకొత్త ఏడాది అటు ప్రేక్షకులలో సరికొత్త జోష్ నింపడానికి ఇప్పటికే కుర్ర హీరోలను మొదలుకొని స్టార్ హీరోల వరకు తమ సినిమాలకు సంబంధించి కొత్త పోస్టర్లను విడుదల చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు . అంతేకాదు ఈ కొత్త ఏడాది న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేసిన ప్రతి పోస్టర్ కూడా ఆడియన్స్ లో అంచనాలు పెంచుతున్నాయి. మరి ఈ నూతన సంవత్సర సందర్భంగా ఎవరెవరు తమ పోస్టర్లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారో ఇప్పుడు చూద్దాం.
స్పిరిట్ - ప్రభాస్:
ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్.. మారుతీ దర్శకత్వంలో ది రాజా సాబ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదల కాబోతోంది. అలాగే మరోవైపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా మొదలవగా.. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా అర్ధరాత్రి 12 గంటలకు ఈ సినిమా నుండి ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో ప్రభాస్ తోపాటు హీరోయిన్ త్రిప్తి కూడా ఉండడం గమనార్హం.
ది బ్లాక్ గోల్డ్ -సంయుక్త మీనన్:
సార్ , విరూపాక్ష వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సంయుక్త మీనన్ తాజాగా లేడీ ఓరియంటెడ్ మూవీ ది బ్లాక్ గోల్డ్. ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. సమ్మర్లో రిలీజ్ కానున్న ఈ చిత్రం నుండి తాజాగా మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఇందులో సంయుక్త గాయాలతో ఒక చేత్తో గన్ను పట్టుకుని.. సీరియస్ లుక్కులో కనిపించింది. యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రాబోతున్న ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ఈ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇక ఈ చిత్రాన్ని యోగేష్ కేఎంసీ దర్శకత్వం వహించగా.. మాగంటి పిక్చర్స్ తో హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా నిర్మించారు.
ది పారడైజ్ - నాని:
ఇదివరకే దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నాని మళ్లీ అదే డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో ది పారడైజ్ అనే సినిమాను చేస్తున్నారు. మార్చి 26న విడుదల కాబోతున్న ఈ సినిమా నుంచి తాజాగా నాని పోస్టర్ ను పంచుకున్నారు మేకర్స్. ఇందులో నాని కళ్ళకు గ్లాసెస్ పెట్టుకొని జడ వేసుకొని యాక్షన్ లుక్కులో కనిపించారు. జడల్ జమన అంటూ నాని పోస్టర్ ను చిత్ర బృందం పంచుకుంది.
ఉస్తాద్ భగత్ సింగ్ - పవన్ కళ్యాణ్:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో గబ్బర్ సింగ్ సినిమా చేసి మంచి విజయం అందుకున్నారు. ఇప్పుడు మళ్లీ అదే డైరెక్టర్ తో 13 ఏళ్ల తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నారు. ఈ న్యూ ఇయర్ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్టైలిష్ గా ఒక చేతిలో గన్ మరొక చేతిలో రేడియో పట్టుకున్న ఆయన పోస్టర్ను పంచుకున్నారు మేకర్స్. అంతేకాదు మరో కొత్త ప్రాజెక్టును కూడా ఆయన ప్రకటించారు.
ఇక వీటితోపాటు అఖిల్ - లెనిన్, సూర్య - కరుప్పు, ప్రభాస్ - ది రాజా సాబ్, రవితేజ - భర్త మహాశయులకు విజ్ఞప్తి, విజయ్ దళపతి - జననాయగన్ చిత్రాలతో పాటు మరికొన్ని పోస్టర్లు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
