Begin typing your search above and press return to search.

దీపావళి సినిమాలు.. బిజినెస్ లెక్కలు ఇలా..

అయితే ఆ నాలుగు సినిమాలకు సంబంధించి ఇప్పటికే మేకర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బిజినెస్ డీల్స్ ను కంప్లీట్ చేశారు.

By:  M Prashanth   |   15 Oct 2025 4:00 AM IST
దీపావళి సినిమాలు.. బిజినెస్ లెక్కలు ఇలా..
X

పండుగ వస్తుందంటే చాలు.. వివిధ సినిమాలు బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయ్యేందుకు ఎప్పుడూ సిద్ధమవుతుంటాయి. ఇప్పుడు మరికొద్ది రోజుల్లో దీపావళి పండుగ రానుండగా.. పలు చిత్రాలు థియేటర్స్ లో విడుదల అవ్వనున్నాయి. తెలుసు కదా, డ్యూడ్, కె- ర్యాంప్, మిత్రమండలి చిత్రాలు దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ప్రియదర్శి, విష్ణు ఓఐ, రాగ్‌ మయూర్‌, నిహారిక ఎన్‌ఎం లీడ్ రోల్స్ లో నటించిన కామెడీ ఎంటర్టైనర్‌ మిత్రమండలి మూవీ అక్టోబర్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన తెలుసు కదా మూవీ.. అక్టోబర్ 17వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో సందడి చేయనుంది.

అదే రోజు లవ్‌ టుడే, రిటర్న్‌ ఆఫ్‌ డ్రాగన్‌ చిత్రాలతో తెలుగులో కూడా మంచి క్రేజ్‌ సొంతం చేసుకున్న కోలీవుడ్‌ యంగ్‌ హీరో ప్రదీప్‌ రంగనాథన్‌ నటించిన లేటెస్ట్ మూవీ డ్యూడ్‌ విడుదల కానుంది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ కె- ర్యాంప్ మూవీ అక్టోబర్ 18వ తేదీన విడుదల కానుంది.

అయితే ఆ నాలుగు సినిమాలకు సంబంధించి ఇప్పటికే మేకర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బిజినెస్ డీల్స్ ను కంప్లీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన థియేట్రికల్ రైట్స్ ను ఇప్పటికే సేల్ చేశారు. మిత్రమండలి మూవీని మేకర్స్ సొంతంగా రిలీజ్ చేయనుండగా, మిగతా మూడు చిత్రాల హక్కులు సాలిడ్ నెంబర్స్ కు సేల్ చేశారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ లెక్కలు ఇలా ఉన్నాయి.

తెలుసు కదా- రూ.16.83 కోట్లు

డ్యూడ్- రూ.9.81 కోట్లు

కె- ర్యాంప్- రూ.6.39 కోట్లు

మిత్రమండలి- రూ.4 కోట్లు (సొంత రిలీజ్)

నైజాం ఏరియా

తెలుసు కదా- రూ.8.01 కోట్లు

డ్యూడ్- రూ.4.5 కోట్లు

కె- ర్యాంప్ - రూ.1.98 కోట్లు

ఆంధ్ర ఏరియా

తెలుసు కదా- రూ.6.3 కోట్లు

డ్యూడ్- రూ.3.78 కోట్లు

కె- ర్యాంప్- రూ.3.15 కోట్లు

సీడెడ్ ఏరియా

తెలుసు కదా- రూ.2.52 కోట్లు

డ్యూడ్- రూ.1.53 కోట్లు

కె- ర్యాంప్- రూ.1.26 కోట్లు