Begin typing your search above and press return to search.

తమ్ముడు తప్పిపోయాడు.. వెరైటీ టైటిల్ తో తెలుగు సినిమా

ఈ క్రమంలోనే తాజాగా త‌మ్ముడు త‌ప్పిపోయాడు అనే వెరైటీ టైటిల్ ను తెలుగు ఫిల్మ్ ఛాంబ‌ర్‌లో రిజిస్ట‌ర్ చేయించారట.

By:  M Prashanth   |   8 Aug 2025 2:01 AM IST
తమ్ముడు తప్పిపోయాడు.. వెరైటీ టైటిల్ తో తెలుగు సినిమా
X

ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిత్రానికి టైటిల్ పెట్టాలంటే చాలా ఆలోచించేవారు. టైటిల్ కు ఓ అర్థం, పరమార్థం ఉండేలా చూసుకునేవారు. రాను రానూ ఈ పరంపర మారింది. సినిమా టైటిల్ ఎక్కువ మందికి చేరాలి, సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలన్న ఉద్దేశంతో క్యాచీ పదాలు వెతికి మరీ టైటిల్ గా పెడుతున్నారు.

గుండెజారి గల్లంతయ్యిందే, చిన్నదాన నీ కోసం, బిచ్చగాడు, పిజ్జా, ఐస్ క్రీమ్, పార్కింగ్, గుడ్ నైట్ ఇలాంటి టైటిల్స్ తో సినిమాలు తెరకెక్కించారు. ఇలా డిఫరెంట్ పేర్లతో వచ్చిన సినిమాలు ప్రేక్షకుల్లోకి ఎక్కువగా రీచ్ అయ్యాయి కూడా. ఇక ప్రస్తుతం రోజుల్లో సోషల్ మీడియా హవా నడుస్తోంది. ఏ మ్యాటర్ అయినా నిమిషాల్లో వైరల్ అవుతోంది.

అందుకే మేకర్స్ ఇంకాస్త ముందుకు ఆలోచించి.. ఇంకా క్యాచీ పదాలను వెతికి టైటిల్ పెడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా త‌మ్ముడు త‌ప్పిపోయాడు అనే వెరైటీ టైటిల్ ను తెలుగు ఫిల్మ్ ఛాంబ‌ర్‌లో రిజిస్ట‌ర్ చేయించారట. ఈ సినిమా అడల్ట్ కామెడీ జానర్ ో తెరకెక్కనుందని తెలుస్తోంది. అంతే కాదు ఇందులో ఓ పాపులర్ హీరోనే నటిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

అయితే సినిమా గురించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు ఇంకాస్త షాకింగ్ గానే ఉంటుందట. మరి ఆ స్టార్ హీరో ఎవరు, ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నదెవరు, నిర్మిస్తున్న నిర్మాతలు ఎవరు అనే వివరాలు త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి సమాచారం కోరకు మరికొంత కాలం ఆగాల్సిందే

కాగా, ఏ సినిమానైనా తెరకెక్కించేముందు టైటిల్ ముఖ్యం. అయితే ఆ టైటిల్ ను సంబంధింత ఇండస్ట్రీకి చెందిన ఛాంబర్ లో రిజిస్టర్ చేసుకోవడం ముఖ్యం. లేదంటే ఆ టైటిల్ పైన మేకర్స్ కు ఎలాంటి హక్కులు ఉండవు. అందుకే కొంతమంది దర్శకులు, నిర్మాతలు సినిమా ప్రారంభం అవ్వడానికి చాలా నెలల ముందే తాము అనుకున్న టైటిల్ ను రిజిస్టర్ చేసుకొని పెట్టుకుంటారు. గతంలో టైటిల్ హక్కుల విషయంలో అనేకసార్లు వివాదాలు జరిగాయి కూడా.