Begin typing your search above and press return to search.

సెప్టెంబర్ చిత్రాలు.. US తెలుగు ప్రజలు అంత ఖర్చు చేశారా?

అయితే ఇప్పుడు అమెరికాలోని తెలుగు ప్రజలు.. టాలీవుడ్ చిత్రాలపై తమ మక్కువను మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. నిన్నటితో 2025లో సెప్టెంబర్ నెల పూర్తవ్వగా.. అనేక సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

By:  M Prashanth   |   1 Oct 2025 8:12 PM IST
సెప్టెంబర్ చిత్రాలు.. US తెలుగు ప్రజలు అంత ఖర్చు చేశారా?
X

అమెరికాలో తెలుగు సినిమా అంటే హడావుడి ఓ రేంజ్ లో ఉంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఎలా సెలబ్రేషన్స్ జరుగుతాయో అక్కడ కూడా సేమ్ అలాగే జరుగుతున్నాయి. డల్లాస్, న్యూజెర్సీ, చికాగో సహా అనేక నగరాల్లోని థియేటర్స్ వద్ద తెలుగు చిత్రాలు రిలీజైతే పండుగలా జరుపుకుంటారు.

దాదాపు ప్రతి తెలుగు హీరోకు కూడా అక్కడ సంఘాలు ఉన్నాయంటే.. అక్కడ టాలీవుడ్ చిత్రాలకు ఎంతటి మార్కెట్ ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. తమ అభిమాన హీరోల సినిమా విడుదల అయ్యే సమయంలో.. రకరకాలుగా సెలబ్రేట్ చేస్తుంటారు. అదే సమయంలో థియేటర్స్ లో సినిమాలు చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తారు.

అయితే ఇప్పుడు అమెరికాలోని తెలుగు ప్రజలు.. టాలీవుడ్ చిత్రాలపై తమ మక్కువను మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. నిన్నటితో 2025లో సెప్టెంబర్ నెల పూర్తవ్వగా.. అనేక సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అంతే కాదు.. దాదాపు అన్ని చిత్రాలు కూడా మంచి విజయాన్ని సాధించాయి. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టాయి.

ఇప్పుడు ఆ సినిమాలను చూసేందుకు అమెరికాలోని తెలుగు ప్రజలు.. ఏకంగా 10 మిలియన్ల డాలర్లకుపైగా ఖర్చు చేశారు. ఇండియన్ కరెన్సీలో దాదాపు.. రూ.85 కోట్లు. దీంతో సినిమాల పట్ల వారికి ఉన్న ఇంట్రెస్ట్ క్లియర్ గా తెలుస్తోంది. తద్వారా టాలీవుడ్ చిత్రాలకు తోడ్పాడు అందిస్తున్నారని చెప్పాలి.

అయితే ఆ 10 మిలియన్ డాలర్స్ లో పవన్ కళ్యాణ్ ఓజీ మూవీదే ఎక్కువ భాగం ఉండడం విశేషం. ఇప్పటి వరకు ఆ సినిమా అక్కడ 5.3 మిలియన్ డాలర్స్ ను వసూలు చేసింది. ఓజీ తర్వాత మిరాయ్ ఉంది. రీసెంట్ గా అక్కడ తేజ సజ్జా మూవీ.. మూడు మిలియన్ డాలర్స్ మార్క్ ను టచ్ చేసి సత్తా చాటింది.

చిన్న మూవీగా విడుదలై పెద్ద విజయం సాధించిన లిటిల్ హార్ట్స్.. 1.2 మిలియన్ డాలర్స్ ను ఆర్జించింది. అదే సమయంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధపురి 315,000 డాలర్లు, అనుష్క శెట్టి ఘాటి 83,000 డాలర్లు వసూలు చేశాయి. మొత్తానికి ఒక్క సెప్టెంబర్ నెలలోనే ఎన్ఆర్ఐలు తెలుగు సినిమాల కోసం 85 కోట్ల రూపాయిలు ఖర్చు చేశారు. మరి 2025 మొత్తంగా లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.